వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఉన్నతాధికారుల భేటీ

April 9, 2019

సజావుగా ఎన్నికల కోసం ఏర్పాటు : నగర పోలీస్‌ ‌కమిషనర్‌సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి, అదనపు డీజీ జితేందర్‌, ‌సంయుక్త సీఈవోలు అమ్రపాలి, రవికిరణ్‌ ‌సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ‌నిర్వహణ, ఏర్పాట్లపై సక్షించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ‌పక్రియ కొనసాగనుంది. నిజామాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గం పరిధిలో మాత్రం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. నక్సల్స్ ‌ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ఉం‌టుంది. రాష్ట్రంలో 2,97,08,599 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,49,30,726 మంది పురుషులు.. 1,47,76,370 మంది మహిళలు, 1504 మంది ఇతరులు, 11,320 మంది సర్వీస్‌ ‌వోటర్లు, 1,731 మంది ఎన్నారై ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 34,604 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఫొటో ఓటర్‌ ‌స్లిప్‌లను గుర్తింపుకార్డులుగా పరిగణించడం లేదని, ఈసీఐ ఆదేశాల మేరకు ఎపిక్‌ (ఓటరు గుర్తింపు) కార్డు లేదా మరో 11 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్‌ ‌కేంద్రానికి తీసుకురావాలని ఓటర్లకు సీఈవో సూచించారు. 1) పాస్‌పోర్ట్, 2) ‌డ్రైవింగ్‌ ‌లైసెన్స్, 3) ‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రభుత్వరంగ సంస్థలు/ పబ్లిక్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీలు జారీచేసిన ఉద్యోగుల ఫొటో గుర్తింపుకార్డు, 4) బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోతోసహా జారీచేసిన పాస్‌ ‌పుస్తకాలు, 5) పాన్‌కార్డు, 6) ఎన్పీఆర్‌ ‌కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్‌కార్డు, 7) నరేగా జారీచేసిన ఉపాధిహా పత్రం, 8) ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ జారీచేసిన స్మార్ట్‌కార్డ్, 9) ‌ఫొటోజత చేసి ఉన్న పింఛన్‌ ‌పత్రాలు, 10) ఎంపీ/ ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు పత్రం, 11) ఆధార్‌ ‌కార్డు.. వీటిల్లో ఏదో ఒక గుర్తింపుకార్డు చూపించినవారిని మాత్రమే వోటు వేయనిస్తారని తెలిపారు.
సజావుగా ఎన్నికల కోసం ఏర్పాట్లు..జంటనగరాల్లో భారీగా బందోబస్తు : పోలీస్‌ ‌కమిషనర్‌
‌హైదరాబాద్‌ ‌నగర పోలీసు కమిషనరేట్‌ ‌పరిధిలో లోక్‌సభ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అంజనీ కుమార్‌ ‌వెల్లడించారు. ఎన్నికల బందోబస్తుపై అంజనీ కుమార్‌ ‌డియాతో మాట్లాడారు. సిటీ కమిషనరేట్‌ ‌పరిధిలో 4 పార్లమెంట్‌ ‌స్థానాలున్నాయి. సికింద్రాబాద్‌, ‌హైదరాబాద్‌ ‌పూర్తిగా మా పరిధిలో ఉన్నాయి. మల్కాజ్‌గిరి, చేవెళ్లలో కొన్ని అసెంబ్లీ స్థానాలున్నాయి. 16 వేల మంది పోలీసు సిబ్బందితో పాటు 12 కేంద్ర కంపెనీలతో భద్రత ఏర్పాటు చేశాం. పోలింగ్‌, ‌లెక్కింపు రోజున సిటీ సీపీ నోడల్‌ అధికారిగా ఉంటారు. 60 తక్షణ స్పందన బృందాలు, 70 ప్రత్యేక దళాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా పరిధిలో 12 చెక్‌పోస్టులు, 222 పికెట్‌ ‌బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. మొత్తం 518 ఇంటర్నల్‌ ‌చెక్‌పోస్టు, పికెట్స్ ‌పని చేస్తున్నాయి. ఎన్నికల విధుల్లోని సిబ్బందికి హై ఫ్రీక్వెన్సీ హ్యాండ్‌ ‌సెట్లు ఇచ్చాం. ఇప్పటి వరకు 226 ఫ్లాగ్‌ ‌మార్చ్‌లు నిర్వహించాం. ఎన్నికల తర్వాత 15 లెక్కింపు కేంద్రాల వద్ద సీఏపీఎఫ్‌తో భద్రత కల్పిస్తాం. ఇప్పటి వరకు రూ. 20.23 కోట్లకు పైగా నగదు పట్టుకున్నాం. 1,734 లీటర్ల మద్యం, 40 కిలోల గంజాయిని సీజ్‌ ‌చేశాం. రూ. 1.60 లక్షల విలువ చేసే గుట్కా పట్టుకున్నాం. 1,885 మందిని బైండోవర్‌ ‌చేశాం. 933 మందికి నాన్‌బెయిలబుల్‌ ‌వారెంట్లు జారీ చేశాం. ఇప్పటి వరకు 4,618 ఆయుధాలు డిపాజిట్‌ ‌చేశారు. 3,700 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నాం అని సీపీ అంజనీ కుమార్‌ ‌తెలిపారు