Take a fresh look at your lifestyle.

ఎగుమతి రంగంపై.. ప్రపంచీకరణ ప్రభావం!

భారతదేశ ప్రధాని 59 దేశాలను 41 సార్లు సందర్శించినప్పటికీ భారతదేశం యొక్క ఎగుమతులను పెంచలేక పోయారన్న విమర్శలు వినబడుతున్నాయి. 2017లో ప్రపంచ దేశాలు జరిపిన ఎగుమతుల్లో భారతదేశం వాటా 1.7శాతం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతిదారులలో భారత్‌ ‌స్థానం 20తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచ ఎగుమతులలో మొదటి ఐదు స్థానాలను చైనా 12.8శాతం, అమెరికా 8.7శాతం, జర్మనీ 8.2శాతం, జపాన్‌ 3.9 ‌శాతం, నెదర్లాండ్‌ 3.7‌శాతంతో ఆక్రమించినాయి. వీటితో పోల్చుకుంటే మానవ వనరులకు పెట్టింది పేరుగా భారతదేశాన్ని చెప్పుకుంటున్నప్పటికీ ఉత్పత్తులలో ప్రపంచంలోని చిన్న దేశాలతో సైతం సరితూగ లేక పోతున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఒక నిర్దిష్టమైన జాతీయ ప్రణాళిక లేకపోవడమే.శాస్త్ర సాంకేతిక, పరిజ్ఞానం ఎంత పురోభివృద్ధి సాధించిందో ఇందుకనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా వర్తక వాణిజ్య విధానం కూడా అదే మోతాదులో అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఎటువంటి జంకు లేదు. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చెందిన దేశాలు వర్తక వాణిజ్య విషయంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగడానికి ప్రధానమైన కారణం 1994లో అమలులోకి వచ్చిన ప్రపంచ వర్తక వాణిజ్య సంస్థ(డబ్ల్యుటివో). ఇది అమలులోనికి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశాలలో ఉత్పత్తి అయిన వస్తువులను ప్రపంచంలో ఏ మూలలోనైనా అమ్ముకోవడానికి వీలు కలిగింది. మొదట్లో భారతదేశం కూడా ఈ సంస్థలో సభ్యత్వం తీసుకోవడానికి వెనుకాడినప్పటికీ ఆ తర్వాత అంతర్జాతీయ వొత్తిడులకులోనై డబ్ల్యూటీవోలో భాగస్వాములు కావల్సి వచ్చింది. దీంతో ప్రపంచ మార్కెట్‌ ‌భారతదేశానికి రావడానికి సులభతరం అయిందని చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాణిజ్య విస్తరణ కోసం తమ దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులను అమ్ముకోవడానికి భారతదేశం వంటి పెద్ద మార్కెట్‌ ‌వ్యవస్థ నిర్మాణం చేసుకోవడానికి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూడడం వల్ల ప్రపంచంలో భారతదేశం వస్తు విక్రయ కేంద్రంగా పేర్కొనబడింది! కేవలం ఉత్పాదక రంగాల్లో తయారైన వస్తువులతో పాటుగా వ్యవసాయ రంగం నుండి ఉత్పత్తయిన ఆహారధాన్యాలను కూడా విక్రయించడానికి ప్రపంచ దేశాలు ఉర్రూతలూగుతున్నాయి! భారతీయ పాలకులు ప్రపంచ దేశాలను పర్యటించినప్పుడు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ దేశాలను కోరడం వల్ల అభివృద్ధి చెందిన దేశాలు, పెట్టుబడిదారులు భారతదేశంలో పరిశ్రమలు స్థాపించి ఇక్కడనే మార్కెట్‌ ఏర్పాటు చేసుకోవడానికి మన ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు ప్రపంచ మార్కెట్‌ ‌విస్తరించడానికి దోహదపడుతున్నాయని చెప్పవచ్చు! 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం తన మొదటి వాణిజ్య విధానాన్ని 2015 ఏప్రిల్‌ ఒకటో తేదీన విడుదల చేసింది! ఈ వాణిజ్య విధానం 2020 నాటికి అమలులో ఉంటుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య స్థితిగతుల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి! భారతదేశం నుంచి వస్తువులు ఎగుమతుల (మిస్‌), ‌సేవల ఎగుమతుల పథకం(సిస్‌) ‌కింద వస్తు సేవల ఎగుమతులను ఇబ్బడిముబ్బడిగా పెంచాలని వాణిజ్య విధానం ఉద్దేశిస్తుంది. భారతదేశంలో తయారైన వస్తువులు ఎగుమతికి మౌలిక వసతుల పరంగా ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడానికి మిస్‌ ‌పథకం కింద చర్యలు తీసుకుంటారు. ఈ పథకం కింద 2018 -19 వార్షిక ఎగుమతులలో ప్రోత్సాహకాలుగా రూపాయలు 30 ,818 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు! ఈ పథకాలపై భారతదేశం నుండి అనేక తయారీ వస్తువులను ఎగుమతి చేయడానికి దోహదపడుతుందని భావించారు. ముఖ్యంగా రెడీమేడ్‌ ‌దుస్తులు, చిన్నతరహా పరిశ్రమలపై ఉత్పత్తి అయిన వస్తువులు ఎగుమతులలో ప్రధానమైనవి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య పరమైన ఎగుమతులను పెంచడానికి అనుమతులకు గాను ఏక గవాక్ష పద్ధతి షిఫ్ట్‌ను 2016 ఏప్రిల్‌ 1 ‌నుంచి ప్రవేశపెట్టింది. ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీవోలో సభ్యత్వం కలిగిన దేశాలన్నీ కూడా తను మార్కెట్‌ ‌విస్తరణ కోసం ప్రపంచంలోని అన్ని మూలలో వస్తు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి ఇందుకు ప్రధానమైన దేశం భారతదేశాన్ని పక్కనే ఉన్న చైనా వస్తు ఉత్పత్తి రంగాలలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది అనడానికి సందేహం లేదు. భారతదేశంలో చైనా ఉత్పత్తులు గుండుసూది నుండి మొదలు కొంటే ప్రతి రంగంలో విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయి, వీటితో పాటుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని జపాన్‌, ఇం‌గ్లాండ్‌, అమెరికా వంటి కొన్ని దేశాలు భారతదేశంలో తమ వస్తువులను విస్తృతంగా అమ్ముకోవడానికి మార్కెట్లను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు! భారతదేశం నుంచి గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాలలో ఎగుమతుల ద్వారా లభించిన ఆదాయం వరుసగా 31 వేల కోట్ల డాలర్లు, 20 6200, కోట్ల డాలర్లు, 27 వేల 500 కోట్ల డాలర్లు, 30 వేల 200 కోట్ల డాలర్లు మాత్రమే అంటే 2014 ఏప్రిల్‌ ‌నుంచి 2018 మార్చి వరకు నాలుగేళ్లలో ఎగుమతులు ఏమాత్రం పెరగలేదు. నిజం చెప్పాలంటే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా స్థూల జాతీయోత్పత్తి మధ్య నిష్పత్తి అంతరం గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వరకు (11.6 శాతానికి) పడిపోయిందని చెప్పవచ్చు. ప్రపంచంలోని అభివృద్ధిచెందిన దేశాలలో ఎగుమతులు పెరుగుతుండగా భారతదేశం వాటిని అందుకోలేకపోయిందనడానికి ఇది ప్రధాన నిదర్శనం. 2018 19 వార్షిక ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి ఏడు శాతానికి పెంచాలని భావించినప్పటికీ ఆశించిన మేర సాధించలేదని చెప్పవచ్చు. 2009-13, వార్షిక సంవత్సరాలలో ప్రపంచమంతటా వస్తు ఎగుమతులు 3.3శాతం, 2014-18. మధ్య మూడు శాతం పెరిగాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ‌తెలియజేసింది. ఈ మధ్యకాలంలో భారతదేశ ఎగుమతి విధానంలో స్తంభనకు ప్రధానమైన కారణం 2018 నవంబర్‌ ఎనిమిదో తారీకున భారతదేశంలో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు. తద్వారా భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు కేవలం భారత దేశంలోని బడా బాబులను నల్ల డబ్బును బయటకు తీయాలని ఆలోచనతో ప్రభుత్వం ప్రకటించిన విధానాన్ని పరిశీలిస్తే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు, ముఖ్యంగా ఉత్పత్తి రంగం చాలావరకు కుంటుపడిందని, దీనితో భారతీయ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టలేక అంతర్జాతీయ స్థాయిలో వస్తు ఉత్పత్తులను పెంచలేక పోయన్నది నిపుణులు అంటున్న మాటలు. భారత దేశ జిడిపి తగ్గడం వల్ల, అంతర్జాతీయ స్థాయిలో భారత ఎగుమతులు విస్తరించక లేకపోవడం వల్ల భారతదేశం ఆర్థికంగా కొత్త వరకు నష్టపోయిన విషయం ఇక్కడ చర్చించుకోవలసిన అవసరం ఉంది! 2015-20 మధ్య విదేశీ వాణిజ్య విధానం లో యువతకు ఉపాధి కల్పన దోహదపడుతుందని చాలా మంది మొదటి భావించారు. కానీ ఆశించిన స్థాయిలో భారతదేశ నిరుద్యోగ సమస్యను నిర్మూలించడంలో ప్రభుత్వాలు చేపట్టిన సూక్ష్మ ప్రణాళికలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది నిరుద్యోగులు రోడ్లపైన తిరుగుతున్నారు. 135 కోట్లు జనాభా ఉన్న భారతదేశంలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని ప్రధానమంత్రి చేసిన ప్రకటన ఆశించిన మేర కార్యరూపం దాల్చకపోవడంతో దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగి పోయిందని చెప్పవచ్చు! భారతదేశ ప్రధాని 59 దేశాలను 41 సార్లు సందర్శించినప్పటికీ భారతదేశం యొక్క ఎగుమతులను పెంచలేక పోయారు అన్న విమర్శలు వినబడుతున్నాయి. 2017లో ప్రపంచ దేశాలు జరిపిన ఎగుమతుల్లో భారతదేశం వాటా 1.7శాతం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతిదారులలో భారత్‌ ‌స్థానం 20తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచ ఎగుమతులలో మొదటి ఐదు స్థానాలను చైనా 12.8శాతం, అమెరికా 8.7శాతం, జర్మనీ 8.2శాతం, జపాన్‌ 3.9 ‌శాతం, నెదర్లాండ్‌ 3.7‌శాతంతో ఆక్రమించినాయి. వీటితో పోల్చుకుంటే మానవ వనరులకు పెట్టింది పేరుగా భారతదేశాన్ని చెప్పుకుంటున్నప్పటికీ ఉత్పత్తులలో ప్రపంచంలోని చిన్న దేశాలతో సైతం సరితూగ లేక పోతున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఒక నిర్దిష్టమైన జాతీయ ప్రణాళిక లేకపోవడమే., ముఖ్యంగా దేశంలో వస్తు ఉత్పత్తిని గానీ, వ్యవసాయ రంగాన్ని గాని అభివృద్ధి పరచాలలనే ఆలోచన పాలకులకు ఉంటే తప్ప, భారతదేశం ఎగుమతులలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోతే, 2050 నాటికి భారత దేశ వాణిజ్య ఉత్పత్తి రెట్టింపు చేయకపోతే, స్థూల జాతీయ ఉత్పత్తి తగ్గుదల ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. భారతదేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) మూలంగా ఎగుమతిదారుల నిధులు చిక్కుబడి పోవడంతో వ్యాపారం ముందుకు సాగ లేకపోయింది అన్నది వాస్తవం! భారతదేశం నుండి సాంప్రదాయక వస్తు ఉత్పత్తి ఆశించిన మేర ఎగుమతి చేయలేకపోవడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో వెనుకబ డిపోవడం జరిగిందని చెప్పవచ్చు! భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న 30 రంగాలకు గాను 17 రంగాలు ఎగుమతిలో వెనుకబడి పోయాయని చెప్పవచ్చు! అంతరా్జ తీయ స్థాయిలో భారతీయ ఉత్పత్తులు నిల దొక్కుకోకవడం ఇందుకు ప్రధా నమైన కారణం. ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణకు ఉపయోగించే వస్తువులు కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు రావడం గమనించాల్సిన విషయం. దీంతో భవిష్యత్‌ ‌తరాలకు, వర్తమాన సమాజా నికి పెద్ద విఘాతం కలిగే ప్రమాదం లేకపోలేదని భావించవచ్చు.

డా।। ఆర్‌. ఆదిరెడ్డి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy