తెలంగాణ ఎంసెట్ (అగ్రికల్చరల్) ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి జేఎన్టీయూలో ఎంసెట్ అధికారులతో కలసి ఫలితాలను వెల్లడించారు. ఈ ఫలితాలలో మొదటి మూడు ర్యాంకులను అమ్మాయిలే దక్కించుకున్నారు. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో జరిగిన ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 63857 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 59,113 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 92.57 శాతం ఉత్తీర్ణత నమైందనీ, నవంబర్‌లో కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్ )అగ్రికల్చర్) విభాగంలో తొలి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు : 1. గుత్తి చైతన్య సింధు , 2. మారెడ్డి సాయిత్రిషా రెడ్డి, 3. తుమ్మల స్నికిత, 4.దర్శి విష్ణు సాయి, 5. మల్లిడి రిషిత్, 6. శ్రీమల్లిక్ చిగురుపాటి 7. ఆవుల సుభాన్, 8. గారపాటి గుణచైతన్య, 9, గిండేటి వినయ్‌కుమార్, 10. కోట వెంకట్.