వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎం‌డ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తపడాలి : కలెక్టర్‌ ‌హరిత

April 9, 2019

రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ప్రభావంవల్ల ఎండ తీవ్రతకు గురికాకుండా జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ‌హరిత తెలిపారు. అత్యంత అవసరమున్నప్పుడు తప్పితే దాదాపు ఎండకు బయటకు రాకూడదని అన్నారు. ఎండవేడిలో ఎక్కువసేపు పనిచేయకూడదని, తలపై రక్షణగా గొడుగు, టోపి లాంటివి ధరించాలన్నారు. కారులో బయటికి వచ్చిన వారు ఎక్కువ సేపు పిల్లలను, వృద్దులను, ఆరోగ్యం బాగా లేనివారిని ఎండకు కారులో ఉంచకూడదని సూచించారు. బజారుకు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటర్‌బాలిల్‌ ‌వెంట ఉంచుకోవాలన్నారు. ఎండలో ఉన్నప్పుడు తరచూ నీళ్ళు, నిమ్మరసం, కొబ్బరినీళ్ళు తీసుకోవాలన్నారు. వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి కాటన్‌ ‌వస్త్రాలను ధరించడం, పలుచని మజ్జిగ, గ్లూకోజు నీరు, ఓఆర్‌ఎస్‌ ‌ద్రావణం వల్ల ఉపశమనం కలుగుతుందన్నారు. ఇంట్లోకి కూడా వడగాల్పులు రాకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. వడదెబ్బకు గురైనవారిని ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కి తరలించాలన్నారు.