వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎం‌డలు మరింత పెరిగే అవకాశం

May 10, 2019

మండుటెండలకు అల్లాడుతున్న ప్రజలు
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
మరో వారం రోజుల పాటు ఎండలు తప్పవంటున్న వాతావరణ శాఖ

ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు చేరుకుంటాయా అన్న భయాలు కనిపిస్తున్నాయి. సింగరేణి ప్రాంతంలో భిన్న వాతావరణం ఉంటోంది.ఇక్కడ నిప్పుల కొలిమి తలపిస్తోంది. గతంలో ఆదిలాబాద్‌, ‌ఖమ్మం లాంటి జిల్లాల్లోనే ఎండలు ఎక్కువని భావించే వారు. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎండల తీవ్రత అధికంగానే ఉంది.

విజయవాడ, గుంటూరు, ప్రకాశం ఇలా అనేక జిల్లాలో మండిపోతున్నాయి. ఈ యేడాది చలి తీవ్రత కూడా ఎక్కువగా నమోదైంది. ఎండలు కూడా ఆదే తరహలు ఉంటున్నాయి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కొన్ని రోజులుగా 42 నుంచి 46 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. ఎండల ప్రభావం అధికం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.