Take a fresh look at your lifestyle.

ఉపాధ్యాయులపై ఇంత కక్ష, వివక్ష ఎందుకు?

ఇప్పటికి 2 డిఏలు రావాలి. పిఆర్‌సి పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే! జూన్‌ 2‌న ఇస్తామని మీడియా సమక్షంలో మాట్లాడిన పాలకులు ఇవ్వకుండా సంవత్సరం గడిపారు. అయినా ఉపాధ్యాయులు ఎక్కడ కూడా పల్లెత్తు మాట అనలేదు. ఏ డిపార్మ్‌మెంట్‌లో లేని విధంగా రూ.398/- జీతంపై ఉపాధ్యాయులు నియామకమై సంవత్సరాల తరబడి ఊడిగం చేసారు. వారికి నోషనల్‌ ఇం‌క్రిమెంట్లు ఇస్తామని ప్రకటించిన వారు ఇప్ప•కీ• ఇవ్వలేదు. ఏ డిపార్ట్‌మెంట్‌ ‌నియామకాల్లో లేని విధంగా అతిదుర్మార్గమైన అప్రెంటీస్‌ ‌విధానం ప్రవేశపెట్టి రూ.1200/-కే వెట్టిచాకిరిని ఈ ప్రభుత్వాలు చేయించుకున్నాయని పాపం చాలామందికి తెలియదు.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేసవి సెలవులు అవసరమా?’ ఉపాధ్యాయులు పిల్లలను వారు పనిచేసే పాఠశాలల్లో ఎందుకు చదివించడం లేదంటూ, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే జీతాలు ఎక్కువగా ఇస్తూ మొదటి స్థానంలో ఉన్నప్పటికి వారు చిట్టీలు నడుపుతున్నారని, రియల్‌ ఎస్టేట్‌ ‌మరియు బీమా సంస్థల బ్రోర్లుగా పనిచేస్తున్నారని, సమయపాలన పాటించడంలేదని, కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్ళడంలేదని తెలంగాణ ప్రభుత్వంలో ఓ కమిషన్‌కు చైర్మన్‌గా పనిచేస్తూన్న ఓ మేధావి అయిన పెద్దమనిషి కూడా అన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోవడానికి కారణం ఉపాధ్యాయులే అని పుంఖాను పుంఖాలుగా వ్యాసాల రూపంలోను, వార్తల రూపంలోనూ అనేక విమర్శలు ప్రభుత్వ విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. కూర్చోబెట్టి జీతాలివ్వాలా అనే వరకు వెళ్ళడమేకాదు, పాఠశాల విద్యావ్యవస్థపై దృష్టి సారించి ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లు, విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు విద్యావ్యవస్థపైన అందులో పనిచేసే ఉపాధ్యాయులపైన చాలా విమర్శలేచేసారు. ఉపాధ్యాయులపై వస్తున్న ఈ విమర్శలు మొదటివేమి కాదు, చివరివి కూడా కాకపోవచ్చు. అందుకే ఆ వార్త), వ్యాసాల మరియు విమర్శలలోని వాస్తవ, అవస్తవాలను చర్చించవలసిన అవసరం ఎంతైన ఉన్నది.
ఈ మధ్యకాలంలో ఓ దినపత్రిక (ప్రజాతంత్ర కాదు)లో గుండోజు శ్రీనివాస్‌ అనే జర్నలిస్ట్ ‘‌ప్రభుత్వ ఉపాధ్యాయులకు సెలవులు అవసరమా?’ అంటూ ఓ వ్యాసం రాసాడు. టీచర్ల జీతబత్యాలపై చాలా లెక్కలు గట్టి వేల కోట్ల రూపాయలు ఉత్తపుణ్యానికే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు చెల్లిస్తున్నారంటూ వాపోయాడు! దురదృష్టకరమైన విషయమేంటంటే ఆ పత్రిక ఆ వ్యాసంలోని నిజానిజాలను పరిశీలించకుండానే అంతే అవగాహనలేమితో దానిని ప్రచురించడం. కాని ఆ వ్యాసకర్తకు కాని అలాంటి విమర్శ చేసే వారికి కాని తెలియని విషయమేంటంటే వెకేషన్‌, ‌నాన్‌ ‌వెకేషన్‌ అనే రెండు రకాల ఉద్యోగులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారని, ప్రభుత్వ రంగంలోని విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెకేషన్‌ ఉద్యోగులని, ప్రభుత్వ రంగంలోని ఇతర శాఖల్లో పనిచేసే వారు నాన్‌ ‌వెకేషన్‌ ఉద్యోగులనే విషయం పాపం ఆయనకు కాని అలాంటి విమర్శలు చేసే వారికి కాని తెలియదు. వెకేషన్‌ ఉద్యోగులకు సెలవులతో పాటు సంవత్సరానికి 6 సంపాదిత సెలవులు మాత్రమే ఇస్తారు. కాని అదే నాన్‌వెకేషన్‌ ఉద్యోగులకు 12 నెలల జీతంతో పాటు 30 సంపాదిత సెలవులు ఇస్తారు. సంవత్సరానికి 15 చొప్పున లేదా 2 సంవత్సరాలకు 30 చొప్పున వాటిని తన సర్వీస్‌లో ఎప్పుడు అమ్ముకున్న ఆ నెలలో సదరు ఉద్యోగికి ఎంత జీతం ఉందో అంత చెల్లించబడుతుంది. అంటే మొత్తం 13 నెలల జీతం వస్తున్నది. వెకేషన్‌ ఉద్యోగులకు వాడుకోని వారికి కూడా సంపాదిత సెలవులు ఇస్తామంటే ఏ ఉపాధ్యాయుడు, ఉద్యోగి వద్దంటాడు? దేశంలో ఉద్యోగులకు అతిఎక్కువ జీతాలు చెల్లించే రాష్ట్రం తెలంగాణ అని ప్రజల్ని ఉద్యోగులపైకి ఉసిగొలప్పడానికి పనికిమాలిన కొంతమంది రాజకీయనాయకులు పదే పదే వల్లించే సొల్లు మాటల్ని చాలా మంది నమ్ముతున్నారు. వాస్తవంలో ఒక ఉద్యోగికి చెల్లించే జీతభత్యాలలో మన రాష్ట్రం ఏడవస్థానంలో ఉంది. ధరలను తగ్గించమంటే తగ్గించరు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిఏను ప్రభుత్వాలు ఏనాడైనా సకాలంలో మంజూరు చేశాయా? 5 సంవత్సరాలకోసారి ఇచ్చే పిఆర్‌సిని ఎప్పుడైనా సకాలంలో ఇచ్చారా? 13వ పిఆర్‌సి వేయాల్సిన సమయంలో 11వ(తెలంగాణ రాష్ట్రంలో మొదటి) పిఆర్‌సి నడుస్తున్నది! క్రమానుగతంగా రావల్సిన వీటి కోసం కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ధర్నాలు, ఆందోళనలు చేయవలసి వస్తున్నదంటే ఉద్యోగులపట్ల ఎంత దారుణమైన విధానాల్ని పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి? ఇప్పటికి 2 డిఏలు రావాలి. పిఆర్‌సి పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే! జూన్‌ 2‌న ఇస్తామని మీడియా సమక్షంలో మాట్లాడిన పాలకులు ఇవ్వకుండా సంవత్సరం గడిపారు. అయినా ఉపాధ్యాయులు ఎక్కడ కూడా పల్లెత్తు మాట అనలేదు. ఏ డిపార్మ్‌మెంట్‌లో లేని విధంగా రూ.398/- జీతంపై ఉపాధ్యాయులు నియామకమై సంవత్సరాల తరబడి ఊడిగం చేసారు. వారికి నోషనల్‌ ఇం‌క్రిమెంట్లు ఇస్తామని ప్రకటించిన వారు ఇప్పటికి ఇవ్వలేదు. ఏ డిపార్ట్‌మెంట్‌ ‌నియామకాల్లో లేని విధంగా అతిదుర్మార్గమైన అప్రెంటీస్‌ ‌విధానం ప్రవేశపెట్టి రూ.1200/-కే వెట్టిచాకిరిని ఈ ప్రభుత్వాలు చేయించుకున్నాయని పాపం చాలామందికి తెలియదు. ప్రారంభవేతనాన్ని, 30 ఏండ్లకు పైబడి కరిగిపోయిన ఉపాధ్యాయుల జీవితాన్ని లెక్కించకుండా రిటైర్మెంట్‌ ‌నాటికి ఉండే జీతభత్యాల్ని లెక్కించి లక్షలకు, లక్షలు జీతాలు వస్తున్నాయని అనడం విడ్డూరంకాక మరేమిటి! ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెట్టిన కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ ‌విధానంతో పాత పెన్షన్‌ ‌విధానం పోయి ఉపాధ్యాయుల జీవితాల్లో చీకట్లు నింపింది. జీతాల చెల్లింపులు సామాన్య ప్రజల ఆదాయంతో పోల్చరు. రాష్ట్రాలు, దేశాల మధ్య అదే శాఖలో పనిచేసే ఉద్యోగులతో పోల్చుతారు. యూరప్‌, అమెరికా, ఆస్ట్రేలియాలో, ఏ దేశంలోనైనా ప్రభుత్వ రంగంలో పనిచేసే అన్ని రకాల ఉద్యోగుల, చివరికి పాలకుల కంటే కూడా అతి ఎక్కువ జీతబత్యాలు పాఠశాలల్లో పనిచేస్తూన్న ఉపాధ్యాయులకే చెల్లించడమే కాదు అతి ఎక్కువ గౌరవప్రదమైన వృత్తిగా భావిస్తారు! అవే జీతాభత్యాలు మన ధనిక రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు చెల్లిస్తే వారు ఎందుకు చిట్టీల, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారాలు చేస్తారు? అయినా ఇది అవినీతి, మోసం కిందకు రాదు కదా? చిట్‌ఫండ్‌లను మూసివేసి ప్రజలను, మధ్యతరగతి ఉద్యోగులను నిండా ముంచి రియల్‌ ఎస్టేట్‌ ‌పేరుతో కబ్జాలు, పైరవీలు మోసపూరిత కాంట్రాక్టులు చేసి ప్రజలను అనేకరకాలుగా ముంచి, వంచించి రాజకీయ నాయకులైన వాళ్ళు ఈ మాటనడం విడ్డూరంగా ఉంది. రాజకీయాల్లోను, ఇతర ఉద్యోగ శాఖల్లో పేరుకుపోయిన దోపిడి, అవినీతి, ఆక్రమాలను పరిశీలిస్తే అవినీతి నిరోధక శాఖ మరక అంటకుండా ఇప్పటి వరకు ఉన్నది ఉపాధ్యాయులు మాత్రమే అన్న సత్యం అవగతమవుతున్నది. పై పనులు చేసుకుంటూ పాఠశాలకు రాకపోయినా, పాఠాలు చెప్పకపోయినా పై అధికారులు ఏం చేస్తున్నట్టు? వారిని పట్టుకోవడం చేతకాని ఆ అధికారులను ప్రభుత్వం ఎందుకు మేపుతున్నట్టు? ఈ వ్యాపారాలు చేస్తున్న ఉపాధ్యాయుల లిస్టొకటి దగ్గరపెట్టుకొని ఎంత మంది అధికారులు సంవత్సరం మామూళ్ళ దందాను కొనాసాగించడం లేదు! అయినా ఉపాధ్యాయులు కూడా ఆకాశం నుండి ఊడిపడ్డ ప్రత్యేక మహత్తర జాతి ఏమికాదు. ఇదే మానవ సమాజం నుండి వచ్చిన వారు. మిగిలిన మానవులకు ఉన్న కోరికలు, ఆశలు, లోపాలు వారిలో కొద్దిమందిలో ఉండే అవకాశం ఉంది. ఆ పిడికెడు మందిని ఉపాధ్యాయ వ్యవస్థకు ఆపాదించడం ఎంతవరకు సమంజసం? అవి వ్యాపారాలు కావచ్చు, మరేరకమైన తప్పైనా కావచ్చు శిక్షించడానికి ఫండమెంటల్‌, ‌సిసిఏ రూల్స్ ఉన్నాయి కదా? ఏ అవినీతి మరక అంటకుండా 30 ఏళ్ళుగా ఉపాధ్యాయులు సర్వీస్‌ ‌రూల్స్ ‌లేక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. తక్కువ అర్హతలతో తమకంటే వెనుక సర్వీస్‌లోకి వచ్చిన జూనియర్‌ అసిస్టెంట్లు ప్రమోషన్‌పై ప్రమోషన్‌ ‌తీసుకొని డిఈఓ లాంటి తనిఖీ అధికారులైతే నిశ్చేష్టులు కావడం తప్ప ఏమి చేయలేని నిస్సహాయస్థితి. సెకండరీ గ్రేడ్‌ ‌టీచర్‌గా సర్వీస్‌లోకి వచ్చిన ఒ•• ఉపాధ్యాయుడు అదే పోస్టులో 25, 30 ఏండ్లు సర్వీస్‌ ‌చేసి ఒక్క ప్రమోషన్‌కు కూడా నోచుకోని దుస్థితిలో కుమిలి పోతున్నారు. గతంలో స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను ప్రభుత్వ రంగంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలన్నింటిని స్థానిక సంస్థలకు అప్పగిస్తామని ఆలోచిస్తున్నట్లుగా వచ్చే వార్తలను చూస్తే ఎలుకలున్నాయని ఇళ్ళు తగులబెట్టుకోవడంలా కనబడుతుంది! ఇవన్ని చూస్తున్నప్పుడు ‘‘ఒక వ్యవస్థను, సంస్థను లేదా ఒక జీవిని నిర్వీర్యం చేయాలంటే ముందుగా ఆ సిస్టం లేదా జీవిపై విషప్రచారం మొదలుపెట్టాలి. రాజ్యంలో దానిపై అపోహలు సృష్టించాలి. ఆ వ్యవస్థ వలన ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని గగ్గోలు పెట్టాలి. అరిచి గీ పెట్టి నానా యాగీ చేయాలి. అధినేత ఒక కుక్కను చంపాలని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని రోజుల ముందుగా దాని ప్రవర్తన తేడాగా ఉందనే ప్రచారానికి తెరతీస్తాడు. తరువాత అనుచర గణంతో దానికి పిచ్చి పట్టిందని పబ్లిసిటీ ముమ్మరం చేస్తాడు. తదనంతరం దానివలన నగరం పురవీధులు ప్రమాదపు అంచున చేరాయని జనులకు భ్రమ కలిగించి తన నిర్ణయానికి పూర్తిస్థాయి జన బలం చేకూర్చుకొని అప్పుడు పిచ్చి పట్టిన కుక్కను చంపి వేయమని ఉత్తర్వులు జారీ చేస్తాడు…’’ అని అరిస్టాటిల్‌ ‌చెప్పిన వాక్యాలు నేటి విద్యా వ్యవస్థపై వస్తున్న విమర్శలను చూస్తే గుర్తుకు వస్తున్నాయి.


డా।। ఏరుకొండ నరసింహుడు,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌(‌టిటిఐ)

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy