వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఉద్యోగాల భర్త్తీపై సర్కార్‌ ‌తప్పుడు లెక్కలు

September 19, 2019

ఫోటో: ఓయూలో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష లో ప్రసంగిస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షులు  ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌.
ఫోటో: ఓయూలో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష లో ప్రసంగిస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌.

జాబ్‌ ‌క్యాలెండర్‌ను విడుదల చేయాలి
నిరుద్యోగ భృతిని అమలు చేయాలి
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పల్లె పల్లె తిరిగి నిరుద్యోగులకు వివరిస్తాం.
తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌.
తెలంగాణ ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి శాసన సభలో 1లక్షా 17వేల ఉద్యోగాలు భర్తీ చేశాము అని తప్పుడు లెక్కలు చెప్పడం తప్పు అని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరాం అన్నారు. ఉద్యోగాల సాధనకై ఓయూ ఆర్టస్ ‌కళాశాల వద్ద విద్యార్థి జనసమితి రాష్ట్ర కన్వీనర్‌ ‌నిజ్జన రమేష్‌, ‌కో-కన్వీనర్‌ ‌సర్ధార్‌ ‌వినోద్‌ ‌ల ఆధ్వర్యంలో గురువారం సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరై అమరవీరులకు నివాళులు అర్పించి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం సాగింది. నీళ్లు, నిధులు సాదించుకుంటే తెలంగాణ ప్రజలకు బ్రతుకు దెరువు దొరుకుతుందనీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకే దక్కుతాయనీ అందరం గట్టిగా నమ్మి తెలంగాణ కోసం పోరాటం చేశాం అన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటం అంతా ఉద్యోగాల కోసం జరిగిన పోరాటమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1 లక్ష 17 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టిఎస్‌.‌పి ఎస్‌.‌సి లెక్కల ప్రకారం 37 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు అని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి అన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ను వెంటనే విడుదల చేయాలని, స్థానిక పరిశ్రమలలో తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు ఇవ్వాలి అన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వ విధానాలు తయారుచేయాలి, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్‌ ‌చేశారు. కాంట్రాక్టు, ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌రంగాలలో పని చేస్తున్న ఉద్యోగస్తులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అన్నారు. ఉద్యోగుల పంపిణీ త్వరగా పూర్తిచేసి వారి స్వస్థలాలకు పంపించాలని అన్నారు. ఈ దీక్ష తోనే తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభమయ్యింది అన్నారు. ప్రతి పల్లె పల్లె తిరిగి నిరుద్యోగులకు, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జనసమితి అధ్యక్షులు నిజ్జన రమేష్‌, ‌కన్వీనర్‌ ‌సర్దార్‌ ‌వినోద్‌, ‌సలీమ్‌, ఓయూ అధ్యక్షులు బాబు మహాజన్‌, ‌విద్యార్థులు, తెలంగాణ జనసమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.