ఉద్యమ శక్తుల నిస్తేజం.. బాసర ఐటీ నిర్వీర్యం

‘‘‌తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బాసర విద్యార్థుల ఉద్యమాన్ని సొంతం చేసుకొని పిల్లలకు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉండేది.తెలంగాణలో సబ్బండ వర్ణాలు ఏ ఉద్యమాన్ని యెత్తుకున్నా తెలంగాణ సమాజం అందులో భాగస్వాములవటం తెలంగాణ సాధన పోరాటాల నుండి విద్యార్థి, యువజన,ప్రజాసంఘాలుగా మనం ఆచరిస్తున్నదే! ఆఆచరణ,ఆ పోరాట సాంప్రదాయం ఎంతో కొంత పలుచబడిందని ఇప్పుడు భావించాల్సి వస్తుంది.’’

జూలై, 13: ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం గడచిన తొమ్మిదేళ్లలో విద్యుత్‌ ‌రంగంలో అసాధారణ పరివర్తనను సాధించింది. విద్యుత్‌ ‌సరఫరాలో నిరంతర కోత, సదా విద్యుత్‌ ‌కొరత వంటి పరిస్థితులు నేడు చరిత్రగా మిగిలాయి. దేశంలో 2014-15కు ముందు విద్యుత్‌ ‌సరఫరా లోటు 4.5 శాతంగా ఉండేది. అయితే, 2014లో మోదీ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టాక అసమాన రీతిలో 185 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యం అదనంగా జోడించబడింది. దీంతో భారత్‌ ‌విద్యుత్‌ ‌లోటు నుంచి మిగులు దేశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ మొత్తం స్థాపిత సామర్థ్యం 417 గిగావాట్లుగా ఉంది. ఇది అంతర్గత గరిష్ఠ డిమాండ్‌ 222 ‌గిగావాట్ల కన్నా దాదాపు రెట్టింపు. కాబట్టి భారత్‌ ఇవాళ ఇప్పుడు పొరుగు దేశాలకు విద్యుత్‌ ‌సరఫరా చేయగలుగుతుంది.
విద్యుత్‌ ‌ప్రసార రంగంలోనూ దేశం గణనీయ ప్రగతి సాధించింది. ఈ మేరకు 2013 నుంచి దాదాపు 2 లక్షల సర్క్యూట్‌ ‌కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తృత ప్రసార మార్గాల నెట్‌వర్క్ ఏర్పాటైంది. ఇది యావద్దేశాన్ని ఒకే పౌనఃపున్యంతో పనిచేసే సమీకృత గ్రిడ్‌గా మారుస్తుంది. ఈ ప్రసార లైన్లు 800 కిలోవోల్ట్(‌కెవి) హై-ఓల్టేజ్‌ ‌డైరెక్ట్ ‌కరెంట్‌(‌హెచ్విడిసి) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి. సముద్ర మట్టానికి 15000/16000 అడుగుల ఎత్తులోగల శ్రీనగర్‌, ‌లేహ్‌ ‌లైన్‌ ‌సహా అత్యంత దుర్గమమైన కొన్ని పర్వత భూభాగాల గుండా వెళ్తాయి. దేశంలో ఒక మూల నుంచి మరొక మూలకు 112 గిగావాట్ల విద్యుత్తును బదిలీ చేయగల సామర్థ్యంతో 2014 నాటి 36 గిగావాట్ల స్థాయి నుంచి దేశం మొత్తాన్నీ ఏకీకృత విద్యుత్‌ ‌మార్కెట్‌గా మార్చింది. దీనివల్ల దేశంలోని ఏ విద్యుదుత్పాదన సంస్థ వద్దనైనా పంపిణీ కంపెనీలు సరసమైన ధరతో అత్యధికంగా విద్యుత్తు కొనుగోలు చేయడం వీలవుతుంది. తద్వారా వినియోగదారులకు విద్యుత్‌ ‌ఛార్జీల భారం తగ్గుతుంది.

ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన అంశాల్లో విద్యుత్తు సౌలభ్యం ముఖ్యమైనది. మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు..అంటే-67 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలోని 18,000 గ్రామాలు, అనేక కుగ్రామాలు అంధకారంలోనే మగ్గుతూండేవి. ఈ దుస్థితిని తొలగించే దిశగా 1000 రోజుల్లో ప్రతి గ్రామంలోనూ వెలుగులు నింపుతామని 2015 ఆగస్టులో ప్రధాన మంత్రి మోదీ భరోసా ఇచ్చారు. ఈ కృషిలో పర్వత, ఎడారి ప్రాంతాల్లో రవాణా సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ గడువుకు 13 రోజులు ముందుగా..అంటే-987 రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని ప్రభుత్వం అందుకుంది. ఈ విజయాన్ని ఇంధన రంగంలో అత్యంత ముఖ్యమైన వార్తగా అంతర్జాతీయ విద్యుత్‌ ‌సంస్థ 2018లో గుర్తించింది. ఈ విజయమిచ్చిన ఉత్సాహంతో ప్రభుత్వం ఇంటింటికీ విద్యుత్‌ ‌సరఫరా లక్ష్యం నిర్దేశించుకుంది. విశేషమేమిటంటే-ఈ లక్ష్యాన్ని కేవలం 18 నెలల్లోనే అధిగమించింది. దేశవ్యాప్తంగా 2.86 కోట్ల గృహాలకు విద్యుత్‌ ‌సరఫరా సాకారమైంది. ఇంత వేగంగా విద్యుత్‌ ‌సౌలభ్య విస్తరణ విద్యుత్‌ ‌రంగంలో అపూర్వం. కాబట్టే అంతర్జాతీయ విద్యుత్‌ ‌సంస్థ గుర్తింపు లభించింది. దేశంలో ఏ ఒక్కరూ వెనుకబడి పోరాదన్నదే మోదీ ప్రభుత్వ విధానం.

పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేస్తూ అన్ని రాష్ట్రాల్లో రూ.2 లక్షల కోట్లకుపైగా వ్యయంతో సమగ్ర పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ మేరకు కొత్త సబ్‌-‌స్టేషన్లు, అప్పటికే గల స్టేషన్ల ఉన్నతీకరణ, ట్రాన్స్‌ఫా•ర్మర్ల ఏర్పాటు, వేల కిలోమీటర్ల ఎల్టీ/హెచ్టీ లైన్ల నిర్మాణం/మార్పిడి వంటివి పనులు పూర్తి చేసింది. ఈ బృహత్తర కృషితో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ ‌సౌలభ్యం గణనీయంగా మెరుగుపడింది. తద్వారా 2015 నాటికి సగటు లభ్యత 12 గంటలు కాగా నేడు 22.5 గంటలకు పెరిగింది. కాగా, పట్టణ ప్రాంతాలకు ఇవాళ సగటున 23.5 గంటల విద్యుత్‌ ‌సరఫరా ఫలితంగా డీజిల్‌ ‌జనరేటర్ల మార్కెట్‌ ‌దాదాపు మాయమైంది! మరోవైపు పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారించడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై తన నిబద్ధతను ప్రభుత్వం చాటుకుంది. దేశంలో 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యం సాధనను 2015లో ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుతం 172 గిగావాట్ల సామర్థ్యం సాధించబడింది. మరో 84 గిగావాట్ల సామర్థ్యం మేర పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ వృద్ధి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పరంగా భారత్ను వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలిపింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గల ప్రధాన నిధి సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అలాగే 2030 నాటికి పునరుత్పాదక ఇంధనం ద్వారా 40 శాతం విద్యుదుత్పాదన సామర్థ్యం లక్ష్యాన్ని నిర్ణీత గడువుకన్నా తొమ్మిదేళ్లు ముందుగానే అధిగమించింది. ప్రస్తుత మొత్తం స్థాపిత సామర్థ్యం 180 గిగావాట్లలో 43 శాతం శిలాజేతర ఇంధన వనరులతోనే సాగుతుంది.

ఉద్గార తీవ్రతను తగ్గించడంలోనూ ప్రభుత్వం విజయం సాధించింది. దేశంలో 2005నాటి స్థాయులతో పోలిస్తే ఉద్గారాల తీవ్రతను 33-35 శాతం మేర తగ్గించే లక్ష్యాన్ని కూడా సాధించింది. తద్వారా జి-20 కూటమిలో ఈ గమ్యం చేరిన దేశంగా నిలవడంతోపాటు ప్రపంచ ఉష్ణోగ్రతలో సబ్‌-2-‌డిగ్రీల పెరుగుదలతో ముడిపడిన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. దీంతోపాటు ఉజాలా(‘ఎల్‌ఇడి’ బల్బుల పంపిణీ), కృషి-విజయం-సామర్థ్యం(పిఎటి), ఉపకరణాలకు ‘స్టార్‌ ‌రేటింగ్‌’ ‌కార్యక్రమం, విద్యుత్‌ ఆదా సర్టిఫికెట్ల జారీ వంటి వివిధ కార్యక్రమాలు చేపట్టింది. దీనివల్ల కర్బన ఉద్గారాల్లో సంవత్సరానికి 159 మిలియన్‌ ‌టన్నుల మేర తగ్గించడం సాధ్యమైంది. వాణిజ్య-నివాస భవనాల్లో విద్యుత్‌ ‌పరిరక్షణకు ఉద్దేశించిన ‘బిల్డింగ్‌ ‌కోడ్‌’‌లు ఈ దిశగా మరో కీలక ముందడుగు. ఇక మన కర్బన ఉద్గారాలను బిలియన్‌ ‌టన్నులు తగ్గించేందుకు, మన ఆర్థిక వ్యవస్థ విద్యుత్‌ అవసరాల తీవ్రతను 2005 స్థాయులతో పోలిస్తే 2030కల్లా 45 శాతానికి తగ్గించేందుకు ప్రతినబూనాం. ఈ హామీని కూడా 2030కన్నా ఎంతో ముందుగానే సాధించగలం.

విద్యుత్‌ ‌రంగంలో ఆమూలాగ్రం సమగ్ర సంస్కరణలు అమలు చేయబడ్డాయి. ఇందులో భాగంగా మొత్తం సాంకేతిక-వాణిజ్య(ఎటి అండ్‌ ‌సి) నష్టాల తగ్గింపును ఆర్థిక సహాయంతో ముడిపెట్టాం. అలాగే విద్యుత్‌ ‌ఖాతా-తనిఖీ విధానం అమలు చేశాం…అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో రాయితీలను చెల్లించేలా చూడటం వంటి చర్యలతో పంపిణీ కంపెనీల(డిస్కమ్‌) ‌సామర్థ్యం, ఆర్థిక క్రమశిక్షణ మెరుగుకు కృషి చేశాం. దీంతో డిస్కమ్ల ‘ఎటి అండ్‌ ‌సి’ నష్టాలు 2021 ఆర్థిక సంవత్సరంలో 22 శాతం నుంచి 2022 కల్లా 16.44 శాతానికి తగ్గాయి. అలాగే ‘జెన్కో’లకు ‘డిస్కమ్‌’‌ల నుంచి వారసత్వ బకాయిలు దాదాపు సగానికి రూ.1.4 లక్షల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు తగ్గాయి. డిస్కమ్‌లు స్వీకరిస్తున్న విద్యుత్తుకు ప్రస్తుతం ఎప్పటికప్పుడు చెల్లింపులు పూర్తవుతున్నాయి. అత్యంత సమర్థ ఉత్పాదక స్టేషన్ల సౌలభ్యం దిశగా ముందస్తు షెడ్యూలుకు అనుమతించడం ద్వారా వినియోగదారులకు విద్యుత్‌ ‌భారాన్ని తగ్గించాం. ప్రత్యక్ష మార్కెట్‌తో పాటు పునరుత్పాదక విద్యుత్తుకు ‘టెర్మ్ అహెడ్‌, ‌డే-అహెడ్‌’ ‌పద్ధతి వల్ల కూడా విద్యుత్‌ ‌మార్కెట్‌ ‌విస్తరించింది.
ఇంధన పరివర్తన దిశగా కృషిలో భాగంగా తాప విద్యుత్‌ ‌కేంద్రాల్లో థర్మల్‌ ‌విద్యుత్‌, ‌బయో-మాస్‌ ‌సహ దహనంతో పునరుత్పాదక శక్తిని జోడించేందుకు అనుమతించాం.

తద్వారా 100 కిలోవాట్లు లేదా అంతకన్నా ఎక్కువ విద్యుత్‌ ‌లోడ్గల వినియోగదారులెవరైనా ఇప్పుడు అటువంటి ఉత్పాదక కేంద్రాల నుంచి పునరుత్పాదక శక్తిని పొందవచ్చు. మర్వోట్కపు లాభార్జన విరామ ఆర్థిక సహాయంతో పాటు ‘పిఎల్‌ఐ’, ‌బ్యాటరీ విద్యుత్‌ ‌నిల్వ వ్యవస్థ ద్వారా సౌరశక్తి ఉత్పాదక సెల్‌ ‌తయారీకి ప్రభుత్వం చేయూతన్తింది. ఇక నిరుత్సాహ స్థితికి జారిపోయిన జల విద్యదుత్పాదక రంగం ఇప్పుడు నిర్మాణంలోగల దాదాపు 15 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో పునరుత్తేజం పొందింది. విద్యుత్‌ ‌వాహనాల ఛార్జింగ్‌ ‌కోసం మౌలిక సదుపాయాల కల్పనకు నియమాలు-మార్గదర్శకాలు సరళం చేయబడ్డాయి. దీంతో దేశీయ కనెక్షన్ల ద్వారా ఛార్జింగ్‌ ‌సాధ్యమైంది. మరోవైపు వివాద పరిష్కార యంత్రాంగం ఇప్పుడు ఒక నెలలోగానే వివాదాలను పరిష్కరిస్తుంది.

మొత్తం మీద మోదీ ప్రభుత్వం విద్యుత్‌ ‌రంగంలో అద్భుత పరివర్తనను సాధించింది. ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, ప్రసార నెట్‌ ‌వర్క్ల మెరుగు, విద్యుత్‌ ‌సౌలభ్యం పెంపు, పునరుత్పాదక శక్తికి ప్రోత్సాహం, సమగ్ర సంస్కరణల అమలు తదితరాలపై దృష్టి సారించడం ద్వారా భారత దేశం అసాధారణ లక్ష్యాలను అధిగమించింది. అలాగే పర్యావరణం, ఇంధన సామర్థ్యం, సుస్థిర అభివృద్ధిపై ప్రభుత్వ నిబద్ధత భారత్‌ను ఇంధన పరివర్తనలో ప్రపంచాధినేత స్థానంలో నిలిపింది. పునరుత్పాదక ఇంధనంపై లక్ష్యాలను పెంచుకోవడం, ఉద్గారాలను మరింత తగ్గించడం ద్వారా మోదీ ప్రభుత్వం భారత విద్యుత్‌ ‌రంగ భవిష్యత్తును సదా శక్తిమంతం చేస్తూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *