Take a fresh look at your lifestyle.

ఈసీ సంచలన నిర్ణయం!

యోగిపై 72గంటలు, మాయావతిపై 48గంటలు నిషేదంఎన్నికల సంఘం(ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ‌బీఎస్‌పీ అధినేత్రి మాయావతిపై కొరడా ఝుళిపించింది. వీరిరువురు మతపరమైన వ్యాఖ్యలు చేస్తుండటాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల కమిషన్‌ ‌కొద్దిరోజులు నిషేదం విధించింది. యోగి ఆదిత్యనాథ్‌పై 72 గంటలు, మాయావతిపై 48 గంటలు నిషేధం విధించింది. ఈసీ నిర్ణయం ప్రకారం యోగి మూడు రోజులు, మాయావతి రెండు రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. యూపీలో ఎన్నికల ప్రచారం సమయంలో సీఎం యోగి ఆదిత్యనాధ్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కు అలీ ఉంటే మాకు బజరంగ్‌ ‌బలి ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఇది హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడమేనంటూ ఆయనపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. మాయావతి సైతం మత ప్రాతిపదికపైనే బీజేపీ టిక్కెట్లు ఇస్తోందన్నారు. యోగికి వోట్లేసేటప్పుడు అలీ, బజరంగ్‌బలి అంటూ యోగి చేసిన వ్యాఖ్యలను ముస్లింలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈసీ యోగి, మమతల వ్యాఖ్యలపై మందలించింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!