Take a fresh look at your lifestyle.

ఈనెల 14-22 వరకు ఎస్‌ఐ, ‌పోలీస్‌ ‌కానిస్టేబుల్‌ళ్ల దృవపత్రాల పరిశీలన:ఎస్పీ

మహబూబ్‌నగర్‌ ‌జిల్లా ఎస్పీ  రెమారాజేశ్వరి
మహబూబ్‌నగర్‌ ‌జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి

ఎస్‌ఐ, ‌పోలీస్‌ ‌కానిస్టేబుల్‌ ‌సంబంధిత ఉద్యోగాలకు సంబంధించి చిట్టచివర జరిగిన వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఈనెల 14 నుంచి 22 వరకు దృవపత్రాల పరిశీలన జిల్లా పోలీసు కార్యాలయంలో జరగనుందని జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుది పరీక్షలో అర్హత పొందిన అభ్యర్ధులు వెబ్‌సైట్‌ ‌ద్వారా ఈనెల 12న ఉదయం 8 గంటల నుండి 13వ తేది 8 గంటల నడుమ ఇంటిమేషన్‌ ‌లెటర్‌ ‌డౌన్‌లోడ్‌ ‌చేసుకోవాలని జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. ఇంటిమేషన్‌ ‌లెటర్‌లో సూచించిన విధంగా అభ్యర్ధులు తగిన దృవపత్రాలతో జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకోవాలి. రాష్ట్ర పోలీసు నియామక అధికారులు అందించిన ఇంటిమేషన్‌ ‌లెటర్‌ను అభ్యర్ధులు ఒకటికి రెండు మార్లు క్షుణ్ణంగా చదవాలని, లెటర్‌తో తెలిపిన విధంగా అన్ని దృవపత్రాలతో పరిశీలన కేంద్రానికి హాజరు కావాలని ఎస్పీ తెలిపారు.

Leave a Reply

error: Content is protected !!