వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఇష్టమొచ్చినట్లు చంపుకుంటూపోతే చట్టాలెందుకు?

December 6, 2019

బీజేపీ ఎంపీ మేనకా గాంధీచట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితులను ఇష్టం వచ్చినట్లు చంపుకుంటూ పోతే చట్టాలు ఎందుకని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం ఆమె డియాతో మాట్లాడుతూ.. లేటెస్ట్‌గా పార్లమెంట్‌ ఆవరణలో బీజేపీ ఎంపీ మేనకా గాంధీ డియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన ఘటన చాలా భయానకమైదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. కు చంపాలనిపించిందని కాల్చి చంపడం కరెక్టు కాదన్నారు. నిందితులకు కోర్టుల ద్వారానే కఠిన శిక్షలు పడాలని, న్యాయ పక్రియ పూర్తి కాకముందే కాల్చి చంపితే.. ఇక కోర్టులు, న్యాయ, పోలీస్‌ ‌వ్యవస్థలు ఎందుకని ఎంపీ మేనకా గాంధీ ప్రశ్నించారు. ప్రస్తుతమున్న న్యాయ వ్యవస్థతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ ‌వ్యాఖ్యానించారు. నేర నిరూపణ జరిగినా దోషులకు శిక్షలు పడటం లేదని, వేగంగా బాధితులకు న్యాయం జరగడం లేదని, దాంతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతోందని ఆయన అన్నారు. అందుకు దిశ నిందితుల ఎన్‌ ‌కౌంటరే నిదర్శనమన్నారు. చట్ట ప్రకారమైతే న్యాయం జరగదని ప్రజలు భావిస్తున్నారని, అందుకే దోషులను తామే శిక్షిస్తామని, లేదంటే ఎన్‌ ‌కౌంటర్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారని కేజీవ్రాల్‌ అన్నారు. ముఖ్యంగా అత్యాచార కేసుల్లో న్యాయం ఆలస్యం అవుతుండటం అస్సలు మంచిది కాదన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. నేరస్థులకు వేగంగా శిక్ష పడకపోవడంతోనే సమాజంలో ఘోరాలు పెరిగిపోతున్నాయని, దీన్ని అరికట్టాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేసి నేరస్థులకు వేగంగా శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ అభిప్రాయపడ్డారు.