వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఇర్కోడ్‌లో మాంసకృతులు ఎగుమతి పరిశ్రమ

August 30, 2019

శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన హరీష్‌రావునాన్‌వెజ్‌ ‌భోజన ప్రియులకు శుభవార్త.. మటన్‌, ‌చికెన్‌ ‌తొక్కు లొట్టలేసుకుని తినాలనుకుంటున్నారా… సిద్ధిపేట కేంద్రంగా మాంసకృతుల ప్రాసెసింగ్‌ ‌యూనిట్‌ ‌నిర్వహణ చేపట్టేందుకు ఇర్కోడ్‌ ‌సిద్ధమైంది. ఇర్కోడ్‌ ‌మటన్‌, ‌చికెన్‌ ‌తొక్కు.. అంటే.. లొట్టలేసుకుని తినే బ్రాండ్‌ ‌పేరు త్వరలోనే రానుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐసిఏఆర్‌(‌జాతీయ వ్యవసాయ ఉత్పత్తుల పరిశోధన కేంద్రం) బొడుప్పల్‌లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్‌ ఇచ్చిన సందర్భంగా మాట్లాడుతూ… మాంసకృతులు ఎగుమతి చేసే పరిశ్రమకు ఇర్కోడ్‌ ‌కేంద్రంగా దేశ, విదేశాలకు మాంసకృత్తుల ఉత్పత్తులు చేసేలా ఆర్డర్లు తెచ్చుకుందామన్నారు. ఇటీవల ఇర్కోడ్‌ ‌గ్రామ మహిళా సంఘ సభ్యులకు గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త చందర్‌రావుతో కలిసి అవగాహన, సమీక్షా సమావేశం జరిపి హరీష్‌ ‌దిశా నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.