Take a fresh look at your lifestyle.

ఇం‌ట్లో ఆడవాళ్లే లక్ష్మీదేవతలు

ఫోటో: 30‌రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం సిద్ధిపేట జిల్లాలో గ్రామస్తునితో ముచ్చటిస్తున్న మంత్రి హరీష్‌ ‌రావు.
ఫోటో: 30‌రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం సిద్ధిపేట జిల్లాలో గ్రామస్తునితో ముచ్చటిస్తున్న మంత్రి హరీష్‌ ‌రావు.

పంచాయతీలకు ప్రతి నెలా రూ.350కోట్లు
ఆకుపచ్చ గ్రామాలే ధ్యేయంగా కేసీఆర్‌ 30‌రోజుల ప్రణాళికకు శ్రీకారం
కొల్గూరు సభలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు
చెత్తను జమ చేసుకుంటే దరిద్రాన్ని జమ చేసుకున్నట్లేననీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ప్రతి ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవత మన వెంట ఉన్నట్లేననీ అన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్‌ ‌మండలం కొల్గూరు గ్రామంలో హరీష్‌రావు పర్యటించారు. 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్మన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మతో కలిసి ఇల్లిల్లూ తిరిగారు. గ్రామంలోని ప్రతి వార్డును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శ్రమదానం చేశారు. మట్టిని తట్టలలో ఎత్తి ట్రాక్టర్లలో పోశారు. చెత్త లేకుండా శుభ్రం చేశారు. మట్టి ట్రాక్టర్‌ను హరీషే స్వయంగా నడిపారు. గ్రామం పొడుగునా ట్రాక్టర్‌పై వెళ్తూ…ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయతో పలకరించారు. షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆకుపచ్చగా తయారు చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 30రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకాన్ని ఎంతో ముందు చూపుతో కేసీఆర్‌ అం‌కురార్పణ చేశారు. అంతేకాదు, ప్రతి నెలా జిల్లాకు గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరు సిఎం కేసీఆర్‌ 350‌కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. గ్రామాలను ఆకుపచ్చగా చూడాలన్న కేసీఆర్‌ ఆశయాలకనుగుణంగా ముందుకె ళ్దామన్నారు. అయితే, పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అన్నారు. అయితే, చెత్తను ఎవరైతే ఇండ్లలో జమ చేసుకుంటారో వారందరూ దరిద్రాన్ని ఏరికోరి జమచేసుకున్నట్లేననీ అన్నారు. ఇల్లు పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీ దేవత మన ఇంట్లో మన వెంటే ఉంటుందన్నారు. అయితే, ప్రతి ఇంట్లో లక్ష్మీదేవత ఆడవాళ్లేననీ అన్నారు. ప్రతి ఇంట్లో ఆడవారే లక్ష్మీ దేవతలు వారితోనే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటాయన్నారు. ఇందు కోసం మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అడుగులు వేయాలని కోరారు. కొల్గూరు గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా, ఆదర్శ గ్రామంగా తయారు చేసుకుందామన్నారు. అలాగే, గ్రామంలో ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని నిషేదిద్ధామనీ, ప్లాస్టిక్‌ ‌రహిత గ్రామంగా మార్చుకుందామనీ పిలుపునిచ్చారు. పాడుబడ్డ ఇండ్లు, పాత గోడలు, ఇంటి పరిసరాల చుట్టూ ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆకుపచ్చ గ్రామంగా తయారు చేయాలనీ, గ్రామంలో పాతగా పాడుబడ్డ ఇండ్లను, పూరి గుడిసెలు తీసివేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతితో వారందరికీ డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను అందిస్తాననీ అన్నారు. గ్రామానికి ఈ నెల 25న తిరిగి వస్తాననీ, అప్పుడు గ్రామంలో 520 ఇండ్లక• ఇంటింటికీ• జ్యూట్‌ ‌బ్యాగులు, తడి, పొడి చెత్త బుట్టలు, తులసి,వేప మొక్కల పంపిణీ చేస్తామని చెప్పారు. గొల్ల కుర్మలకు గొర్రెలు, మేకలు కోసం గ్రామంలో 2 ఎకరాలలో గొర్రెల హాస్టల్‌ ‌నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని, ప్రణాళికా రూపొందించి ప్రతిపాదన ఇవ్వాలని అధికారులకు హరీష్‌రావు ఆదేశించారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా వచ్చిన హరీష్‌రావుకు గజ్వేల్‌, ‌కొల్గూరు చెందిన టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హరీష్‌రావుతో పాటు జిల్లా జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌పద్మాకర్‌, ‌డీపీఓ సురేశ్‌ ‌బాబు, రాష్ట్ర కార్పొరేషన్‌ ‌ఛైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డి, డిసిసిబి ఛైర్మన్‌ ‌దేవేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పిటిసి పంగ మల్లేశం, ఎంపిపి దాసరి అమరావతి శ్యాంమనోహర్‌,‌సర్పంచ్‌ ‌మల్లంరాజు, ఎంపిటిసి జ్యోతిస్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ఆలోచన సిద్ధిపేట అర్బన్‌ ‌మండలం తడ్కపల్లిలో 30 రోజుల ప్రణాళికలలో భాగంగా శ్రమదానంలోనూ మంత్రి హరీష్‌రావు పాల్గొని మాట్లాడుతూ… గ్రామాలు స్వచ్ఛ, ఆరోగ్య గ్రామాలుగా మారాలన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ, మా ఆలోచన అన్నారు. మేడిపండు చూడ మేలిమై ఉండూ.. పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉన్నట్లుగా తడకపల్లిలోని ఇండ్లన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. దీంతో దోమలు వాలి డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వస్తున్నాయన్నారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు పెరుగుతాయన్నారు. ప్రపంచం మొత్తం మీద యుద్ధాలు చేసి 15కోట్ల మంది చనిపోతే, దోమలు కుట్టి 20 కోట్ల మంది జనంచనిపోయారు. ఇబ్రహీంపూర్‌లో ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తున్నారనీ, ఆ ఊర్లో దోమలు, ఈగలు కనపడవు, ఆర్‌ఎం‌పీ వైద్యులు ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజు శ్రమదానం చేయాలనీ, మేమెంత గ్రామాన్ని అభివృద్ధి చేసినా ఇంట్లో శుభ్రం లేకుంటే లాభం లేదన్నారు. త్వరలోనే తడి, పొడి చెత్తలను వేరువేరుగా ఇవ్వడానికి ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలను అందిస్తున్నామన్నారు. తడ్కపల్లికి రూ.6లక్షలతో డంప్‌ ‌యార్డు, ఒక ట్రాక్టర్‌, ‌గ్రామ యువత కోసం రూ.5 లక్షలతో ఓపెన్‌ ‌జిమ్‌, ఒక లైబ్రరీ మంజూరు చేయిస్తాన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కోతుల బెడద తగ్గించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందనీ, ఇతర రాష్ట్రాలలో కూడా ఈ సమస్య ఉందనీ, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోతుల బెడద తగ్గిస్తామన్నారు. ఈ నెల 25న తడకపల్లికి వస్తాననీ, గ్రామాన్ని సందర్శిస్తానని.. అప్పటి వరకు చెత్త చెదారం లేకుండా ఉంటే.. గ్రామ అభివృద్ధి కోసం, సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.50లక్షల రూపాయలు మంజూరు చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పి ఛైర్మన్‌ ‌రోజాశర్మ, డిపివో సురేష్‌బాబు, సూడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావుకు గ్రామ యువత నోటు పుస్తకాలు, తువ్వాలలు అందించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy