Take a fresh look at your lifestyle.

ఇం‌టర్‌బోర్డు తీరుకు నిరసనగా… రగులుతున్న రాష్ట్రం..!

ఎక్కడికక్కడ నాయకుల అరెస్టులు, నిర్బంధాలు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్న కాంగ్రెస్‌ ‌నేతలు
లక్ష్మణ్‌ ‌వినూత్న దీక్ష..! అప్రమత్తమైన పోలీసులు..!!
కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామంటూ
నేతల హెచ్చరికలు

తెలంగాణ ఇంటర్‌ ‌ఫలితాల్లో తప్పులపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థుల భవితవ్యానికి విఘాతం కలిగేలా వ్యవహరించిన ఇంటర్‌ ‌బోర్డు తీరుకు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం విపక్షాల ఆధ్వర్యంలో ‘చలో ఇంటర్‌ ‌బోర్డు క్యాలయం’ ముట్టడి చేపట్టారు. సోమవారం ఉదయమే విపక్షాల నేతలు, విద్యార్థులు భారీ సంఖ్యలో ఇంటర్‌ ‌బోర్డు కార్యాలయంకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఇంటర్‌ ‌బోర్డు సభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ ‌చేయాలని, ఇంటర్‌ ‌బోర్డు తప్పిదాలకు కేసీఆర్‌ ‌బాధ్యత వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించారు. భారీ సంఖ్యలో విపక్షాలకు చెందిన నేతలు, విద్యార్థులు కార్యాలయం వద్దకు దూసుకురావటంతో అప్పటికే అక్కడ పహారాగా ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళన కారులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు డౌన్‌ ‌డౌన్‌, ‌కేసీఆర్‌ ‌డౌన్‌ ‌డౌన్‌ అం‌టూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి ఉధ్రిక్తంగా మారుతున్న తరుణంలో పోలీసులు వారిని ఆందోళన కారులను అదుపులోకి తీసుకొని స్థానిక స్టేషన్‌లకు తరలించారు. అదేవిధంగా టీడీపీ, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ‌ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయమే ఎమ్మెల్యే క్వార్టర్స్ ‌వద్దకు భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, విద్యార్థులు చేరుకొని ముట్టడికి యత్నించారు. దీంతో అప్పటికే అక్కడ పహారాగా ఉన్న పోలీసులు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. ‌రమణతో పాటు పలువురి టీడీపీ, ఎన్‌ఎస్‌యుఐ నేతలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనుభవం లేని గ్లోబరేజ్‌ ‌సంస్థ చేతిలో విద్యార్థుల జీవితాలను పెట్టి ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని, కేసీఆర్‌ ‌మౌనం వీడాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని రమణ డిమాండ్‌ ‌చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని తాము డిమాండ్‌ ‌చేస్తుంటే.. మమ్మల్ని పోలీసులతో అణిచివేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని, కానీ విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆమేరకు చర్యలు తీసుకోవటం లేదని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేతల గృహనిర్భందం..

ఇంటర్‌ ‌బోర్డు కార్యాలయం ముట్టడికి విపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బయలు దేరిన విపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు
చేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో కాంగ్రెస్‌ ‌నాయకుడు అంజన్‌కుమార్‌ ‌యాదవ్‌ను పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఆయన నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. మేడ్చల్‌లో డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌నుసైతం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ ‌నాయక్‌ ‌సహా తెదేపా నాయకుడు సాధినేని శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో పలువురు కాంగ్రెస్‌ ‌నాయకులను అరెస్టు చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!