Take a fresh look at your lifestyle.

ఇం‌కుడుగుంతల నిర్మాణాలను పరిశీలించిన ఎంపిడివో

ఖమ్మం సిటి, జూన్‌ 10, (‌ప్రజాతంత్ర విలేకరి) : ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరులో నిర్మిస్తున్న ఇంకుడుగుంతల నిర్మాణ పనులను ఎంపిడివో వీరేశం పరిలించారు. గ్రామపంచాయతీలో పారిశుధ్య పనులు చేపట్టటం జరిగిందని గ్రామ  ఉపసర్పంచ్‌ ‌మందపాటి వెంకటరెడ్డి తెలిపారు. గ్రామంలో రోడ్ల వెంట చెత్తచెదారం తొలగించామని, దేవిధంఆ ముళ్ల కంపలను తొలగించటం జరిగిందన్నారు. నీరు నిల్వ ఉన్న మురికినీటి గుంటలనే పూడ్చివేసామని చెప్పారు. ఉపాది హామీ ద్వారా చెరువుల్లో పంటకాల్వల్లో గట్ల వద్ద కందకాల పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ ‌బూరుగు చిట్టయ్య, పంచాయతీ కార్యదర్శి రాజగోపాల్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply