Take a fresh look at your lifestyle.

ఆ నాలుగు స్థానాలపై కెసిఆర్‌ ప్రత్యేక నజర్‌

మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 13, (ప్రజాతంత్ర ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాలమూర్‌, గద్వాల, కొడంగల్‌, మక్తల్‌ నియోజకవర్గాలపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధినేత ప్రత్యేకంగా ఫోకస్‌ చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఈ నాలుగు స్థానాల్లో ఎలాగైనా గెలిపించుకోవాలని ఇక్కడి నుండే పోటీచేస్తునటువంటి ప్రజాకూటమి అభ్యర్ధులను ఎలాగైనా ఓడించాలనే ధీమాతో కేసిఆర్‌ ట్రబుల్‌ షూటర్‌ అయిన హరీశ్‌రావుపై ప్రత్యేక బాధ్యత పెట్టినట్లు ఈ జిల్లాకు ఇంచార్జిగా నిర్వహించాలని ఆదేశించినట్లుగా రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ. ప్రత్యేకంగా కొడంగల్‌ నియోజకవర్గం నుండి బరిలో ఉన్నటువంటి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి, గద్వాల నియోజకవర్గం నుండి ఫైర్‌బ్రాండ్‌ డికె.అరుణ, మహబూబ్‌నగర్‌ నుండి బరిలో ఉన్నటువంటి ఎర్రశేఖర్‌, మక్తల్‌ నుండి కొత్తకోట దయాకర్‌రెడ్డిలను ఎలాగైనా ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నాలుగు స్థానాలు అధికార పార్టీ దక్కించుకుంటే ప్రభుత్వం ఏర్పడ్డాక సజావుగా పాలన చేసుకోవచ్చనే ఆలోచనలో టిఆర్‌ఎస్‌ అధిష్టానం ఉన్నట్లుగా గుసగుసలు.

పాలమూరు నుండి గతంలో టిఆర్‌ఎస్‌ కారు గుర్తుకే గెలుపొందినటువంటి శ్రీనివాస్‌గౌడ్‌ ఈసారి భారీ మెజార్టీతో గెలుపొందే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు అనుకుంటున్నట్లు సమాచారం. తెదేపా పార్టీ నుండి బరిలో ఉన్నటువంటి కొత్తకోట దయాకర్‌రెడ్డి, ఎర్రశేఖర్‌లు గెలుపొందితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణలో చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలిస్తే అతని ధీటైన మాటలతో టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులు నిరుత్సాహంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని, గద్వాల కోట జేజమ్మను ఓడించకపోతే ఉమ్మడి జిల్లాలో పార్టీని అధోగతి పాలు చేసే అవకాశాలున్నాయని, చాలా వ్యూహాత్మకంగా ఈ నాలుగు స్థానాలపై కేసిఆర్‌ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లుగా సమాచారం.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!