Take a fresh look at your lifestyle.

ఆవిష్కృ తం కానున్న.. అద్భుతం

చంద్రుని దక్షిణ ధృవంపై దిగనున్న చంద్రయాన్‌-2
15‌నిమిషాలు అత్యంత కీలకం
విద్యార్థులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించనున్న ప్రధానిఅం‌తరిక్ష చరిత్రలో ఇస్రో సువర్ణాక్షరాలు లిఖించే క్షణాలు మరికొన్ని గంటల్లో ఆవిష్కతం కానున్నాయి. ప్రతి భారతీయుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. మన వ్యోమనౌక ’చంద్రయాన్‌-2’ ‌మరికొన్ని గంటల్లో జాబిల్లిపై కాలుమోపబోతోంది.

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు అద్భుతాన్ని ఆవిష్కరించనున్నారు. మరోసారి భారత ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటనున్నారు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ – 2 ‌చంద్రుడిపై వాలనున్నది. చంద్రయాన్‌2‌లోని విక్రమ్‌ ‌ల్యాండర్‌.. ‌నెలరాజుకు చెందిన దక్షిణ ద్రువంపై దిగనున్నది. దీని కోసం ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. శాస్త్రవేత్తలు బెంగుళూర్‌ ‌కేంద్రం నుంచి చంద్రయాన్‌2 ‌గమనాన్ని పరీక్షిస్తున్నారు. దక్షిణ ద్రువంలోని మాంజీమస్‌ ‌సీ, సింపేలియస్‌ ఎన్‌ ‌మధ్య విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌దిగనున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 2‌వ తేదీన విక్రమ్‌ ‌ల్యాండర్‌.. ‌చంద్రయాన్‌2 ‌నుంచి విడిపోయింది. రాత్రి ఒంటి గంట నుంచి చంద్రయాన్‌2 ‌లైవ్‌ను డీడీ లేదా ఇస్రో సైట్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. శుక్రవారం రాత్రి విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌డీసెంట్‌ ‌మోడ్‌లోకి వెళ్తుంది. సుమారు రాత్రి ఒంటి గంటన్నర సమయంలో దాని వేగం తగ్గనున్నది. దాంట్లో ఉన్న నాలుగు ఇంజిన్లు స్వీఛాప్‌ ‌కానున్నాయి. సెంట్రల్‌ ఇం‌జిన్‌ ‌మాత్రం పనిచేస్తుంది. ఆ తర్వాత స్పీడ్‌ను సెకన్‌కు 1.6 కిలోటర్ల వేగానికి మారుస్తారు. ఇక్కడే ఆ 15 నిమిషాలు అత్యంత కీలకమైనవి. విక్రమ్‌ ‌సక్సెస్‌ఫుల్‌గా చంద్రుడిపై దిగాలంటే ఇదే ముఖ్యమైంది. విక్రమ్‌ ‌దిగే ప్రాంతం ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాంజీమస్‌, ‌సింపేలియస్‌ ‌మధ్య ఉన్న ప్రాంతం సమాంతరంగా ఉంటుందని, అది దక్షిణ ద్రువానికి 600
కిలోటర్ల దూరంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్య ఉపరితలంపై సున్నితంగా దిగనున్నది. ల్యాండర్‌లో ఉన్న రోవర్‌ ‌ప్రజ్ఞ శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య బయటికి వచ్చి ఉపరితలంపై దిగనున్నది. దీనికి సంబంధించిన వివరాలతో ఇస్రో గురువారం ఒక వీడియోను విడుదల చేసింది. చంద్రయాన్‌-2 ‌ల్యాండింగ్‌ ‌పక్రియను ప్రధాని మోదీతోపాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 60 మంది విద్యార్థులు బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. రోవర్‌లో ఉన్న సోలార్‌ ‌ప్యానల్‌ ఓపెన్‌ అవుతుంది. విక్రమ్‌ ‌దిగిన 3 గంటల 15 నిమిషాలకు ఆరు గిరకలు ఉన్న రోవర్‌ ‌ముందుకు కదులుతుంది. ఆ తర్వాత 45 నిమిషాలకు చంద్రుడిని తాకుతుంది. అది దిగిన కొద్దిసేపటికి ఫొటోలను పంపుతుంది. అలా కొద్దిరోజుల పాటు అక్కడే తిరుగుతూ చంద్రునిపై ఖనిజాలు, నీరు ఆనవాళ్లను గుర్తిస్తుంది. అది పంపే ఫొటోల ఆధారంగా చంద్రునిపై నీటి శాతం ఎంద ఉందనేది తెలుసుకోనున్నారు.
చంద్రయాన్‌-2 ‌ప్రత్యేక క్షణాలను వీక్షించండి – ప్రధాని మోదీ
అంతరిక్ష చరిత్రలో ఇస్రో సువర్ణాక్షరాలు లిఖించే క్షణాలు మరికొన్ని గంటల్లో ఆవిష్క•తం కానున్నాయి. ప్రతి భారతీయుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. మన వ్యోమనౌక ’చంద్రయాన్‌-2’ ‌మరికొన్ని గంటల్లో జాబిల్లిపై కాలుమోపబోతోంది. అందులో నుంచి ఓ బుల్లి రోవర్‌ ‌బయటకు వచ్చి చంద్రుడిపై అటూఇటూ కలియతిరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఓ సందేశాన్నిచ్చారు. ’చంద్రయాన్‌- 2 ‌దక్షిణ ధ్రువంపై దిగుతున్న ప్రత్యేక క్షణాలు చూడాలని అందరిని కోరుతున్నాను!. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ ‌డియాలో షేర్‌ ‌చేయండి. వాటిలో కొన్నింటిని నేను రీట్వీట్‌ ‌చేస్తాను అంటూ ట్విటర్‌ ‌ద్వారా కోరారు. విద్యార్థులతో కలిసి వీక్షించనున్న ప్రధాని’చంద్రయాన్‌-2’ ‌జాబిల్లిపై దిగే ఘట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 60-70 మంది విద్యార్థులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ల్యాండింగ్‌ ‌పక్రియను మనం కూడా చూడొచ్చు. ఇస్రో ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరులోని శాటిలైట్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌(ఎస్‌సీసీ) నుంచి క్షణ క్షణం సమాచారాన్ని అంతర్జాలంలో పొందుపరుస్తారు. యూట్యూబ్‌లో ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఇం‌డియా ఛానల్‌ ‌ద్వారా కూడా చూడొచ్చు. నేషనల్‌ ‌జియోగ్రాఫిక్‌ ‌ఛానల్‌లో నాసా వ్యోమగామి జెర్రీ లినెంగర్‌ అనుభవాలతో ’చంద్రయాన్‌-2’‌పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy