వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘ఆర్మీలో చేరి దేశానికి సేవచేయాలి’

September 10, 2019

యువతకు ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు పిలుపు సిద్ధిపేట నియోజవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీయువకులకు శుభవార్త. ఆర్మీలో చేరండి. మన దేశానికి సేవ చేసే అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్ధిపేట యువశక్తికి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు ఒక పత్రికా ప్రకటనలో పిలుపునిచ్చారు. మీ వివరాలను పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయబడుననీ, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్ధిపేట యువశక్తికి హరీష్‌ ‌రావు విన్నవించారు. కాగా పోస్ట్ ‌పేరు: సోల్జర్‌ ‌టెక్నికల్‌, ‌సోల్జర్‌ ‌టెక్నికల్‌ ( ఏవియేషస్‌ / అమ్యునేషన్‌ ఎగ్జామినర్‌ ) / ‌సోల్జర్‌ ‌నర్సింగ్‌ అసిస్టెంట్‌ , ‌సోల్జర్‌ ‌క్లర్క్ / ‌స్టోర్‌ ‌కీపర్‌ ‌టెక్నికల్‌ , ‌సోల్జర్‌ ‌జనరల్‌ ‌డ్యూటీ , సోల్జర్‌ ‌ఫార్మా , సోల్జర్‌ ‌ట్రేడ్స్ ‌మెన్‌., అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం తేది : ఆగష్టు-7-2019 నుంచి అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేది : సెప్టెంబర్‌ 17 2019 ‌వరకు ఉంటుందనీ, సెప్టెంబర్‌ 23, 2019 ‌తేదీ తర్వాత అడ్మిట్‌ ‌కార్డులు ఆన్‌ ‌లైనులో జారీ చేయనున్నట్లు, అక్టోబర్‌ 07, 2019 ‌నుంచి అక్టోబర్‌ 17, 2019 ‌వరకు సైనిక నియామక ర్యాలీ తెలంగాణలోని కరీంనగర్‌ ‌జిల్లా కేంద్రంలో గల డాక్టర్‌ ‌బిఆర్‌. అం‌బేద్కర్‌ ‌స్టేడియంలో జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆసక్తి కలిగిన వారు మీరు ఆన్‌ ‌లైనులో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ పేరు, చిరునామా, ఫోను నంబర్లతో సహా సిద్ధిపేటలోని తన నివాసంలో ఓఎస్డీ బాలరాజును లేదా 08457- 222222 సంప్రదించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆ ప్రకటనలో కోరారు.