వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్థిక పరిస్థితి మోడీకి పెను సవాల్‌

September 22, 2019

వెనకటికి ఒక కథ ఉంది. ఒక మహారాజు గారికి ఏనుగంటే ఎంతో ఇష్టం. ఆ ఏనుగు చచ్చిపోయిందని ఎవరైనా మొదటిగా వచ్చి చెబితే వాడి పీక తీసేస్తానని ఆయన దండోరా వేయించాడు. అనివార్యం అయింది జరిగింది. అంటే ఆ ఏనుగు ప్రాణం వీడింది. అయితే, ఆ వార్తను మహారాజుకు చెప్పేందుకు ఎవరూ సాహసించలేదు. చివరికి మావటి వాడు ధైర్యం తెచ్చుకుని ఏనుగు ఏమీ తినడం లేదనీ, లేచి నిలబడటం లేదనీ, శ్వాస తీసుకోవడం లేదనీ, ప్రతిస్పందించడం లేదని చెప్పాడు. అంటే ఏనుగు చచ్చిపోయిందా అని రాజు అడిగాడు. అదే అర్థం మహారాజా అన్నాడు మావటి వాడు. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఏనుగు కథలాగే ఉంది. ఎందరో మంత్రులు తమ భాషలో ఏనుగు బహుశా చచ్చిపోయి ఉండవచ్చునని తమకు తోచిన రీతిలో చెబుతున్నారు. అయితే, ఏ ఒక్కరూ కూడా ఏనుగు చచ్చిపోయిందని స్పష్టంగా చెప్పడం లేదు.
ఆర్థిక పరిస్థితి మోడీకి పెను సవాల్‌

‌సంక్షుభితమైన ఆర్థిక వ్యవస్థ ప్రధాని నరేంద్రమోడీకి పెనుసవాల్‌. ఆయన అంగీకరించకపోవచ్చు. ఆయన అనూహ్యంగా ఎదిగి పోవచ్చు. అంతుబట్టని రీతిలో దీనిని అరికట్టవచ్చు. మెరుగుగా చేయవచ్చు.

వార్తలు సేకరించడం కోసం నేను చాలా కాలం చాలా దేశాలు తిరిగాను. తమ పాలకులకు వ్యతిరేకంగ మాట్లాడటానికి ప్రజలు విముఖత వ్యక్తం చేసేవారు. ప్రజాస్వామ్యం నాకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఏదో వికసిస్తుంటుంది. ఒక్కోసారి హాస్యస్ఫోరకంగా, వ్యంగ్యంగా వినిపిస్తుంటుంది. సోవియట్‌ ‌పాలన బీటలు వారిన సమయంలో మాస్కో వీధుల్లో, దుకాణాల్లో రహస్యంగా చెప్పుకునే మాటలు వినిపించేవి.
గతంలో రహస్యంగా చెవి కోసుకోవడాలను ఇప్పటి వాట్స్ అప్‌లుగా పేర్కొనవచ్చు. పేరు చెప్పడానికి ఇష్టపడని వారు చెప్పారంటూ అసలు విషయం చెప్పడం పెద్ద జోక్‌. ‌దానిని ఎవరు కనిపెట్టారో తలియదు కానీ, దాని వల్ల తప్పించుకోవడానికి మార్గం ఉంది. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులు దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య. ఆర్థిక మాంద్యాన్ని అరికట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌కార్పొరేట్‌ ‌రంగా నికి పన్నులలో కోత ప్రకటిం చారు. దీని వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 1.45 లక్షల కోట్లు తగ్గు తుంది. మోడీ ప్రభుత్వం అనుసరి స్తున్న ఆర్థిక విదానాల వల్ల అనేక అస్తవ్యస్త పరిస్థితులు త) •త్తుతున్నాయి. వెనకటికి ఒక కథ ఉంది. ఒక మహారాజు గారికి ఏనుగంటే ఎంతో ఇష్టం. ఆ ఏనుగు చచ్చిపోయిందని ఎవరైనా మొదటిగా వచ్చి చెబితే వాడి పీక తీసేస్తానని ఆయన దండోరా వేయించాడు. అనివార్యం అయింది జరిగింది. అంటే ఆ ఏనుగు ప్రాణం వీడింది. అయితే, ఆ వార్తను మహారాజుకు చెప్పేందుకు ఎవరూ సాహసించలేదు. చివరికి మావటి వాడు ధైర్యం తెచ్చుకుని ఏనుగు ఏమీ తినడం లేదనీ, లేచి నిలబడటం లేదనీ, శ్వాస తీసుకోవడం లేదనీ, ప్రతిస్పందించడం లేదని చెప్పాడు.
అంటే ఏనుగు చచ్చిపోయిందా అని రాజు అడిగాడు. అదే అర్థం మహారాజా అన్నాడు మావటి వాడు.

ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఏనుగు కథలాగే ఉంది. ఎందరో మంత్రులు తమ భాషలో ఏనుగు బహుశా చచ్చిపోయి ఉండవచ్చునని తమకు తోచిన రీతిలో చెబుతున్నారు. అయితే, ఏ ఒక్కరూ కూడా ఏనుగు చచ్చిపోయిందని స్పష్టంగా చెప్పడం లేదు.

మార్క్ ‌తైవాన్‌ ‌మాటల్లో చెప్పాలంటే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన అంశంపై తీవ్రమైన కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఆర్థిక వ్యవస్థ చాలా ప్రమాదకరమైన రీతిలో ఉంది. మార్కెట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. జూన్‌ ‌నుంచి ఇన్వేస్టర్ల సంపద 11 లక్షల కోట్ల రూపాయిల వరకూ ఆవిరి అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి కొత్తగా మూలధనం వచ్చింది. ద్రవ్యోల్బణం తక్కువలో ఉంది. ప్రభుత్వం ప్రతిస్పందన మూడు కేటగిరీల్లో ఉంది. మొదటిది ఏమిటంటే, మోడీ ద్వేషులు అందించే తప్పుడు సమాచారంతో, వదంతులు వ్యాపింపజేసే వారితో ఆర్థిక వ్యవస్థ స్వరూపంపై నిరాశాజనకమైన చిత్రం ప్రజల ముందు ఉంది. మరో విషయం ఏమిటంటే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌పత్రికా ప్రతినిధుల సమావేశంలో కొన్ని ప్రకటనలు చేశారు. పన్నులలో కోత ప్రకటించారు. ఇంకా మరికొన్ని ప్రకటనలు చేశారు. హోస్టన్‌లో జరిగే ప్రవాస భారతీయుల సమావేశంలో మోడీ గొప్పగా చెప్పుకోవడానికి కావల్సినంత ఇంధనాన్ని ఇచ్చారు. ప్రభుత్వం తన వ్యయంలో భారీగా కోతలను ప్రకటించకపోతే కరెన్సీని మరింతగా ముద్రించడానికి లేదా పేదలపై పరోక్షంగా పన్నులు వేయడానికి దారి తీయవచ్చు. పరిస్థితి మరింత క్షీణించవచ్చు.

ఇక మూడవది గడిచిన ఏడు దశాబ్దాలుగా అతి పెద్ద సవాల్‌గా ఉన్న ఉమ్మడి పౌరస్మృతి, ముమ్మారు తలాక్‌ ‌రద్దు, 370వ అధికరణం రద్దు మొదలైనవి పరిష్కరించినట్టుగా చెప్పుకోవచ్చు, నవంబర్‌లో రామమందిరం నిర్మాణం ప్రారంభం కావచ్చు. ఆర్థిక విషయాల నుంచి దృష్టి మళ్ళించడానికి ఇవన్నీ ఉపయోగ పడతాయి. 2024 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించడం మంత్ర దండం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆర్థిక రంగంలో పరిస్థితులు నాటకీయంగా మెరుగు కావు. మోడీ సన్నిహితుడు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ ‌లాల్‌ ‌కట్టార్‌ ‌ప్రింట్‌తో ఆఫ్‌ ‌ది కఫ్‌ ‌సంభాషణలో ఈ విషయం చెప్పారు. ఆర్థికంగా త్యాగాలకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జాతీయత పటిష్టంగా ఉంటే ఇలాంటి అవ్యవస్థలు పెద్ద లెక్క కాదని అన్నారు. మోడీ పలుకుబడి బాగా ఎక్కువగా ఉందని అన్నారు. దాని ముందు మిగిలిన సమస్యలు పెద్దగా కనబడవని అన్నారు. చంద్రయాన్‌ ‌విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌చివరి వరకూ బాగా ప్రయాణించి తర్వాత ఆగిపోయింది. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నా, మోడీ పలుకుబడి చెక్కు చెదరడం లేదు.

అమెరికాలోని హోస్టన్‌లో వేలాది ప్రవాస భారతీయుల సమావేశంలో మోడీ ప్రసంగించే సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌హాజరవుతున్నారు. మోడీ స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. మోడీ పాపులారిటీ ఎంత ఉందంటే, అలనాడు బంగ్లాదేశ్‌ అవతరణకు దారి తీసిన యుద్ధంలో విజయం సాధించిన ఇందిరాగాంధీకీ ఎంత ఆదరణ ఉందో అంత.

– శేఖర్‌ ‌గుప్త
‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో..