Take a fresh look at your lifestyle.

ఆర్థిక పరిస్థితి దిగజారింది : దేవినేని ఉమ

విజయవాడ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి దిగజారిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్‌ ‌వేదికగా పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో చేసి చూపిన చంద్రబాబు పాలన చూసి ఏపీ సీఎం జగన్‌ ‌నేర్చుకోవాలని హితవు పలికారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి దిగజారింది.

గతేడాది 74 వేలు, అంతకుముందు 65వేల కోట్ల లోటు సంపద సృష్టి. సున్నా 2 లక్షల కోట్ల అప్పు, లక్ష  కోట్లకు పైగా పెండింగ్‌ ‌బిల్లులు. కేంద్రం నుంచి సాధించింది సున్నా. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేసి చూపిన నారా చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి నేర్చుకోండి వైఎస్‌ ‌జగన్‌‘ అని దేవినేని ఉమ ట్వీట్‌లో పేర్కొన్నారు.

24 వరకు ఆస్పత్రిలోనే ధూళిపాళ్ల
అమరావతి : సంగం డెయిరీ చైర్మన్‌ ‌ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను ఈ నెల 24 వరకు ఆస్పత్రిలోనే ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు ఇవే ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు సూచించింది. వీరిని డిశ్చార్జ్ ‌చేసే సమయంలో కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై నివేది కలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. సంగం డెయిరీ చైర్మన్‌ ‌ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డెయిరీలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం ఐపీసీ 408, 409, 418, 420, 465,471,120(బీ) రెడ్‌విత్‌ 34 ‌కింద నరేంద్రపై అభియోగాలు మోపారు.

Leave a Reply