వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్థిక ఇబ్బందులతో గీత కార్మికుడి ఆత్మహత్య

April 4, 2019

ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయి వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో గీతకార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గానుగుపహాడ్‌లో చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు, కుటుంబ సబ్యులు తెలిపిన వివరాల ప్రకారం గానుగుపహాడ్‌ ‌గ్రామానికి చెందిన వంగ వెంకటేశం గౌడ్‌(45) ‌గీత వృత్తిని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ అవసరాలకోసం తీసుకున్న అప్పులు పెరిగిపోవడంతో వృత్తి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో కుమిలిపోయాడు. కుటుంబ పోషణే కష్టంగా మారడంతో, అప్పులు తీర్చే మార్గం లేక మంగళవారం రాత్రి బయటకు వెల్లిన వెంటేం తన అన్న కిష్టయ్య వ్యవసాయం పొ లం వద్ద సాగు చేసిన జామాయిల్‌ ‌తోటలో లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున అన్న కిష్టయ్య తన పొ లం వద్దకు వెల్లగా చెట్టుకు వేల్లాడుతున్న తన తమ్ముడిని చూసి బోరున విలపించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందిం చాడు. ఎస్‌ఐ ‌రాజేష్‌నాయక్‌ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ ‌దేవేందర్‌ ‌శవ పంచనామా నిర్వహించారు. ప్రభుత్వం గీత కార్మికుని కుటుం బాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.