Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ కార్మికులెవరూ సంతోషంగా లేరు

రెండేళ్ల వరకు ఎన్నికలొద్దని సంకేతాలివ్వడం సరికాదు
న్యాయపోరాటం చేస్తాం: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి
సీఎం కేసీఆర్‌ ‌తీరుతో ఆర్టీసీ కార్మికులెవరూ సంతోషంగా లేరని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థా మరెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ప్రజాస్వామ్య దేశంలో డిపోల్లో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదంటూ అభిప్రా యపడ్డారు. మహిళల డ్యూటీల విషయంలో సీఎం ఆదేశాలను అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కొన్ని బస్సులను రద్దు చేస్తున్నారని, సమ్మె కాలంలో కొందరు అధికారులు చేసిన నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణ జరపాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ ‌చేశారు. కొందరు అధికారుల కోసమే రిటైర్మెంట్‌ ‌వయసు పెంచారని, ప్రస్తుతం ఏ ఒక్క కార్మికుడు కూడా తృప్తిగా పని చేయడం లేదన్నారు. లేబర్‌ ‌కమిషన్‌ ‌చెప్పినా మా సంఘాలు వద్దని చెబుతున్నారని, ఆర్టీసీలో యూనియన్లను గుర్తించాలని కోరారు. ఎన్నికలు జరిగేవరకు ప్రస్తుత గుర్తింపు సంఘాలను గుర్తించాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రజాస్వామ్య దేశంలో ట్రేడ్‌ ‌యూనియన్లు ఉండాలని, యూనియన్‌ ఎన్నికలు జరపాల్సిందేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. యూనియన్లకు సంబంధించి రహస్య ఓటింగ్‌ ‌పెట్టాలని, మెజార్టీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. సంక్షేమ కౌన్సిల్‌లో సభ్యులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో చెప్పాలని అశ్వత్థామరెడ్డి నిలదీశారు. బెంగళూరులో 7 వేల బస్సులు ఉన్నాయని, హైదరాబాద్‌లో 3,500 బస్సుల్లో వెయ్యి బస్సులు రద్దు చేస్తున్నారని అశ్వత్థామరెడ్డి విమర్శించారు. బస్సులను కుదించడం వల్ల ఆదాయం వస్తుందేమో కానీ.. ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడతారని అన్నారు. చట్ట వ్యతిరేకంగా కేటాయించే డ్యూటీల్ని ఎత్తివేయాలని, లేకుంటే కార్మికశాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమ్మె కాలంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారని, వారిపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy