Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ కథ ముగిసింది..!

అర్థంపరథం లేని సమ్మె – కార్మిక సంఘాల తీరుతో రోడ్డున పడ్డ కార్మికులు
యూనియన్‌ ఎన్నికలకు ముందు చేస్తున్న హంగామా – విపక్షాల తీరునూ దుయ్యబట్టిన సిఎం కెసిఆర్‌ – ఆర్టీసీని కాపాడలేమని స్పష్టీకరణ
ఆర్టీసీ అన్నది ఇక గడచిన చరిత్ర అని సెం కెసిఆర్‌ ‌స్పష్టం చేశారు. అది మనుగడలో లేనే లేదన్నారు. ఆర్టీసీని కార్మిక సంఘాలే పాతరేసుకున్నాయని అన్నారు. తెలంగాణ భవన్ల్ఓ ‌కెఇసార్‌ ‌డియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సంగాల తీరును, అందుకు వత్తాసు పలుకతున్న వపిక్షాల తీరును ఘాటుగా దుయ్యబట్టారు. పనికిమాలిన సమ్మె అంటూ ఎద్దేవా చేశారు. సంస్థను చేజేతులా చంపుకున్న దానికి బాధ్యులు కార్మిక సంఘాలేనని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ వాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉందా అని కేసీఆర్‌ ‌తిట్టిపోశారు. తిన్నది అరగక చేస్తున్న సమ్మె ఇదని కేసీఆర్‌ ‌మండిపడ్డారు. యూనియన్‌ ఎన్నికల ముందు చేస్తున్న పనికిమాలిన సమ్మె ఇదని ఆయన చెప్పారు. మూడునాలుగేళ్లకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గొంతెమ్మ కోరికలు కోరే చిల్లరమల్లర రాజకీయాలు ఇవని కేసీఆర్‌ ఆ‌గ్రహించారు. ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. నెలకు ఆర్టీసీకి 100 కోట్లకు పైగా నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు రోజుకు రూ.3 కోట్లు నష్టం వస్తోందని, ప్రైవేట్‌ ‌బస్సులకు మాత్రం రూ.4 లక్షల లాభం వస్తోందని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అద్దె బస్సులు తొలగించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారని చెప్పారు. దిక్కుమాలిన నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీసీని ముంచుతామని, నువ్వు కాపాడుకో అన్నట్లుగా కార్మికుల ధోరణి ఉందని కేసీఆర్‌ ‌మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సుమారు రూ.50 వేల జీతం వస్తుందని, అవసరం అయినప్పుడు ఒక గంట ఎక్కువ పనిచేయలేరా అని నిలదీశారు. ’మా కాళ్లు మేమే నరుక్కుంటాం’ అన్నట్లు వ్యవహరించవద్దని ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ ‌హితవు పలికారు. ఇకపోతే తెలంగాణలో సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ ఓ ఆఫర్‌ ఇచ్చారు. యూనియన్లు పక్కనపెట్టి ఆర్టీసీ కార్మికులు పనిచేస్తే రెండేళ్లలో రూ.లక్ష బోనస్‌ ‌తీసుకునే పరిస్థితి ఉంటుందని కేసీఆర్‌ ‌చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అక్రమమని, ఎస్మా ఉండగా సమ్మెకు పోవడం కరెక్ట్ ‌కాదని సీఎం చెప్పుకొచ్చారు. తెలంగాణలో 2600 బస్సులు రీప్లేస్‌మెంట్‌ ‌చేయాల్సిన అవసరం ఉందని, వాటికి రూ. వెయ్యి కోట్లు అవసరమని కేసీఆర్‌ ‌తెలిపారు. పాత ఆర్టీసీ బతికిబట్టగట్టే పరిస్థితి లేకుండా యూనియన్లు చేశాయని, యూనియన్ల చిల్లరరాజకీయాలతో ఆర్టీసీకి భవిష్యత్‌ ఉం‌డదని సీఎం వివరించారు. ’ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే జవాబు’ అని కేసీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు అర్థంపర్ధంలేని డిమాండ్లు చేస్తున్నారని పిచ్చి పంథాను ఎంచుకున్నారని తెలిపారు. ఆర్టీసీని సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశ్యంతో బ్జడెట్‌లో కేటాయింపులు చేస్తే కార్మికులు మాత్రం పిచ్చిగా వ్యవహారిస్తున్నారన్నారు. ఆర్థిక మాంద్యం కొన్ని రంగాలు కుప్ప కూలాయని ఆ పరిస్థితి మన ఆర్టీసీకి రావద్దన్నారు. ఆర్టీసీ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అన్నారు. తాను గతంలో రవాణాశాఖమంత్రిగా పనిచేశానని..అందుకే దేశంలోనే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జీతాలు ఎక్కువగా పెంచామన్నారు. ఎవరుపడితే వారువచ్చి ప్రభుత్వంలో కలపాలంటే ఏంటి పరిస్థితి..మిగతా 57 కార్పొరేషన్లు అడిగితే ఎంటి పరిస్థితి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అనేది అర్ధంపర్ధంలేని డిమాండ్‌ అన్నారు. ఎక్కడేం పనిలేక జెండాపట్టుకుని మాట్లాడుతున్నారని.. సీఎం అయ్యాక నాలుగేళ్లలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను 67శాతం పెంచానని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి ఓ పద్దతి బాధ్యత ఉందన్నారు. ఆర్ధిక పరిస్థితి బాగాలేక ఉంటే..గొంతెమ్మ కోర్కెలా అన్నారు. కొన్ని రాష్టాల్లో్ర ఆర్టీసీని ఎత్తేశారని సీఎం కేసీఆర్‌ ‌గుర్తు చేశారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తరపున కమిటీ వేసింది తానేనని, చర్చలకు పిలవలేదన్న వెధవ ఎవరని కేసీఆర్‌ ‌మండిపడ్డారు. తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటే మాత్రం ఏమిటని, ఆర్టీసీ కార్మికులు ఒక్కరే పాల్గొన్నారా అని సీఎం ప్రశ్నించారు. ’నా ఇంట్లో మనిషి దొంగతనం చేస్తే.. దొంగతనం కాకుండాపోతుందా?’ అని కేసీఆర్‌ ‌నిలదీశారు. పాత ఆర్టీసీని బతికి బట్టకట్టకుండా యూనియన్లే చేశాయని కేసీఆర్‌ ‌మండిపడ్డారు. యూనియన్ల లీడర్లు అద్దె బస్సులను తొలగించాలని అంటున్నారని దాని అర్థం ఆర్టీసీని నిండా ముంచాలనా అని ప్రశ్నించారు. ఆర్టీసీ దగ్గర రూపాయిలేని పరిస్థితి ఉందన్న కేసీఆర్‌.. ‌యూనియన్లు చేస్తున్న పని మహా నేరమన్నారు. సమ్మె చట్టవ్యతిరేకమని..ఆల్రెడీ ఎస్మా ఉందన్నారు. గొంతెమ్మ కోరికలతో, ఆర్టీసీని ఆగం చేసింది యూనియన్లేనని తేల్చి చెప్పారు. యూనియన్లు లేకుంటే ఆర్టీసీలోనూ భవిష్యత్తులో రూ.2లక్షల బోనస్‌ ‌తీసుకునేవారన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇక వెయ్యిశాతం పాత ఆర్టీసీ ఉండదని, ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే జవాబు అన్నారు. డబ్బులు లేవంటే హైకోర్టు కొడుతుందా..ఆస్తులుంటే అమ్మి కట్టాలని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అధికారం లోకి వచ్చాక ఆర్టీసీకి ఇప్పటికే రూ. 4,250 కోట్లు ఇచ్చామని తెలిపారు. బ్జడెట్‌ ‌లోనూ ఎక్కువ రూపాయలు కేటాయిస్తున్నాం.. అయినా ఆర్టీసీ బస్సులతో రోజూ రూ.3కోట్ల నష్టం వస్తుందన్నారు. డ్యూటీ సమయంలో ట్రాఫిక్‌, ‌ప్రయాణికులు ఎక్కేదగ్గర..దిగే దగ్గర కాస్త లేటే అవుతుందని.. దానికి ఎక్కువ సమయం శ్రమిస్తున్నామంటే ఎలా అన్నారు. ఓ గంట ఎక్కువ పని చేస్తే పోయిందేమిలేదన్నారు. అలా అనుకుంటే రైతు వ్యవసాయం చేయగలడా అని ఆర్టీసీ కార్మికులనుద్దేశించి కేసీఆర్‌ ‌ప్రశ్నించారు.
ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టిన హుజూర్‌నగర్‌ ‌ఫలితం
తెలంగాణ భవన్‌లో డియాతో సిఎం కెసిఆర్‌
‌ప్రభుత్వం తన పద్దతిలో తెలంగాణ పురోగతికి చేస్తున్న పనులకు హుజూర్‌ ‌నగర్‌ ‌ఫలితం ద్వారా ప్రజలు మరింత ఉత్సహాంతో పనిచేయడానికి అవకాశం కల్లించారని సిఎం కెఇసార్‌ అన్నారు. ఇది తమకు టానిక్‌లాగా పనిచేస్తుందన్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అఖండ మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్‌ ‌హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక విజయం అనంతరం సీఎం తెలంగాణ భవన్‌లో డియాతో మాట్లాడుతూ… ప్రతీకూల వాతావరణ పరిస్థితుల్లో తాను వెళ్లలేక పోయినప్పటికీ కూడా ప్రజలు అద్భుత మెజార్టీ ఇచ్చారని అన్నారు. ఇది ఏదో ఆశామాషీగా అలవోకగా వేసిన వేటు అనుకోవటం లేదు. చాలా ఆలోచన చేసి వేసినట్లుగా భావిస్తున్నాంమని అన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సర కాలంలో జరిగినటువంటి ఉపఎన్నిక ఇది. పనిచేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వానికి ఈ విజయం ఒక టానిక్‌లాగా పనిచేస్తుందన్నారు. ప్రతిపక్షాల పార్టీలు చాలారకాల దుష్పచ్రారాలు చేశారు. చాలా నీలాపనిందలు వేశారు. వ్యక్తిగతమైన నిందలు సైతం చేశారు. వాటన్నింటిని పక్కనపెట్టి మా అభ్యర్థి సైదిరెడ్డిని 43 వేల మెజార్టీ పైచిలుకుతో గెలిపించారు. గతంలో అదే స్థానాన్ని మేము 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఇప్పుడు 50 శాతం ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఆశీర్వదించారు. హుజూర్‌నగర్‌ ‌ప్రజలు ఏయే ఆశలు, నమ్మకాలు పెట్టుకుని టీఆర్‌ఎస్‌ను గెలిపించారో వందశాతం వాళ్ల కోరికలు తీర్చుతామని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ తెచ్చిన బాధ్యతతో పనిచేస్తున్నాం
తాము రాష్ట్రం తెచ్చినవాళ్లం. దాని మంచిచెడ్డలు తెలుసు కాబ్బటే దాన్ని ట్రాక్‌లో పెట్టడం అనేవి తాము చాలా సీరియస్‌గా భావిస్తాం అని కెసిర్‌ అన్నారు. ఉద్యమ సమయంలో చేసిన వాదన, తెలంగాణ అనుభవించిన కష్టాలు స్పష్టంగా తెలుసు కాబట్టి రాష్టావ్రతరణ అనంతరం కొన్ని తక్షణ రిలీఫ్‌ ‌కావాలి కాబట్టి తామ తీవ్రంగా తీసుకుని వాటిపై పనిచేసినట్లు సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. తెలంగాణ భవన్‌లో
డియాతో సీఎం మాట్లాడుతూ.. తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా కొన్ని పనులు తీసుకున్నట్లు చెప్పారు. ఉదాహరణకు కరెంటు సమస్య.. రాష్ట్రంలో నేడు విద్యుత్‌ ‌సమస్య లేదు. తాగునీటి రంగం.. సింగూరు ద్వారా ఐదారు నియోజకవర్గాలు తప్పిస్తే రాష్ట్రంలో నేడు ఎక్కడా తాగునీటి సమస్య లేదు. సాగునీటి రంగం.. కాళేశ్వరం దాదాపు పూర్తికావొస్తుంది. పాలమూరు ఫుల్‌ ‌స్పీడ్‌తో సాగుతుంది. సీతారామ పూర్తి కావొచ్చింది. దేవాదుల 90 శాతం పూర్తియింది. ఈ నాలుగు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ సాగునీటి రంగం అద్భుతంగా ఉంటుంది. ఆ దిశగానే పయనిస్తున్నాం. ఇక సంక్షేమరంగం.. ఇది కూడా అనితర సాధ్యమైన రీతిలో రాష్ట్రంలో అమలు చేసుకుంటున్నట్లు సీఎం తెలిపారు.
నవంబర్‌లోనే మున్సిపల్‌ ఎన్నికలు
నవంబర్‌ ‌నెలలోనే మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి అవుతాయని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. పల్లె ప్రగతి ప్రణాళిక
కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీవారు మెచ్చుకుంటున్నరు. మంచి సత్ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెండు నూతన చట్టాలు తెచ్చింది. గ్రామపంచాయతీ చట్టం, కొత్త మున్సిపల్‌ ‌చట్టం తెచ్చాం. రెవెన్యూ చట్టం రావాల్సి ఉంది. గ్రామ పంచాయతీ చట్టం, మున్సిపల్‌ ‌చట్టం ద్వారా నియంత్రిత విధానంలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధి జరగాలి. ఉత్త మాటలు చెప్పి అభివృద్ధి అంటే కుదరదు. అందుకు నిధులు సమకూర్చాలి. సెంట్రల్‌ ‌ఫైనాన్స్ ‌కమిషన్‌ ఇచ్చే గ్రాంట్స్‌తో పాటు అంతే స్థాయిలో స్టేట్‌గ్•నాన్స్ ‌కమిషన్‌ ‌ద్వారా ఇచ్చి అభివృద్ధి చేయాలనుకున్నం. గ్రామపంచాయతీలకు ప్రతీనెల రూ.339 కోట్లను విడుదల చేస్తున్నాం. మున్సిపాలిటీలకు కూడా ఇప్పుడు రూ. 1030 కోట్లు 14వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నవి. ఇంతే మొత్తంలో తాము కూడా బ్జడెట్‌లో నిధులు కేటాయించాం. మొత్తం కలిపి రూ. 2060 కోట్లను రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల అభివృద్ధికి కేటాయించనున్నట్లు చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు బెంచ్‌ ‌గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది, మరో సింగిల్‌ ‌బెంచ్‌ ‌న్యాయమూర్తి వద్ద మరికొన్ని కేసులు ఉన్నవి. రేపు వాటిపై తీర్పు వస్తుంది. తీర్పు అనంతరం ఈసీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వస్తది. వచ్చిన వెంటనే నోటిఫికేషన్‌ ‌వెలువరిస్తం. నవంబర్‌ ‌మాసంలోనే మున్సిపల్‌ ఎన్నికలను పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల అనంతరం పట్టణ ప్రగతి ప్రణాళిక కూడా ఒక నెల పాటు చేపడతామని సీఎం తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy