వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆరోగ్య భారత్‌కోసం.. అందరూ ముందుకు రావాలి

August 29, 2019

  • జీవన విధానంలో ఫిట్‌నెస్‌ ‌భాగం కావాలి
  • జాతీయ క్రీడా దినోత్సవంలో ప్రధాని మోదీ పిలుపు
  • ఫిట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని.

మన జీవన విధానంలో ఫిట్‌నెస్‌ను భాగం చేసుకోవాలని, తద్వారా ఆరోగ్య భారత్‌ ‌కోసం అందరూ ముందుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమానికి మోదీ శ్రీకారం చుట్టారు. గురువారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ’ఫిట్‌ ఇం‌డియా’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. అనంతరం వివిధ సాంస్క•తిక కార్యక్రమాలు, నృత్యాలు, క్రీడల మధ్య అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఫిట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని ప్రారంభించిన మోదీ మాట్లాడారు. ఆరోగ్య భారత్‌ ‌కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు ఓ గొప్ప క్రీడాకారుడైన మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌మన దేశంలో పుట్టారని కొనియాడారు. ఆయన తన ఫిట్‌నెస్‌తో, స్టామినాతో, హాకీ స్టిక్‌తో ప్రపంచాన్ని అబ్బు• •పరిచారని, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్న మోదీ పేర్కొన్నారు. ఫిట్‌నెస్‌ ఆరోగ్యానికి ఎంతో అవసరమని, అది ప్రతి ఒక్కరి జీవనవిధానం కావా లన్నారు. జీవి• •ంలో వ్యాయామం, క్రీడలు ఒక భాగం కావాలని, క్రీడల్లో రాణించాలంటే శారీరక దృఢత్వం చాలా ముఖ్యమని తెలిపారు. అలాఉంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవని, దీన్ని నేటి యువతరం గుర్తించాలని అన్నారు. వ్యాయామం చేయాలని చెప్పడమే కాదు.. చేసి చూపించాలన్నారు. నేటికాలంలో సాంకేతికత పెరగడం వల్ల కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నారని, కనీసం 2వేల అడుగులు కూడా వేయలేని పరిస్థితి ఉందని అన్నారు.
దీంతో చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడుతున్నారని, ఫిట్‌నెస్‌ ‌ప్రాధాన్యతపై విస్తృత చర్చ జరగాలని సూచించారు. ఆరోగ్య భారత్‌ ‌కోసం అందరూ ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఫిట్‌నెస్‌ ఆవశ్యకతపై వీడియో రూపొందించి అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పిద్దామని, క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిద్దామని, ఆరోగ్యకరమైన జీవితానికి ఫిట్‌నెస్‌ ‌కంటే ప్రత్యామ్నాయం లేదన్నారు. విజయానికి ఎలివేటర్‌ ఉం‌డదు.. మెట్లెక్కి చేరుకోవాల్సిందేనని, ఆరోగ్యకరమైన వ్యక్తి.. ఆరోగ్యకరమైన కుటుంబం.. ఆరోగ్యకరమైన సమాజం.. నవ భారతాన్ని ఆరోగ్య భారతంగా తీర్చిదిద్దేందుకు మార్గాలివే అని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను మరోసారి అభినందించారు. ఈ సందర్భంతా ప్రదర్శించిన సాంస్క•తి కార్యక్రమాలు అలరించాయి. అనంతరం స్థానికులతో ఫిట్‌నెస్‌పై మోదీ ప్రతిజ్ఞ చేయించారు.