Take a fresh look at your lifestyle.

ఆనందయ్య మందుకు హై కోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌మందును ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి

అమరావతి, జూన్‌ 7 : ఆనందయ్య మందుకు హై కోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో ఆనందయ్య కె మందును ప్రభుత్వం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా బాధితు లకు తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. దీంతో సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైంది. కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయంటూ గతంలో ఏపీ ప్రభుత్వం కె మందుకు అనుమతిని ఇవ్వలేదు. ఈ మందును కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్‌, ఎఫ్‌… ‌మందులకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ ‌నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి.

సీసీఆర్‌ఏఎస్‌ ‌నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు తేల్చాయి. ఇదిలావుంటే నెల్లూరు జిల్లా గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజుకి 2 వేల నుంచి 3 వేల మందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని తెలి పారు. ఆనందయ్య విశేషమైన సేవలు అందిస్తున్నా రన్నారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని కాకాణి సూచించారు. ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవు. సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని చెప్పి.. ఆనందయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోవిడ్‌ ‌వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్‌ ‌మందు వాడాలి. కోవిడ్‌ ‌నివారణ కోసం నీలం రంగు ప్యాకెట్‌ ‌మందు వాడాలి. ప్రజలకు మేలుచేసే ఉద్దేశం తోనే ఆనందయ్యకు మద్దతు ఇచ్చాం. కేవలం సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు. త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం. ఆనందయ్య కుటుంబానికి భవిష్యత్‌లోనూ అండగా నిలుస్తాం. ప్రతిఒక్క ఇంటికీ ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.

Leave a Reply