వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆధ్వాన్నంగా సర్కార్‌ ‌దవాఖాన

August 27, 2019

ఫోటో: మంగళవారం మాజీ మంత్రి శ్రీధర్‌బాబు,మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, వీరయ్య బృందంతో కలిసి  మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిని సందర్శించి పలు విషయాలను అడిగి తెలుసుకుంటున్న దృశ్యం.
ఫోటో: మంగళవారం మాజీ మంత్రి శ్రీధర్‌బాబు,మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, వీరయ్య బృందంతో కలిసి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిని సందర్శించి పలు విషయాలను అడిగి తెలుసుకుంటున్న దృశ్యం.

ప్రజలసోమ్ముతో కేసిఆర్‌ ‌విలాసాలు
అవినీతి సోమ్ముతో తప్పుడు ప్రచారం – కాంగ్రెస్‌ ‌సిఎల్‌పి నేత బట్టి విక్రమార్కజిల్లాలో అధిక ప్రాముఖ్యత కల్గిన మంచిర్యాల ఆసుపత్రికి ఆసిఫాబాద్‌,‌బెల్లంపల్లి,తాండూర్‌,‌జన్నారం,చెన్నూర్‌ ‌తదితర ప్రాంతాల నుండి అధికంగా పేద ప్రజలు మంచిర్యాల ఆసుపత్రికి రోగులు వస్తారని ఆసుపత్రి పరిస్దితి పూర్తిగా ఆధ్వాన్నంగా మారిందని పేద ప్రజల ఊసురు టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి తాకుతుందని కేసిఆర్‌ ‌కుటుంబం ప్రజల సోమ్ముతో విలాసాలకు పాల్పడుతుందని అవినీతి సోమ్ముతో తప్పుడు ప్రచారం చేస్తుందని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంకు కనీసం ఇంగితజ్ఞానం లేదని కాంగ్రెస్‌ ‌సిఎల్‌పినేత బట్టి విక్రమార్క్ ‌తెలంగాణ టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పార్టీ మీద పలు విమర్శాలు చేశారు. ఆయన మంగళవారం మాజీ మంత్రి శ్రీధర్‌బాబు,మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, వీరయ్య బృందంతో కలిసి మంగళవారం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిని సందర్శించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆసుపత్రిని సందర్శించి సుమారు 2:30 గంటల పాటు ఆసుపత్రిలో రోగులతో గడిపారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వాసుపత్రిలను సందర్శిస్తున్నామని అందులో భాగంగానే మంచిర్యాల ఆసుపత్రి సందర్శించడం జరిగిందని పేర్కోన్నారు. ఆసుపత్రిలో బెడ్స్,‌బ్లాకెట్స్,‌బెడ్‌షీట్స్ ‌లేవని ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్‌ ‌యశ్వంత్‌రావు, ఆర్‌ఎంఓ అనిల్‌ ‌రావ్‌,‌జిల్లా వైధ్యాధికారి భీష్ము వైద్యులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆసుపత్రి శానిటేషన్‌ ‌పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. రోగులతో వచ్చే వారికి సైతం జబ్బులు వాటిల్లే ప్రమాదం పేర్కోన్నారు. త్రాగునీరు అసలే కరువైయిందన్నారు. డ్రైనేజీ, నిత్యం వాడే నీరు లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కోంటున్నారని ఆరోపించారు. వంద పడకల కెపాసిటి ఉన్న ఆసుపత్రి 220 పడకల ఆసుపత్రిగా రూపుదిద్దామని టిఆర్‌ఎస్‌ ‌నేతలు చెప్పుకోవడంలో అర్దం లేదన్నారు. 220 పడకల ఆసుపత్రికి సరిపడే వసతులు కరువైయ్యాయని ఆరోపించారు.తెలంగాణ ప్రభుత్వం 220 పడకల గదులను పెంచడం జరిగిందని ప్రగడ్భల్‌ ‌పలుకుతున్నారని యదేవా చేశారు. వైద్యుల రిక్రూట్‌మెంట్‌ అసలే లేదన్నారు. 66 మంది డాక్టర్లు ఉండావాల్సిన ఆసుపత్రికి కేవలం 20 మందే వైద్యులు ఉన్నారని పేర్కోన్నారు. 74 మంది నర్సులు ఉండాల్సింది ఉండగా 24 మంది నర్సులే ఉన్నారని తెలిపారు. గైనాకాలాజి వైద్యులు 12 మంది ఉండాల్సిందిగా కేవలం ఇద్దరే ఉన్నారని తెలిపారు. టెక్నిషియన్‌లు 12 మంది ఉండాల్సింది ఉండగా 4 మాత్రమే కొనసాగుతున్నారని పేర్కోన్నారు. బెడ్‌ ‌షీట్స్ అసలే లేవని ఆరోపించారు. హాస్పిటల్‌లో వెంటిలేటర్‌లు లేకుండా రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కోన్నారు. ఆసిఫాబాద్‌ ఆ‌శ్రమ పాఠశాల నుండి జ్వరంతో వచ్చిన విద్యార్ది కూర్చి పైననే పండుకోబెట్టడం చూస్తూంటే తెలంగాణ ప్రభుత్వానికి పేదల గోసా తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్‌లో గైనాకాలాజిస్ట్ ‌లేకపోవడంతో రోజుకు 100 పేషెంట్‌లు వాపస్‌ ‌పోతున్నారని పేర్కోన్నారు. ఇది తమకు బాదను కలిగించిందని కేసిఆర్‌ ‌ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తరపున బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌లేకపోవడం విడ్డూరమన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల గోసా తగులుతుందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా బంద్‌ అయ్యాయని అన్నారు. రోగులు నరకయాతన భయకరమైన వాతావరణంలో ప్రభుత్వాసుపత్రిలో బిక్కుబిక్కుమని వైద్య సేవలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్‌,‌జిల్లా వైద్యశాఖమంత్రి పరిస్దితికి బాద్యత వహించాలని పేర్కోన్నారు. స్దానిక ఎమ్మెల్యే సైతం ప్రభుత్వాసుపత్రి పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. గాలి మాటలు చెప్పుతూ ప్రజలను మోసం చేస్తూన్నారని ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రి పని తీరు పూర్తిగా బాగా లేదని పేర్కోన్నారు. అసలే కేసిఆర్‌ ‌కుటుంబామే స్దానికంగా ఈ ఆసుపత్రిలో ట్రిక్‌మెంట్‌ ‌చేసుకుంటే పూర్తిగా పరిస్దితి అర్దం అవుతుందని తెలిపారు. ప్రజల సోమ్ముతో కేసిఆర్‌ ‌కుటుంబం విలాసాలు చేస్తుందన్నారు. అవినీతి సోమ్ముతో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మానవతదృక్పథంతో కళ్ళు తెరిచి ప్రభుత్వాసుపత్రి వసతులను బాగు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అనంతరం మాజీ మంత్రి శ్రీధర్‌ ‌బాబు మాట్లాడుతూ ఆపరేషన్‌ ‌థియేటర్‌ ‌పూర్తిగా ఆధ్వాన్నంగా మారిందని అన్నారు. సీజనల్‌ ‌వ్యాధుల పట్ల చర్యలు కరువైయ్యాయని పేర్కోన్నారు. రాష్ట్రంలో 1 కోటి 20 లక్షల మంది జ్వరాలతో బాదపడుతున్నారని పేర్కోన్నారు. చిత్తశుద్ది లేని తె)ంగాణ ప్రభుత్వం విద్య,వైద్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కోన్నారు. అనంతరం కాంగ్రెస్‌ ‌పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ సదరన్‌ ‌క్యాంపుకు వచ్చే రోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కోంటున్నారని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగే రోగులకు కేసిఆర్‌ ‌కిట్స్ అం‌దడం లేదని పేర్కోన్నారు. విద్య,వైద్యం విషయంలో కేసిఆర్‌ ‌నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నాడని ఆరోపించారు. సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కోన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కేసిఆర్‌ ‌తెలంగాణ ప్రజలకు తగు న్యాయం చేయాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు విశ్వప్రసాద్‌, ‌రాష్ట్ర అధికార ప్రతినిది చిట్ల సత్యనారాయణ,మాజీ కౌన్సిలర్లు బుద్దార్ది రాంచెందర్‌,‌దాసరి లచ్చన్నతో పాటు గాండ్ల సత్తమ్మ,పిసి సంఘాల నాయకులు నరేందర్‌నాయుడు,శేశికళ,పెంట రజిత రమేష్‌,‌ఖదీర్‌,అం‌కం నరేష్‌,‌రవితో పాటు తదితరులు పాల్గొన్నారు.