వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆదివాసీ కోలాటాలతో దద్దరిల్లిన భద్రాద్రి

August 9, 2019

సంస్కృతి సాంప్రదాయాలతో భారీగా ర్యాలీ
ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకున్న ఆదివాసీలు
ముందుగా అల్లూరిసీతరామరాజు, మల్లుదొర, గట్టందొర విగ్రహాలకు పూలమాలలు
ఆదివాసీల కొమ్ముడ్యాన్స్, ‌కోలాటాలతో భద్రాచలం ప్రధాన రహదారులపై భద్రాచలం దద్దరిల్లింది. ఆదివాసీల కేరింతలతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలైన డ్యాన్సులతో చూపరులను ఆకట్టుకున్నాయి. ముందుగా అంబేద్కర్‌ ‌సెంటర్‌లో ఉన్న అల్లూరి సీతరామరాజు, మల్లుదొర,గట్టం దొర విగ్రహాలకు పూలమాలలు వేసారు. అనంతరం అంబేద్కర్‌ ‌సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పిఓ పాల్గొని నృత్యాలు చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇతిహాస నాగరికత సంస్కృతి సాంప్రదాయాల ను పాటించడంలో నిలువుటద్దం ఆదివాసీ గిరిజనులను ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశ జనాభా సంస్కృతి సాంప్రదాయాలు పాటించి ఆదివాసీ తెగ అంతరించి పోకుండా కాపాడుకున్నవారమవుతామని ఐటిడిఏ పిఓ విపి గౌతమ్‌ అన్నారు. శుక్రవారం నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆదివాసీలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా మార్కెట్‌ ‌సెంటర్‌ ‌దగ్గర ఉన్న కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి గిరిజనుల ర్యాలీలో పాల్గొని అంబేద్కర్‌ ‌విగ్రహానికి , అల్లూరి సీతరామరాజు , గంటల దొర, మల్లు ఒర విగ్రహాలకు పూలమాల వేసి గిరిజనులతో కలిసి సాంస్కృతి కార్యక్రమంలో పాల్గొని నృత్యాలు చేసారు. అనంతరం గిరిజన అభ్యుదయ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం ఎందరో ఆదివాసీలు ప్రాణత్యాగాల ఫలితంగా 1952 సంవత్సరంలో ఐఖ్యరాజ్య సమితి ఆదివాసీలు స్వేఛ్ఛ స్వాతంత్య్రలుగా
జీవించడానికి 140 దేశాలు ప్రతినిధులు పాల్గొన్న ప్రపంచ ఆదివాసీ దినంగా ఆగస్టు9న నాడు తీర్మాణం చేసిందనందుకు ఆరోజు నుండి ఈరోజువరకు ప్రపంచ మొత్తం ఆదివాసీ తెగ గిరిజనులు వారి సంస్కృతి సాంప్రదాయాల పరంగా పండుగల ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. ప్రపంచంలో 7వేల భాషలున్నాయని 90శాతం ఆదివాసీలకు సంబంధించిన భాష•లని కానీ ఆదివాసీలు 5శాతం మాత్రమే ఉన్నారని ఆదివాసీలు తక్కువ మంది మాత్రమే భాషలో మాట్లాడుతారని ఇలా ఉండటం వలన మన భాష సంస్కృతి సాంద్రపాయాలు అందరించిపోయ ప్రమాదం ఉందని ఆయన అన్నారు. దాదాపు 10 కోట్ల మంది జనాభా తెలుగు మాట్లాడుతారు. అమెరికా దేశం కూడ తెలుగు నేర్చుకొని మాట్లాడానిక ప్రయత్నిసారని అయిన వారి సాంద్రపాయాన్ని భంగం కలిగించుకోరని ప్రసుత్తం ఆదివాసీల తెగల పిల్ల విషయంలో వారి సంస్కృతి భాష అనేది తెలియదని 80శాతం మంది యువకులు భాష అనేది రాదని ఆయన అన్నారు. ఆదివాసీ కుటుంబాలు వారి పిల్లలకు చిన్నప్పటి నుండి నుండి సంస్కృతి సాప్రదాయాలు భాషలోని ప్రాముఖ్యతను తల్లితండ్రులు నేర్పించాలని అన్నారు. ఆదివాసీ భాషలుకు ప్రాముఖ్యతను నేర్పించాలని అన్నారు. ఇప్పుడే కొందరు ఆదివాసీలు ఆదిమ భాషలో లిపి ప్రక్రియ ప్రారంభించారని తొందరలోనే అన్నీ జిల్లాలకు లిపి కి సంబంధించి పుస్తకాలు సరఫరా కావచ్చని అన్నారు. ఈ సంవత్సరం ఐఖ్యరాజ్య సమితి ఆదివాసీ సంవత్సరంగా గుర్తించిందని అందుకోసం ఆదివాసీ సంఘాల నాయకులు గ్రామాలలోని సంబందించిన యువకులకు వారికి కావాల్సిన హక్కుల కోసం పోరాడాలని భూమి రిజర్వేషన్‌ ‌కోసం లోకల్‌ ‌సర్టిఫికెట్‌లు కోసం దానికి మాత్రమే పరిమితం కాకూడదని భారత•దేశంలో ఎక్కువగా ప్రైవేటు సెక్టార్లు ఉన్నాయని ఎక్కువ మంది ఉద్యోగులు ప్రైవేటు పనిచేసి కోటీశ్వరులు అయినవారు చాలామంది ఉన్నారని మనం కూడ స్కిల్స్ ‌డెవలప్‌మెంట్‌ ‌చేసుకొని నైపుణ్యలను పెంచుకోవాలని అభివృద్ది చేందాలని సూచించారు. ప్రతీ 5లక్షల జనాభాలో లక్ష కుటుంబాలు ఉన్నాయని ఆ కుటుంబాలు అభివృద్ది చెందాలంటే ఆదివాసీ సంఘాల ప్రత్యక్ష పాత్ర వహించాలని అన్నారు. గిరిజన విద్యార్ధినీ విద్యార్ధులు విద్యకొరకు ఆశ్రమ పాఠశాలలు గురుకుల పాఠవాలలో 2150 హ్యాబిటేషన్‌లు గిరిజన ఆదివాసీలు పిల్లలకొరకు హాస్టల్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ‌ప్రారంభించాని టీచర్లు సమాజ సేవలో పాటు గిరిజన విద్యార్దుల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ద కనపరచానలి అన్నారు. ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లీషు మిడియం కూడ నేర్పిస్తున్నారని పిల్ల తల్లింతండ్రులు అవగాహన కల్పించి వెనుకడుగు వేయకుండా చూడాలని అన్నారు. ఆదివాసీ గిరిజనులు జవాబుతనంగా ఉండాలని అన్నారు. గిరిజన విద్యార్దులు 10వ తరగతి వరకు చదివి ఊరికే ఉండకుండా సూల్స్ ఎక్స్‌లెన్స్ ‌కాలేజీ ఖమ్మంలోని తనిఖీ పిల్లలు దమ్మపేట కాలేజీ ఐఐటి, ఐఐఐటి ఎంసెట్‌, ‌పరీక్షలు వ్రాయడానికి శిక్షన ఇస్తున్నారని ఈ కాలేజీలో చదివిన వారు పెద్ద మిడిసిలేరు గ్రామానికి ఐదుగురు విద్యార్దులు సీట్లు సంపాదించి ఇంజీనిరంగ్‌ , ‌డాక్టర్‌ ‌కోర్సులు చదువుతున్నారని అన్నారు. మన సంస్కృతి సాంద్రపాయాలు సంఘాల నాయకులుగా బాగా అభివృధ్ది చేయాలని అన్నారు. ఆదివాసీ గ్రామాలు వారికి ఉన్న వనరులు లబ్దిపొందడానికి పీసా చట్టం ప్రభుత్వం ప్రవేశపెట్దింని భారతదేశానికి పార్లమెంటుకు పీసా చట్టం ఎంత పవర్‌ ఉం‌దో పీసా కమిటీకి అంతర పవర్‌ ఉం‌దని అన్నారు. కొత్తగా ఐటిడిఏ సమగ్రసమాచారం తెలుసుకొని ఒక వెబ్‌సైట్‌ ‌ప్రారంభించామని అన్నారు. గిరిజన యువకులు ఆర్మీ రిక్యూర్మ్ం‌ట్‌ ‌శిక్షణ మార్కెటింగ్‌ ‌కంప్యూటర్‌ ‌శిక్షణలు ఇస్తున్నామని చాలా మంది యువకులు లబ్దిపొందుతున్నారని అన్నారు. త్వరలో డిగ్రీ కాలేజీ గ్రూప్‌ ‌వన్‌ ‌కోర్సు ప్రవేశ పెడుతున్నామని ఆదివాసీ సంక్షేమానికి ప్రతీ ఒక్కరు కృషి చేస్తామని అన్నారు. అనంతరం రేలరేల పాటల సిడిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిటిడిఓ జహీరుద్దీన్‌, ఏపిఓ నాగోరావు, ఏఓ భీమ్‌, ఇఇటిలు కోటిరెడ్డి, మేనేజర్‌ ‌సురేంధర్‌ , ‌డియం జిసిసి కుంజా వాణి, వెంకటేశ్వరరావు, కుంజా ధర్మ, రమేష్‌, ‌వీరభద్రం, జయబాబు, పుల్ల్లయ్య, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.