Take a fresh look at your lifestyle.

ఆదాయం పెంచి, పేదలకు పంచాలనేదే సిఎం ధ్యేయం

టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌‌రాష్ట్ర ఆదాయాన్ని పెంచి,దానిని పేదల సంక్షేమం కోసం వినియోగించా)నేదే సిఎం కెసిఆర్‌ ‌ధ్యేయమని టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌,‌సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు వ్యాఖ్యానించారు.పేదల జీవనప్రమాణాలను పెంచడంతోనే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.ఆసరా పెన్షన్ల ప్రోసీడింగ్‌ను సిరిసిల్ల పట్టణంలో పంపిణి చేసిన సందర్భంగా సమావేశంలో కెటిఆర్‌ ‌మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ ఏర్పడగానే ఆసరా పెన్షన్లను ఐదు రెట్లు పెంచామని,ప్రస్తుతం దానిని రెట్టింపు చేశామని అన్నారు.బీడి కార్మికులకు పిఎఫ్‌ ‌కటాఫ్‌ ‌తేదిని 2014 నుండి 2019కి పెంచడం ద్వారా 2లక్షల మందికి లబ్ది చేకూరిందని అన్నారు.సిరిసిల్ల నియోజక వర్గంలో 15 వందల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని,త్వరలో వాటిని పంపిణి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 50లక్షల పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం 12 వేల కోట్లు వ్యయం చేస్తుందని,వీటిలో కేవలం 2వందల కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు.సిరిసిల్ల ప్రజలతోనే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని,సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో టెస్కాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌రావు,జడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ,జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌,‌జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య,రైతు సమన్వయ సమితి సమన్వయ కర్త గడ్డం నర్సయ్య,సెస్‌ ‌చైర్మన్‌ ‌దోర్నాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy