Take a fresh look at your lifestyle.

ఆదర్శప్రాయుడు మహత్మ జ్యోతి భా పూలే

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు

మహత్మ జ్యోతిభా పూలేను అందరు ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడవాలని జిల్లా కలెక్టర్‌ ‌శ్రీదేవసేన అన్నారు. మహత్మ జ్యోతిభా పూలే 193వ జయంతిని పురస్కరించుకోని కలెక్టరేట్‌ ‌సమావేశ మందిరంలో గురువారం మహత్మ జ్యోతిభా పూలే చిత్రపట్టానికి పూల మాల వేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు జ్యోతి భాపూలే అన్నారు. బడుగుల స్ఫూర్తి కొరకు పూలే పడిన ఆరాటం అనిర్వచనీయమని కొనియాడారు. పూలే సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన హక్కులు ఉండాలని, స్త్రీలు సంఘంలో పురుషులతో సమాన భాగంగా వుండాలని పోరా టం చేసి దేశాన్ని మేల్కోల్పి, సంఘ సంస్కరణలలో గాంధీ, అంబేద్కర్లకు ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి పూలే అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో జెసి వనజాదేవి, జిల్లా వ్యవసా య అధికారి తిరుమల్‌ ‌ప్రసాద్‌, ‌జిల్లా బిసి సంక్షేమాధికారి వెంకటేశ్వరి, జిఎం పరిశ్రమలు ప్రేమ్‌ ‌కుమార్‌, ‌కలెక్టరేట్‌ ఎఒ, ‌సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy