Take a fresh look at your lifestyle.

ఆత్మీయ ఆలింగనం.. పలకరింపులు.. పరామర్శలు.. ప్రారంభోత్సవాలు… ఆదేశాలు

సిద్ధిపేటలో హరీష్‌రావు రెండోరోజు పర్యటన..

ఫోటో: మంగళవారం సిద్ధిపేటలోని బావీస్‌ఖానాఫూల్‌ను పరిశీలిస్తున్న మంత్రి హరీష్‌రావు.
రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సిద్ధిపేటకు తొలిసారిగా వచ్చిన తన్నీరు హరీష్‌రావు రెండోరోజు కూడా బిజిబిజిగా గడిపారు. సిద్ధిపేటలోని హరీష్‌రావు స్వగృహానికి మంగళవారం ఉదయం 6గంటల నుంచే సందర్శకుల తాకిడి మొదలైంది. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని నలు మూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు హరీష్‌రావు ఇంటికి చేరుకున్నారు. పుష్పగుచ్చం, పూల మొక్కలు బహుకరించి, బొకేలు, శాలువ, తువ్వాలతో సన్మానిస్తూ… మిఠాయిలు తినిపించి అభిమానాన్ని పంచుకున్నారు. కొందరు శుభాకాంక్షలు తెలిపితే…మరికొందరు  అభినందనలు తెలిపారు. వచ్చిన వారందరినీ హరీష్‌ ఎం‌తో ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆప్యాయతతో పలుకరించారు. యువతతో సెల్ఫీలు దిగారు. ముందుగా హరీష్‌ను కొమురవెళ్లి మల్లన్న ఆలయ వేద పండితులు మంత్రోచ్చారణ చేసి ఆశీర్వదించారు. ఈ మేరకు పలు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలను పలువురిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ.. ఆప్యాయంగా పలకరింపులతో సిద్ధిపేటలోని ఆయన నివాసం వద్ద పండుగ  వాతావరణం నెలకొన్నది. బావీస్‌ఖానాపూల్‌ ‌కాల్వను పరిశీలించారు. అనారోగ్యానికి గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తన వ్యక్తిగత సహాయకుడు(మీడియా ఇంఛార్జి)కలకుంట్ల శేషును పరామర్శించారు.   అనంతరం పట్టణంలో రత్నదీప్‌ ‌రీ టైలింగ్‌ ఔట్‌ ‌లెట్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌ను ప్రారంభించారు.

బావీస్‌ఖానాపూల్‌ ‌మురికి కాల్వ యుద్దప్రాతిపదికన శుభ్రం చేయాలి

మున్సిపల్‌ అధికారులను ఆదేశించిన హరీష్‌రావు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రస్తుత సీజనల్‌ ‌వ్యాధుల దృష్ట్యా పట్టణంలో నిల్వ ఉన్న మురికి కాల్వలను, నీటిని తొలగించి యుద్ద ప్రాతిపదికన పరిశుభ్రం చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలో గల హైదరాబాదు రోడ్డులోని బావీస్‌ఖాన్‌పూల్‌ను బుధవారం  మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు, డిప్యూటీ ఈఈ లక్ష్మణ్‌, ‌సూడా డైరెక్టర్‌ ‌మచ్చ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు విష జ్వరాలు రాకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ స్పెషల్‌ ‌డ్రైవ్‌లో భాగంగా పట్టణంలోని ప్రతీ వార్డుల్లో మున్సిపాలిటీ అధికారిక యంత్రాంగం, స్థానిక వార్డు కౌన్సిలర్ల సమన్వయంతో కలిసి ఇంటింటా తిరిగి ప్రజలకు పరిసరాల పరిశుభ్రత తెలియవచ్చేలా చేపడుతున్న చర్యలపై మున్సిపల్‌ అధికారులను ఆరా తీశారు. రెండు రోజుల్లో బావీస్‌ఖానాఫూల్‌ ‌మురికి కాల్వ, నీటి ప్రవాహం సరిగ్గా ఉండేలా యుద్దప్రాతిపదికన శుభ్రం చేయాలని ఆదేశిస్తూ.. ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు వార్డులకు చెందిన మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, మున్సిపల్‌ ఇం‌జనీరింగ్‌ ‌విభాగం అధికారులు మహేష్‌, ‌మున్సిపల్‌ ‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గెట్‌ ‌వెల్‌ ‌సూన్‌ ‌శేషు..
నిత్యం సిద్ధిపేట అభివృద్ధిలో..మంత్రి హరీష్‌రావు వెంట ఉండే వ్యక్తిగత పీఆర్వో శేషుకుమార్‌ ఇటీవల కొన్ని రోజులుగా అస్వస్తతకు గురయ్యారు. శేషు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండటంతో హైదరాబాద్‌ ‌నుంచి సిద్ధిపేటకు వచ్చిన హరీష్‌రావు సిద్ధిపేటలోని శేషు ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొంత కాలం విశ్రాంతి తీసుకుని కోలుకోవాలని సూచిస్తూ.. ఆరోగ్యంగా ఉండేలా యోగ సాధన చేయాలని, మంచి ఆహారం తీసుకోవాలని గెట్‌ ‌వెల్‌ ‌సూన్‌ ‌శేషు అని చెప్పారు.

ఆర్థిక సాయం…
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్‌లో ఇటీవల తన వ్యవసాయ పొలం వద్ద  పులిగిళ్ల సత్తయ్య విద్యుత్‌ ‌షాక్‌తో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని.. స్థానిక సర్పంచ్‌, ‌ప్రజా ప్రతినిధులు హరీష్‌రావు దృష్టికి తీసుకురావడంతో సత్తయ్య కుటుంబంలో ఇద్దరు కుమారులు వరుణ్‌, ‌నవీన్‌లు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న దృష్ట్యా తన స్వంత డబ్బులు 50 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని సత్తయ్య భార్య మల్లవ్వకు హరీష్‌రావు అందజేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy