Take a fresh look at your lifestyle.

ఆత్మహత్యలు వద్దు.. పోరాడి సాధించుకుందాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
‌సురేందర్‌ ‌మృతదేహానికి నివాళి
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం సరికాదని, ధైర్యంగా సమస్యలపై పోరాడి సాధించుకుందామని, అందుకు బీజేపీ అండగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యకు పాల్పడిన రాణిగంజ్‌ ‌డిపో కండక్టర్‌ ‌సురేందర్‌గౌడ్‌ ‌మృతదేహానికి సోమవారం లక్ష్మణ్‌ ‌సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సురేందర్‌ ‌గౌడ్‌ ‌తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సురేందర్‌గౌడ్‌ ‌కుటుంబసభ్యులను బీజేపీ నేత లక్ష్మణ్‌ ‌పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటూ మొండి వైఖరితో కేసీఆర్‌ ‌సమస్యలు పరిష్కరించకుండా వారిని రెచ్చగొడుతున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి మన హక్కులు సాధించుకుందామని లక్ష్మణ్‌ ‌సూచించారు. శ్రీనివాసరెడ్డి, సురేందర్‌ ‌గౌడ్‌ ‌మృతితో మరో తెలంగాణ ఉద్యమం మొదలైందని తెలిపారు. కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తప్పకుండా తగులుతుందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేపీ కార్మికుల పక్షాన పోరాడుతుందని అన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy