Take a fresh look at your lifestyle.

ఆటంకాలు లేకుండా రామమందిరం పూర్తి కావాలి : చల్లమల్ల

సూర్యాపేట, ఆగస్టు 5, ప్రజాతంత్ర ప్రతినిధి): అయోధ్యలో రామజన్మభూమి నందు రామమందిర భూమి పూజ బుధవారం జరుగుతున్న నేపధ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 42వ వార్డు రైతు బజార్‌ ‌వద్ద బిజెపి పంచాయతీరాజ్‌ ‌సెల్‌ ‌జిల్లా అధ్యక్షులు, మున్సిపల్‌ ‌మాజీ కౌన్సిలర్‌ ‌చల్లమల్ల నరసింహ ఆధ్వర్యంలో శ్రీరాముని చిత్రపటానికి పూజులు నిర్వహించి, కొబ్బరికాయలు సమర్పించి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాణసంచా పేల్చారు. అనంతరం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రంగరాజు రుక్మారావు, చల్లమల్ల నర్సింహ మాట్లాడుతు శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో రామమందిరంను 500సంవత్సరాల క్రితం బాబరు అనే వ్యక్తి పేరు మీద ఒక నిర్మాణాన్ని కట్టడం జరిగింది, వారి పరిపాలనలో ఈ దేశం ముస్లింల పాలనలో ఉన్న రోజుల్లో హిందువుల మనోభావాలు దెబ్బతీసి అట్టి నిర్మాణాన్ని చేయడం జరిగింది.

అప్పటినుండి నేటి వరకు హిందువులు రాములు జన్మించిన అయోధ్యలో ఆయన మందిరాన్ని ఏర్పాటుచేయాలని న్యాయబద్దంగా పోరాటం చేశారు. దీంతో సుప్రీం కోర్టు సైతం రామమందిరాన్ని ఏర్పాటుచేయాలని తీర్పు ఇవ్వడంతో బుధవారం మధ్యాహ్నం 12. 30నిమిషాలకు ప్రధాని నరేంద్రమోది చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. రాములు పరిపాలించిన  పాలన కావాలని హిందువులంతా ఇప్పటిదాకా కోరుకున్నారని, ఆ కల నేటితో నెరవేరిందని పేర్కొన్నారు. రామమందిర  నిర్మాణం ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తకావాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లకుంట్ల అయోధ్య, గార్లపాటి మమతా రెడ్డి, తప్పెట్ల శ్రీరాములు, దోసకాయల ఫణినాయుడు, చాడ పాపిరెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మి,  రాచూరి మహేష్‌, ‌మణి, సోమయ్య, మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply