Take a fresh look at your lifestyle.

ఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటుకు సోనూసూద్‌ ‌సిద్ధం

  • తొలిదశలో కర్నూలు, నెల్లూరుల్లో ప్లాంట్ల ఏర్పాటు
  • సోనూ నిర్ణయాన్ని స్వాగతించిన కర్నూలు కలెక్టర్‌‌

‌కర్నూలు,: కోవిడ్‌ -19 ‌మహమ్మారి పోరాటంలో సోనూసూద్‌ ‌నిరంతరంగా సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈ భయంకరమైన సమయాలను సులభంగా దాటడానికి వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యుఎస్‌, ‌ఫ్రాన్స్ ‌నుంచి ఆక్సిజన్‌ ‌ప్లాంట్లను తెప్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని అవసరమైన ఆసుపత్రులలో ఏర్పాటు చేయనున్నారు. అయితే మొదటి రెండు ప్లాంట్లను ఆంధప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రణాళికను సిద్ధం చేశారు. సోనూసూద్‌ అతని బృందం ఇప్పుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు చేసే పనిలో ఉంది.

తరువాత నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్‌ ‌కమిషనర్‌, ‌కలెక్టర్‌ ఇతర సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులను కూడా వారు ఇప్పటికే పొందారు. ఈ ప్లాంట్‌ ‌కర్నూలు, నెల్లూరు  పొరుగు గ్రామాలలో ఉన్న వేలాది మంది కోవిడ్‌ ‌బాధితులకు ఆక్సిజన్‌ అం‌దించనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.‌రామ్‌సుందర్‌ ‌రెడ్డి  మాట్లాడుతూ.. సోనూసూద్‌ ‌మానవత్వ ఆలోచనలకు మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ ‌ప్రతిరోజూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 150 నుండి 200 మంది కోవిడ్‌ ‌రోగులకు చికిత్స చేయడంలో సహాయపడుతుందని అన్నారు.

ఈ ప్లాంట్స్ ‌గురించి సోనూసూద్‌ ‌మాట్లాడుతూ.. ముఖ్యంగా గ్రాణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఇది చాలా అవసరం.
ఈ ప్లాంట్స్ ‌కోవిడ్‌ -19‌తో ధైర్యంగా పోరాడటానికి అవసరమైన వారికి సహాయపడతాయని నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ ‌తరువాత.. జూన్‌, ‌జూలై మధ్య మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రస్తుతం, మేము వివిధ రాష్ట్రాలనిరుపేద ఆసుపత్రులను గుర్తించామని తెలియజేశారు.

Leave a Reply