రాంపూర్‌లో కుడా ఆధ్వర్యంలో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఆక్సిజన్ పార్కును రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభి వృద్ధి ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఈనెల 17న శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో కుడా మున్సిపల్ అర్అండ్బి అధికారులతో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఏర్పాట్లను పరిశీలించారు. ఆక్సిజన్ పార్కుతో పాటుగా మరి కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనునందున పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తునందున చుట్టూ ప్రక్కల మోరం పోసి పటిష్ట పర్చాలనిఅర్అండ్బి రోడ్డు నుండి సరిహ ద్దు వరకు గుంతలను నింపి చదను చేయాల న్నారు. మడికొండ వరకు రోడ్డు కు ఇరువైపుల ఉన్న ముళ్ళ పొదలను, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శంకుస్థాపన సంద ర్భంగా వాహనాల ఎక్కువ వచ్చే నేపథ్యంలో ప్రత్యేకంగా వాహనాల కోసం స్థలం గుర్తించి చదను చేయాలన్నారు. అనంతరం కాజీపేట జూబ్లీ మార్కెట్ ప్రాంతంలో 100 రెండు పడకల గదుల నిర్మాణం చేసే ప్రదేశాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి కలెక్టర్ స్థలాన్ని పరిశీలించారు.
స్థలంలో నిర్మించే సర్వే నంబర్లో మొత్తం విస్తీర్ణం ఎంతో గుర్తించి మార్కు చేయలని కలెక్టర్ ఆర్డీవోకు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజ కవర్గంలో గతంలో మంజూరైన రెండు పడకల గదులకు మంజూరైన గృహాల్లో 100 గృహాలను నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ కోరిక మేరకు ఈ స్థలాన్ని గుర్తించామన్నారు. ఈ గృహాలు అర్అండ్బి శాఖ ద్వారా చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఖాజీపేట లో మార్కెట్ కోసం నిర్మించిన భవనాలను సోమవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. రోడ్డుపై అమ్మకాలు చేయకుండా మార్కెట్ ప్రదేశాల్లో అమ్ముకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిడబ్ల్యుఎంసి కమిషనర్ పమేలా సత్పతి, అర్అండ్బి ఎస్సి, ఆర్డీవో వెంకరెడ్డి, ఇఇ రాజం, కుడా పిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, మునిసిపాలిటీ ఎస్సి భాస్కర్ రెడ్డి, ఏంహెచ్ఓ రాజీరెడ్డి ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు శ్రీనివాస్ రావు, ఖాజీపేట ఇంఛార్జి తహశీల్దార్ కిరణ్ ప్రకాష్, గ్రౌండ్ వాటర్ డిడి రాజారెడ్డి, ఏసిపి రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.