Take a fresh look at your lifestyle.

ఆందోళనలో తెలంగాణ వాదులు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేది దగ్గర పడుతున్నది. 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 11న పోలింగ్‌ జరగనున్నది. తొమ్మిది నెలల సమయం ఉన్నా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోయిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నది. శుక్రవారం అర్ధ రాత్రి తరువాత కాంగ్రెస్‌, తెలుగు దేశం, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ, తెలంగాణ జన సమితిల ప్రజా కూటమి చర్చలు, సీట్ల సర్దుబాటు ఒక కొలికొచ్చినట్లుగా కనిపిస్తున్నది. ఈ సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ వాదులను అయోమయానికి గురి చేస్తున్నాయి. కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీలు రాజకీయ సిద్ధాంతపరంగా రెండు భిన్న ధవాలు. అవి రెండు ఒకటయినాయి. తెలంగాణ ఉద్యమ బ్రాండ్‌ అంబాసిడర్‌లలో ముందు వరుసలో నిలిచే ప్రొఫెసర్‌ కోదండరాం వారితో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. తెలంగాణా స్వీయ రాజకీయ అస్థిత్వాన్ని ఆకాంక్షిస్తూ కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో తొలిసారి అధికారం కట్టబెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వాదులను, ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. చోటు చేసుకుంటున్న పరిణామాలు కొంత ఆందోళనకు గురి చేస్తున్నప్పటికీ…కూటమికి అండగా నిలబడాల్సిన ఒక రాజకీయ అనివార్యతను తెరాస సష్టించింది. తెలంగాణ వ్యతిరేకులతో కలిసి నాలుగు సంవత్సరాలు అధికారం నడిపిన తెరాసపై తెలంగాణ వాదులు, ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వందలాది విద్యార్థి, యువతీయువకుల బలిదానాలతో, సకల జనుల పోరాటంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వారికి సముచితమయిన స్థానం, హక్కు లభించలేదని వారి ఆగ్రహం ..! కొందరు సీమాంధ్ర పెట్టుబడి దారుల చేతుల్లో ప్రభుత్వం కీలు బొమ్మయిందని వారి ఆందోళన ..!

ప్రజా కూటమికి మద్దతుగా నిలబడనున్న తెలంగాణ వాదులు శుక్రవారం చోటు చేసుకున్న పరిణామంతో కొంత అయోమయానికి గురవుతున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి సమైక్య వాది.. అనివార్య పరిస్థితుల్లో బలవంతంగా రాష్ట్ర విభజను అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన బావ మరిది, రాజ్యసభ సభ్యుడు..ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికష్ణ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వం హరికష్ణ మరణానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహా ప్రస్థానంలో, ఆయన స్మ తిలో 400 గజాల స్థలాన్ని కేటాయించింది. అదే హరికష్ణ కూతురు సుహాసిని ఈ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. హరి కష్ణ స్మ తిలో స్థలాన్ని కేటాయించిన, అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదులు.. కూటమి అభ్యర్థిగా ఆయన కూతురు సుహాసినికి ఎట్లా మద్దతు తెలుపాలె ..? తెలంగాణ ప్రజల సేవ కోసం వాళ్ళ ఆడబిడ్డగా రాజకీయాల్లోకి వొచ్చిన అంటున్న ఆమెను ఎట్లా ఆదరించాలె..? తెలంగాణ వాదుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ..!

తెలంగాణ వ్యతిరేకి తలసాని శ్రీనివాస్‌ను పార్టీల తీసుకుని.. మంత్రి పదవి కట్టబెట్టిన సమయం నుంచి తెలంగాణ ఉద్యమ కారులపై మంత్రిగా లాఠీతో దౌర్జన్యం చేసిన దానం నాగేందర్‌ను శుక్రవారం ఖైరతాబాద్‌ అభ్యర్థిగా ప్రకటించే సమయం వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను, విద్యార్థి అమరవీరులను అనేక సందర్భాల్లో అవమానాలకు గురి చేసింది. ముల్లును ముల్లు తోనే తీయాలి.. అందుకే స్వీయ రాజకీయ అస్థిత్వాన్ని ఆకాంక్షిస్తున్న తెలంగాణ వాదులు కొత్త తరహా రాజకీయాలకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన తెలుగు దేశం పార్టీ…ఎన్ని అడ్డంకులు ఎదురయినా రాష్ట్ర విభజనకు సహకరించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కాంగ్రెస్‌ పార్టీతో కలిసి.. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసిన తెలంగాణ రాష్ట్ర సమితిని అధికారంలో నుంచి దించడానికి ఏకమవుతున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోడానికి సిద్ధంగా, లేని అధికారమే లక్ష్యంగా ముందస్తు ఎన్నికల్లో దిగిన తెలంగాణ రాష్ట్ర సమితికి తగిన గుణ పాఠం తప్పదంటున్నారు తెలంగాణ వాదులు..! 1969 నాటి ఉద్యమంలో 350కి పైగా విద్యార్థులు చేసిన త్యాగాన్ని, ఆ త్యాగాన్ని 350 మెట్లుగా చేసుకుని రాజకీయ లబ్ది పొందిన నాయకులను ప్రజలు మరచి పోలేదు. మలి దశ ఉద్యమంలో 2009 ప్రకటన తరువాత వెయ్యిపైగా విద్యార్థి, యువతీయువకుల బలిదానాలను మరచి పోలేదు..! మరోసారి రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోడానికి సిద్ధంగా లేరు. స్వీయ రాజకీయ అస్తిత్వం వైపుగా అడుగులు పడుతున్నాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy