Take a fresh look at your lifestyle.

అసెంబ్లీలో జానారెడ్డి వాయిస్‌ ‌వినిపించాలి

కాంగ్రెస్‌  రాష్ట్ర ఇంచార్జ్ ‌మణిక•ం టాగూర్‌
‌నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి గెలుపు తథ్యమని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇన్చార్జ్ ‌మాణికం టాగూర్‌ అన్నారు. గురువారం ఆయన పొన్నం ప్రభాకర్‌ ‌తదితరులతో కలసి వి•డియాతో మాట్లాడుతూ..సాగర్‌లో సీఎం కేసీఆర్‌, ‌పోలీస్‌, ‌మనీ, లిక్కర్‌ ‌పవర్‌ను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. వాటిని నియంత్రించడంలోఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల పక్షాన జానారెడ్డి వాయిస్‌ అసెంబ్లీలో ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జానారెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపు ఇచ్చారు. మానవతా రాయ్‌ని పోలీస్‌లు అరెస్ట్ ‌చేసి హింసించడాన్ని ఖండిస్తున్నామన్నారు. పోలీసులు ముఖ్యమంత్రికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌మందు, డబ్బు పంచినా సాగర్‌లో గెలుపు మాత్రం కాంగ్రెస్‌దేనన్నారు. దుబ్బాకలో బీజేపీ విజయం నీటి బుడగ లాంటిదని తేలిపోయిందన్నారు. 2018లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని, సాగర్‌లో కూడా  బీజేపీకి అదే రిపీట్‌ అవుతుందని మాణికం టాగూర్‌ ‌వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని మాణికం టాగూర్‌ అన్నారు. పీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేటీఆర్‌ ‌బ్యాంక్‌ ‌బ్యాలన్స్, ‌కవిత నగల పెరుగుదల కాదని విమర్శించారు. తమిళనాడులో ఎన్నికల కారణంగా తాను సాగర్‌లో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు నాగార్జున సాగర్‌ ‌బలమున్న నియోజక వర్గమని, సాగర్‌కు దుబ్బాక చాలా వ్యత్యాసం ఉందని మాణికం టాగూర్‌ అన్నారు.

Leave a Reply