Take a fresh look at your lifestyle.

అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?

జగిత్యాలో గృహానిర్బందంలో ఉన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎస్పారెస్పి భూనిర్వాసితులకు పరిహారం ఇప్పించాలని ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి :ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం తలెత్తుతోందని, పోలీసులతో నిర్బందాలను సృష్టిస్తు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేస్తోందని పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇచ్చిన మంజీరానది జలదీక్షను పురస్కరించు కొని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధులను పోలీసులు గృహానిర్బందాలకు పరిమితం చేశారు. ఈకోణంలోనే జగిత్యాలలోని అశోక్‌నగర్‌లో గల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నివాసానికి వచ్చిన జగిత్యాల సిఐ జయేశ్‌రెడ్డితో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. తన అరెస్ట్‌కు కారణమేంటని పోలీసులను ప్రశ్నించారు. ఈసందర్బంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ నేటి రాష్ట్ర పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగై పోలీసుల పాలనకు తెరలేచిందన్నారు. శాంతియుతంగా ఏ కార్యక్రమాన్ని చేపడతామని ప్రతిపక్షాలు పిలుపునిచ్చి నా అధికారపార్టీ తన పోలీసు బలగాలతో అణచివేతకు గురిచేస్తోందన్నారు.

ప్రభుత్వ దమననీతిని ప్రజలు గమనిస్తున్నారని రోబోవు కాలంలో ప్రజలే గుణపాఠం చెప్తారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వెంట బండశంకర్‌, ‌గాజుల రాజేందర్‌, ‌కల్లెపు దుర్గయ్య, దేవేందర్‌రెడ్డి, విజయలక్ష్మి, చిట్ల అంజ న్న, గంగం మహేష్‌ ‌బాసప్రకాశ్‌, ‌పలువురు ఉన్నారు.భూనిర్వాసితులకు పరిహారం ఇప్పించండి : అర్డివోను కోరిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజేక్టు జలాలను రైతులకు అందించాలన్న )క్ష్యంతో గంగాధర-మల్యాల మండలాల్లో లింక్‌ ‌కెనాల్‌ ‌కోసం తీసుకొన్న భూములకు చెందిన పరిహారం చెల్లించలేక లింక్‌ ‌కెనాల్‌ ‌నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయక రైతులకు నష్టం కలుగుతోందని తక్షణమే పరిహారం 8 కోట్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గురువారం అర్డివో నరేందర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. కాళేశ్వరం ప్రాజేక్టు జలాలనఎస్పారెస్పి వరదకాలువలోకి చేర్చి డి73- డి94 ద్వారా గంగాధర మండలం ర్యాలపల్లి, మల్యాల మండలం లంబాడిపల్లె వద్ద లింక్‌ ‌కెనాల్‌ ‌నిర్మించేందు కు రెండున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు గాను ఈ రెండు మండలాల్లోని రైతుల నుంచి 56 ఎకరాలను తీసుకోవడం జరిగిందన్నారు. ఇలా తీసుకొన్న భూములలో 30 కోట్ల రూపాయల వ్యయంతో పనులను చేపట్టినా గత ఆరు నెలల నుంచి రైతులకు రావాల్సిన రూ.8 కోట్ల నష్టపరిహరం చెల్లించలేకపో యారన్నారు. తక్షణమే ఈ పరిహారాన్ని ఇప్పించి లింక్‌ ‌కాలువ పనులను చేపట్టి రైతాంగానికి నీరందించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమములో మాజి మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌గిరి నాగభూషణం, కొత్తమోహన్‌, ‌దేవేందర్‌రెడ్డి, బండశంకర్‌, ‌గాజుల రాజేందర్‌, ‌గంగం మహేష్‌తోపాటు పలువురు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!