వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అసమగ్రంగా జాతీయ విద్యా విధానం ముసాయిదా

August 27, 2019

విద్యారంగానికి పెట్టుబడుల సేకరణ విషయంలో ఈ కమిటీ చేసిన సిఫార్సులు ఆచరణాత్మకంగా లేవు. ఈ కమిటీ విద్యారంగాన్నీ, ఆర్థిక రంగాన్నీ లింక్‌ ‌చేయాలన్న ఉద్దేశ్యంతో లేదేమోననిపిస్తోంది. అంతేకాక, కమిటీ సిఫార్సుల ప్రకారం నిధుల సేకరణ పద్ధతులు ఆచరణాత్మకంగా లేవు. పెట్టుబడుల విషయాన్ని ప్రత్యేక అనుబంధంలో పేర్కొనవచ్చు. అందుకే ముసాయిదా విద్యావిధానంలో దానికి సంబంధించిన వివరాలు పెద్దగా లేవు. పేర్కొన్న విషయాలు ఊహాజనితంగా ఉన్నాయి.జాతీయ విద్యా విధానం ముసాయిదాలో విద్యారంగంపై పెట్టుబడులకు సంబంధించిన సూచనలను లోతుగా పరిశీలించాల్సి ఉంది. ఈ ముసాయిదాను రూపొందించిన కమిటీ విద్యా విధానానికి, ఆర్థిక విధానికీ సక్రమంగా అనుసంధానం చేయలేదనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ మ్యానిఫెస్టోలో మారుతున్న పరిస్థితులకు అనుగుణమైన విద్యావిధానాన్ని తీసుకుని వస్తానని వాగ్దానం చేసింది. ఐదేళ్ళ తర్వాత ఈ ఏడాది జూన్‌ ఒకటవ తేదీన డాక్టర్‌ ‌కస్తూరి రంగన్‌ ‌నేతృత్వంలోని కమిటీ కొత్త విద్యావిధానంపై ముసాయిదాను కేంద్ర మానవ వనరుల శాఖకు సమర్పించింది. జాతీయ విద్యావిధానమపై ఎప్పుడో 1986లో నివేదిక ప్రభుత్వానికి అందింది. ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి కొత్త నివేదిక అందిన దృష్ట్యా దీని ప్రాధాన్యత ఉంది. 1986 నాటి విద్యావిధానం నివేదికలో 1992లో మార్పులు చేశారు. ఇప్పుడు కస్తూరి రంగన్‌ ‌కమిటీ సమర్పించిన నివేదిక ప్రభావం దేశంలో 50 శాతం ప్రజలపై ఉంటుంది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ కస్తూరి రంగన్‌ ‌కమిటీ సిఫార్సులు చేసింది. విద్యారంగానికి పెట్టుబడుల గురించి ప్రధానంగా ప్రస్తావించింది. ఇందుకు రెండు ప్రధాన సూత్రాలను సూచించింది. మొదటిది ఏమిటంటే, విద్యారంగానికి పెట్టుబడులను వ్యయంగా పరిగణించకూడదు. భావితరాలను తీర్చిదిద్దడానికి దానిని పెట్టుబడిగా భావించాలి. విద్యా రంగానికి సంబంధించి అన్ని అంశాలనూ ప్రక్షాళన చేయాలని ముసాయిదాలో కమిటీ సూచించింది.
ఇంతకుముందు ముసాయిదా నివేదికల మాదిరిగా కాకుండా 2019 ముసాయిదా విద్యా విధానంలో పెట్టుబడులపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. 2016నాటి విద్యా విధానం ముసాయిదా నివేదిక, టిఎస్‌ఆర్‌ ‌సుబ్రహ్మణ్యం కమిటీ సమర్పించిన విధానంలో కన్నా ఈ కొత్త విధానంలో విద్యా రంగం పెట్టుబడుల గురించి స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది అలాగే, విద్యా రంగంపై పెట్టుబడులను లాభాల దృష్టితో చూడరాదని కూడా కస్తూరి రంగన్‌ ‌కమిటీ సూచించింది. విద్యారంగంలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముసాయిదాలో పేర్కొనడం జరిగింది. పెట్టుబడుల్లో అత్యధిక భాగం ప్రభుత్వం నుంచే ఉండాలని కూడా సూచించింది. విద్యారంగం అదనంగా నిధులు సమకూర్చుకోవల్సిన అవసరం కూడా ఉందని పేర్కొంది. విద్యారంగంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పెట్టుబడులు పదేళ్ళ వ్యవధిలో 10 నుంచి 20 శాతం పెరగాలని సూచించింది. గడిచిన ఐదేళ్ళలో విద్యారంగంలో పెట్టుబడులు స్థూల జాతీయోత్పత్తి(జిడిపి)లో 3 శాతమే. నిబంధన ప్రకారం జిడీపిలో ఆరు శాతం ఉండాలి. 2012-2016-17 మధ్య కాలంలో జిడిపి 5.5 శాతం నుంచి 7.2 శాతానికి పెరిగింది. పన్ను- జిడిపి నిష్పత్తి 17.26 శాతం నుంచి 17.82 శాతానికి పెరిగింది. మొత్తం మీద ప్రభుత్వ వ్యయం జిడిపిలో 27.1 శాతానికి పెరిగింది. రాష్ట్రాల్లో విద్యారంగంపై వ్యయం మంచి బెంచ్‌ ‌మార్క్ అని చెప్పలేం. ప్రభుత్వం ఆదాయం పన్నుపై 3 శాతం సెస్‌ను వసూలు చేస్తోంది. ఇందులో 2 శాతాన్ని విద్యారంగానికి మురుగు కాని నిధిగా కేటాయిస్తోంది, ప్రారంభింక్‌ ‌శిక్షా కోష్‌ ‌పేరిట ప్రాథమిక విద్యకు 2 శాతాన్ని, సెకండరీ విద్యకు ఒక శాతాన్ని కేటాయిస్తోంది. అయితే, కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా(కాగ్‌) ‌సెస్‌ ఆదాయాన్ని అసమర్థంగా ఖర్చు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. దాంతో 2017-18లో విద్యా సెస్‌ ‌ద్వారా వచ్చిన 1,977 కోట్లను శిక్షా కోష్‌కి బదిలీ చేయలేదు. సెకండరీ, ఉన్నత విద్యా సెస్‌ ‌కింద 2007 నుంచి 94,036 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది. ఈ నిధిని బదిలీ చేయకుండా, ప్రత్యేక నిధిగా ఏర్పాటు చేసింది.
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు ఆదాయం బదిలీని పరిగణనలోకి తీసుకుని విద్యారంగానికి పెట్టుబడులు పెట్టే బాధ్యతను రాష్ట్రాలకు బదిలీ చేసింది. విద్యారంగంలో కార్పొరేట్‌ ‌సోషల్‌ ‌రెస్పాన్స్ ‌బులిటీ(సిఎస్‌ఆర్‌) ‌గడిచిన ఐదు సంవత్సరాల్లో పెరిగింది. అయితే, ప్రభుత్వ రంగ సంస్థలు నిలకడగా ఉండటం లేనందున ఆ సంస్థల నుంచి నిదులు గ్యారంటీగా వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ప్రైవేట్‌ ‌రంగానికి తరలి పోతున్న సంగతి తెలిసిందే. విద్యారంగానికి విరాళాలు ఇచ్చే వారికి పన్నుల్లో రాయితీలు ఇవ్వాలని కమిటీ సూచించింది. దాని వల్ల సామాజిక బాధ్యత మరింత పెరుగుతుందని కమిటీ పేర్కొంది.
విద్యారంగానికి పెట్టుబడుల సేకరణ విషయంలో ఈ కమిటీ చేసిన సిఫార్సులు ఆచరణాత్మకంగా లేవు. ఈ కమిటీ విద్యారంగాన్నీ, ఆర్థిక రంగాన్నీ లింక్‌ ‌చేయాలన్న ఉద్దేశ్యంతో లేదేమోననిపిస్తోంది. అంతేకాక, కమిటీ సిఫార్సుల ప్రకారం నిధుల సేకరణ పద్ధతులు ఆచరణాత్మకంగా లేవు. పెట్టుబడుల విషయాన్ని ప్రత్యేక అనుబంధంలో పేర్కొనవచ్చు. అందుకే ముసాయిదా విద్యావిధానంలో దానికి సంబంధించిన వివరాలు పెద్దగా లేవు. పేర్కొన్న విషయాలు ఊహాజనితంగా ఉన్నాయి.

– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో.