Take a fresh look at your lifestyle.

అవినీతి పాలనను అంతమొందిస్తాం

  • యూరియా కొరతను సృష్టించి..
  •  కేంద్రం, బీజేపీ ఎంపీలపై నిందలా?
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా।। లక్ష్మణ్‌

కేసీఆర్‌ అవినీతి, కుటుంబ పాలనను ప్రజల్లో ఎండగట్టి అంతమొందిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. తెదేపా సీనియర్‌ ‌నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌నేత రవీంద్రనాయక్‌లు బీజేపీలో చేరిన సందర్భంగా లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వర్షాలు కురవడంతో పంటలకు వేసేందుకు యూరియాకోసం సహకార సొసైటీలు, అగ్రికల్చర్‌ ‌కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే యూరియా కొరతను సృష్టించి.. కేంద్రం, బీజేపీ ఎంపీలపై నిందలు వేస్తోందని లక్ష్మణ్‌ ‌మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంటే


టీఆర్‌ఎస్‌ ‌జీర్ణించుకోలేకపోతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ లభించడంలేదన్నారు. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, కేసీఆర్‌ అవినీతిపై పోరాటం చేసి ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు. కేసీఆర్‌ అవినీతి, కుటుంబపాలనను అంతమొందిస్తామని లక్ష్మణ్‌ ‌స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నాం కాబట్టే.. బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయని లక్ష్మణ్‌ అన్నారు. కేసీఆర్‌ ఇప్పటికైన ఫామ్‌ ‌హౌస్‌ను వదిలి ప్రజల్లోకి రావాలని, రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని లక్ష్మణ్‌ ‌సూచించారు.

Leave a Reply

error: Content is protected !!