Take a fresh look at your lifestyle.

అవినీతి… అలసత్వం…మధ్య ‘పుర’పోరు.. ‘గులాబిం’చేనా..?

పట్టు కోసం కాంగ్రెస్‌, ‌బిజెపి కసరత్తు- పరిషత్‌ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయా?
గ్రామీణ, పట్టణ వోటర్ల నాడికి ఎంతో వ్యత్యాసం – పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందా?

: రాష్ట్రవ్యాప్తంగా పురపోరుకు కసరత్తు ముమ్మరంగా జరగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల షాక్‌ ‌నుంచి తేరుకున్న అధికార గులాబీపార్టీకి పరిషత్‌ ఎన్నికల ఫలితాలు ఊరటనిచ్చాయి. ప్రల మూడ్‌ ‌మార••ముందే పురపాలక సంఘం ఎన్నికలు పూర్తి చేయాలని సిఎం కెసిఆర్‌ ఎన్నికలకు పచ్చజెండా ఊపారు. దీంతో రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్‌లకు, 131 మున్సిపాలిటీలకు ఎన్నికల వేడి రాజుకుంది. 2014లో బంగారు తెలంగాణ నిర్మాణ క్రమంలో మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పిన గులాబీ నేతల మాటలు నమ్మిన పట్టణాల ప్రజలు 90శాతం మున్సిపాలిటీలను టిఆర్‌ఎస్‌ ‌ఖాతలో వేసారు. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో పురపాలికల్లో అవినీతి పెచ్చరిల్లింది. దీంతో పట్టణాల ప్రజలు అధికార పార్టీ నేతలపై ఆగ్రహంతో ఉన్నారనేది అక్షరసత్యం. ముఖ్యంగా కార్యాలయాల్లో అధికారులు ప్రతిపనికి ఓ రేటు చొప్పున పట్టణ ప్రజలను పీ•ల్చిపిప్పి చెశారనే విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్మన్‌లతో చేతులు కలిపి అభివృద్ధి పనుల్లో అడ్డగోలుగా వ్యవహరించి నాసిరకం పనులతో పట్టణ ప్రజలకు అసంతృప్తి మిగిల్చారనె విమర్శలున్నాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్ధితి నెలకొంది. కూరగాయలు, చేపల, మాంస మార్కెట్‌లు, జంక్షను్ల అభివృద్ధికి నోచుకోక ప్రతి రోజు పట్టణ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. పట్టణ ఓటర్లు గడిచిన పార్లమెం• ఎన్నికల్లో అధికార పార్టీకి షాకిచ్చారు. 2014లో కరీంనగ•ర్‌, ‌రామగుండం, నిజమాబాద్‌, ‌కార్పొరేషన్లకు టిఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకుంది. కానీ గడిచిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎం‌పి అభ్యర్ధి వినోద్‌కుమార్‌, ‌నిజమాద్‌ ఎం‌పి అభ్యర్ధి కల్వకుంట్లు కవిత ఓటమి పాలయ్యారు. కార్పోరేషన్లను తమ ఆధీనంలో ఉంచుకొని ఎంపి సీ•ట్లను కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. టిఆర్‌ఎస్‌లో కీలక నేతలు ఓటమి కావడంతో అధికార పార్టీ అంతర్మధనంలో పడింది. ఈ సెగ్మంట్‌లోని మున్సిపాలిటీలపై ఓటమి ప్రభావం పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది.
స్థానిక ఎమ్మెల్యేలు కూడా కుల సమీకరణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ రెండు సెగ్మెంట్లు చేజారామనే ప్రచారం బలంగా వినపడుతుంది. ఇందుకు ఉదాహరణ కరీంనగర్‌ ఎం‌పి సెగ్మంట్‌లో బిజెపి అభ్యర్ధి ప్రస్తుత ఎంపి స్థానిక ఎమ్మెల్యే ఒకే సామాజికవర్గం కావడం గమనార్హం. పైగా మాజీ ఎంపి వినోద్‌కుమార్‌ ఓటమికి కుల సమీకరణాలు కూడా ఒక ప్రధాన కారణం. పైగా మాజీ ఎంపి వినోద్‌ ‌వల్ల స్ధానిక ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా పోతుందని అనేక సందర్భాల్లో తమ అనుంగుల వద్ద వాపోయినట్లు సమాచారం. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో అంటిముట్టనట్లు వ్యవరించి తమ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారనే అరోపణలు ఉన్నాయి. నిజామాబాద్‌ ఎం‌పి సెగ్మంట్‌లో కూడా మున్సిపాలిటీలు టిఆర్‌ఎస్‌ ఆధీనంలోనె ఉన్నాయి. కానీ ఎంపి అభ్యర్థి కవిత ఓటమి చెందడం కలకలం రేపింది. ఇందుకు పట్టణాల ఓటరులు సహకరించకపోవడం కూడా ఒక కారణం. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ విభాగాల్లో నెలల తరబడి నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో పట్టణాల పరిధిలోని మిల్లర్లు, హమాలీలు ఆశావర్కర్లు అంగన్‌వాడీలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరంతా పట్టణాల ఓటర్లుగా ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 21 నగర పంచాయితీలను అప్‌‌గ్రేడ్‌ ‌చేసింది. వీటిలో టిఆర్‌ఎస్‌ ఆధిపత్యం సాధించడం కోసం సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేసింది. వార్డుల విభజన అభ్యంతరాల స్వీకరణ, ఓటర్ల జాబితా బిసి గణన, రిజర్వేషన్ల ఖరారుపై తమకు అనుకూలంగా మార్చకోవడంలో స్ధానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ల్రలోని 131మున్సిపాలిటీలో టిఆర్‌ఎస్‌కు ధీటుగా బిజెపి, కాంగ్రెస్‌లు పావులు కదుపుతున్నాయి. నిజామాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌సెగ్మెంట్‌లోని మున్సిపాలిటీల్లో ఇప్పటికే బిజెపి తన కార్యాచరణ మొదలు పెట్టింది. పసుపుబోర్దు ఆలస్యం, పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరల పెంపు ప్రతీకూలంగా మారే అవకాశం లేకపోలేదు.
కాంగ్రెస్‌ ‌సెలెక్ట్ ఆ ఏలెక్ట్ అనే నినాదంతో అభ్యర్థుల ఎంపిక స్థానిక క్యాడర్‌ అం‌గీకారంతో జరుగుతుందని ప్రకటించింది. గెలుపు అభ్యర్థులను ఎంపికతో మున్సిపల్‌లో సత్తాచాటాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. కరీంనగర్‌ ‌కార్పొరేషన్‌పై బిజెపి గురి పెట్టింది. కాగా మున్సిపల్‌ ‌సీట్లు చేజారితే స్ధానిక టిఆర్‌ఎస్‌ ‌మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎం కెసిఆర్‌ ‌గట్టిగా చెప్పి సభ్యత్వ నమోదుకు పంపారు. నిజామాబాద్‌ ఎం‌పి అరవింద్‌ ‌ధర్మపురి కూడా పట్టుకోసం పావులు కదుపుతున్నారు.
రాష్ట్రంలో 7కార్పొరేషన్లను 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకుంది. మొత్తం 61 మున్సిపాలిటీ టిఆర్‌ఎస్‌ ‌పాగా వేసింది. కానీ అప్పటి పరిస్ధితులు ప్రస్తుతం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. 5సంవత్సరాల కాలంలో టిఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరిగిందనే చెప్పవచ్చు. మంత్రి కెటిఆర్‌, ‌మాజీ ఎంపి కవిత, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు ముఖ్యనేతల నియోజకవర్గాల్లోని సిద్ధిపేట మున్సిపాలిటీ మినహా మిగితా వాటిలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడి ఉందనే చర్చసాగుతుంది.
గ్రేటర్‌ ‌చుట్టూ 22 మున్సిపాలిటీలు
గ్రేటర్‌ ‌హైదర్‌రాబాద్‌ ‌చుట్టూ మొత్తం 22 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో 6 మున్సిపాలిటీల్లో పాతవి కాగా కొత్తగా 16 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. వీటిపై టిఆర్‌ఎస్‌, ‌బిజెపి, కాంగ్రెస్‌లు పావులు కదుపుతున్నాయి. పేద్ధంబర్‌పేట, బడంగోపెద, జల్‌పల్లి, మీర్‌పెట్‌, ‌జిల్లెల్లగూడ, బండ్లగూడజాగ్‌, ‌బోడుఉప్పల్‌, ‌ఫిర్జాతిగూడ, జవహర్‌నగర్‌, ‌దమ్మయిగూడ, నాచారం, పోచారం, గుండ్లపోచంపల్లి, నిజాంపేట్‌, ‌కోంపల్లి, దిండీగల్‌, ‌బోల్లారం, తెల్లాపూర్‌, ఆమీన్‌పూర్‌ ఉన్నాయి. ఇక్కడి ప్రజల అభీష్టం మేరకు మున్సిపాలిటీలుగా మార్చడంలో ప్రభుత్యం సహకరించిందని కృతజ్ఞతల్లో టిఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!