Take a fresh look at your lifestyle.

అవసరమైతేనే బయటకు రండి

  • అవసరమైతేనే బయటకు రండి
  • ప్రజలకు సైబరాబాద్‌ ‌సిపి వినతి

కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సైబరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ‌మనందరి మంచికోసమేనని చెప్పారు. ప్రజలు కట్టడిగా ఉంటే త్వరగా కొరోనాకు కళ్లెం వేయవచ్చన్నారు. ఆయన సోమవారం సుచిత్ర, అల్వాల్‌, ‌గోల్నాక క్రాస్‌రోడ్స్, ఆల్విన్‌ ‌కాలనీ, దూలపల్లి క్రాస్‌రోడ్స్ ‌ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కమిషనరేట్‌ ‌పరిధిలో దాదాపు ఐదు వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

ఎస్సీతో కలిసి త్వరలో ఐసోలేషన్‌ ‌వార్డును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాగా, లాక్‌డౌన్‌, ‌రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపు హైకోర్టు సంతృప్తి వ్యక్తంచేసింది. పోలీసుల పనితీరును ప్రశంసించింది. మూడు కమిషనరేట్ల పోలీసుల పనితీరు అభినందనీయమని పేర్కొన్నది. పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించింది.

Leave a Reply