Take a fresh look at your lifestyle.

అర్బన్‌లో మరో రెండు కొరోనా పాజిటివ్‌ ‌కేసులు

వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా పరిధిలో గురువారం మరో రెండు కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె.లలితాదేవి తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత అర్బన్‌లో మూడు పాజిటివ్‌ ‌కేసులు నిర్ధారణ అయిన విషయం విధితమే. తాజాగా మరో రెండు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 5కు చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి. కాజీపేట దర్గా అబ్జల్‌ ‌నగర్‌కు చెందిన 58 సంవత్సరాల వ్యక్తికి ఎంజిఎంలో గురువారం కొరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. హన్మకొండ ఎక్సైజ్‌ ‌కాలనీకి చెందిన 24 సంవత్సరాల వ్యక్తికి కూడా కొరోనా పాజిటివ్‌గా నిర్ధారించినట్లు తెలిపారు. ఆ వ్యక్తి ఇటీవల ఆపరేషన్‌ ‌నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్ళగా కొరోనా అనుమానిత లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి తరలించి కొరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారించినట్లు తెలిపారు. వీరిద్దరికి సంబంధించి ప్రైమరీ కాటాక్టులను గుర్తించి హోమ్‌ ‌క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపారు. ఎంజిఎం ఆసుపత్రి కొరోనా వార్డులో ప్రస్తుతం ఐదుగురికి చికిత్స అందిస్తున్నట్లు డిఎంహెచ్‌ఓ ‌తెలిపారు.

కానిస్టేబుల్‌కు కొరోనా పాజిటివ్‌
‌ములుగు జిల్లా ఏటూరునాగరం మండలం గొగుపల్లి శివపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌కు కొరోనా నిర్ధారణ అయినట్లు ఎంజిఎం నోడల్‌ అధికారి చంద్రశేఖర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌లో 16వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఇటీవల గ్రామానికి రాగా కొరోనా అనుమానిత లక్షణాలతో ఎంజిఎం ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. గురువారం కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కానిస్టేబుల్‌ ‌కుటుంబ సభ్యులను ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి హోమ్‌ ‌క్వారంటైన్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply