Take a fresh look at your lifestyle.

అయ్య ఇచ్చిన పదవితో.. కేటీఆర్‌ ‌విర్రవీగుతున్నడు

హుజూర్‌నగర్‌లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి
గెలుపు దయితే.. కాంగ్రెస్‌ ‌నేతలను ఎందుకుకొంటున్నారు?
ప్రభుత్వం మా ఫోన్లను ట్యాప్‌ ‌చేస్తుంది
కేంద్ర బలగాలతో పోలింగ్‌ ‌నిర్వహించాలి
: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డిహుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీదే విజయమని, దానిని ఎవరూ అడ్డుకోలేరని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై, కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ ఓ ‌బచ్చా అని, అయ్య ఇచ్చిన పదవితో విర్ర వీగుతున్నారని ధ్వజమెత్తారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌దే గెలుపంటున్న కేటీఆర్‌.. ‌కాంగ్రెస్‌ ‌నేతలను ఎందుకు కొంటున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. టీఆర్‌ఎస్‌పై ప్రజలు విసిగిచెంది ఉన్నారని, ఈ ఉప ఎన్నికల్లో అది రుజువుకాబోతుందని అన్నారు. ఓటమి నుండి బయటపడేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉప ఎన్నికల్లో గెలవాలని కేటీఆర్‌ ‌చూస్తున్నారని విమర్శించారు. హుజూర్‌నగర్‌లో ఏం అభివృద్ధి చేశారని టీఆర్‌ఎస్‌ ఓట్లు అడుగుతుందని కేటీఆర్‌ ‌చెప్పాలని కోరారు. కేసీఆర్‌ ‌కుటుంబం రాష్టాన్న్రి దోచుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం మా ఫోన్లను ట్యాప్‌ ‌చేస్తోందని విమర్శించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పే ఎన్నికగా అభివర్ణించారు. మండలి చైర్మన్‌ ‌గుత్తా అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని కాంగ్రెస్‌ ‌నేతలతో బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు. మండలి చైర్మన్‌ ‌గుత్తాపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారం, డబ్బు, మద్యంతో టీఆర్‌ఎస్‌ ‌ప్రలోభాలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర బలగాలతో పోలింగ్‌ ‌నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉత్తమ్‌ అన్నారు. ఇచ్చిన ఏఒక్క హాని పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా కేసీఆర్‌, ‌కేటీఆర్‌లు మాటలగారడితో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికల తరువాత కేసీఆర్‌ ‌నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ ‌గెలవాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని, హుజూర్‌నగర్‌ ‌నియోజకవర్గ ప్రజలంతా కాంగ్రెస్‌ ‌వైపే ఉన్నారని అన్నారు. రాష్టాన్న్రి బ్రష్టుపట్టిస్తున్న టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి హుజూర్‌నగర్‌ ఎన్నికలు గుణపాఠం కాబోతున్నాయని ఉత్తమ్‌ అన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy