Take a fresh look at your lifestyle.

అయోధ్యపై సుప్రీమ్‌కోర్టు తీర్పు మన దేశం భవిష్యత్‌ను తెలియజేస్తోంది

ఇప్పుడు రాజకీయాలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. దేశంలో జాతీయ స్థాయి ప్రసార మాధ్యమాల్లో అత్యధికం పేర్కొంటున్నట్టు ఆఖరిది కాదు. సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకుని సంఘ్‌ ‌పరివార్‌ ‌నాయకులు మూక న్యాయాన్ని రుద్దుతారు. గత ఆగస్టులో బీజేపీ నాయకులు ఏవిధంగా అయితే, రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దుపై పండుగ చేసుకున్నారో అదే విధంగా ఇప్పుడు తమ వాదమే నెగ్గిందని ఊరూవాడా ఏకమయ్యేట్టు ప్రచారం చేస్తారు. న్యాయాన్ని కోర్టు తీర్పుతోనే సమాధి చేయవచ్చనుకుంటారు.సుప్రీమ్‌కోర్టు తీర్పు వల్ల ప్రయోజనం పొందబోయేవారు 27 ఏళ్ళ క్రితం అయోధ్యలో మసీదును కూలగొట్టిన వారే. ఇది మన దేశానికి ఏమాత్రం మంచిది కాదు. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రిపబ్లిక్‌ ‌భవిష్యత్‌ ‌కు సంకేతంగా ఉంది.
వివాదాస్పద ప్రదేశంగా పేర్కొంటున్న 2.77 ఎకరాలు కాదు ఇక్కడి సమస్య,అంతకన్నా ఎక్కువ ఉంది. కూలగొట్టిన మసీదు 470 సంవత్సరాల క్రితం నాటిది అది రాజకీయ పరమై విధ్వంసానికి చిహ్నం అది. అది భారత దేశానికి ఏమాత్రం మంచిది కాదు.
ఈ కేసును సుప్రీంకోర్టు విశ్వహిందూ పరిషత్‌ ‌కు అనుకూలంగా పరిష్కరించింది. అయితే,ఈ వివాదంలో కేవలం భూమి ఒక్కటే కాదు సమస్య. ఆదునిక కాలంలో దేనితోనూ పోల్చలేని రాజకీయ విధ్వంసం ఇది.
మసీదులో రాముని విగ్రహాలను ఏ విధంగా ప్రతిష్ఠాపన చేశారో 1992 లో మసీదు చట్టానికి విరుద్ధంగా ఏవిధంగా కూల్చివేయబడిందో కోర్టు గుర్తించింది. అయితే, చట్టానికి విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తించారో వారికే ఆ భూమి చెందబోతున్నది. ఈ స్థలం ఒక ట్రస్టు యాజమాన్యం కిందికి వస్తుంది. ఆ ట్రస్టు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాదు. ఈ స్థలం యాజమాన్యాన్ని చేపట్టే వారిలో మసీదు కూల్చివేత కు కుట్ర పన్నినట్టు అభియోగానికి గురి అయినవారూ, తమకు వ్యతిరేకంగా చార్జి షీట్‌ ‌దాఖలు చేయబడినవారూ ఉన్నారు.
పాతిక సంవత్సరాల పాటు అయోధ్య అంశం దేశంలో రాజకీయ ప్రతీకారానికి ఒక ఉపమానంగా నిలిచింది. చట్ట విరుద్ధ చర్యకు ప్రతీకగా నిలిచింది. మెజారిటీ వర్గీయుల అల్లరి మూకలను రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించిన సంఘటన ఇది. ఈ తరహా రాజకీయాలు భారత రిపబ్లిక్‌ ‌లో విద్వేషాలను సృష్టించాయి. సమాజంలో వివిధ వర్గాలను నిలువునా చీల్చాయి. దేశంలో మతపరమైన మైనారిటీల్లో అభద్రతా భావాన్ని పెంచింది. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు బలమైనవి అయితే, 1992లో బాబ్రి మసీదు కూల్చివేతతో ఈ రకమైన రాజకీయాలు అంతమై ఉండేవి. ఇప్పుడు రాజకీయాలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. దేశంలో జాతీయ స్థాయి ప్రసార మాధ్యమాల్లో అత్యధికం పేర్కొంటున్నట్టు ఆఖరిది కాదు. సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకుని సంఘ్‌ ‌పరివార్‌ ‌నాయకులు మూక న్యాయాన్ని రుద్దుతారు. గత ఆగస్టులో బీజేపీ నాయకులు ఏవిధంగా అయితే, రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దుపై పండుగ చేసుకున్నారో అదే విధంగా ఇప్పుడు తమ వాదమే నెగ్గిందని ఊరూవాడా ఏకమయ్యేట్టు ప్రచారం చేస్తారు. న్యాయాన్ని కోర్టు తీర్పుతోనే సమాధి చేయవచ్చనుకుంటారు.
సుప్రీంకోర్టు ఒక సివిల్‌ ‌వివాదాన్ని తీర్పు ఇచ్చిందని మనం అనవచ్చు. వాస్తవానికి ఇందులో సివిల్‌ ఏమీ లేదు. ధర్మాసనం కానీ, న్యాయమూర్తులు కాని సివిల్‌ అని అనలేదు. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన కేసుల్లో ఇది ఒకటి అని అన్నారు.
బాబ్రి మసీదు స్థలంపై హక్కు కోసం కోర్టులో కేసులు ఏదో ఒక రూపంలో 1949 నుంచి సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక కోర్టుల్లో విచారణకు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా అయోధ్య పరిధిలోని ఫైజా బాద్‌ ‌కోర్టులో వస్తూనే ఉన్నాయి. 1980లో అద్వానీ గారి రథ యాత్ర వల్ల జాతీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. మాజీ ప్రధానులు రాజీవ్‌ ‌గాంధీ, అటల్‌ ‌బిహారీ వాజ్‌ ‌పేయి అంతా ఇందులో ఉన్నారు. అయితే, ఇందులో విలన్లు ఎవరంటే వీర్‌ ‌బహదూర్‌ ‌సింగ్‌,అరుణ్‌ ‌నెహ్రూ. 1992 డిసెంబర్‌ 6‌వ తేదీన బీజేపీ నాయకులు అక్కడ మసీదును కూల్చివేసేందుకు కుట్ర పన్నారు. ఆనాటి ప్రధానమంత్రి, కాంగ్రెస్‌ ‌నాయకుడు పీవీ నరసింహారావు ఈ నేరం జరగడానికి అవకాశం ఇచ్చారు. 27 ఏళ్ళ తర్వాత కూడా కూల్చివేత కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. అన్ని సాక్ష్యాలను నమోదు చేసినప్పటికీ, వాదోపవాదాలు జరిగినప్పటికీ తీర్పు ఇంకా అనిశ్చితంగానే ఉంది. అందరికీ తెలిసిన విషయం ఏమంటే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఉద్దేశ్య పూర్వకంగానే దీన్ని వదిలేసింది. కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ ఎ ‌బాబ్డే ఇండియా టుడే ఇంటర్వ్యూలో సరైన మాట చెప్పారు. 1949లో ఈ కేసు దాఖలనప్పటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రబుత్వాలు ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ, ఈ కేసు ఇప్పటికి అంటే త్వరగా విచారణ ముగించుకుంది సరిగ్గా అయోధ్య వివాదంలో ప్రధాన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ కేసు ముగింపు జరగడం గమనార్హం. మనం ఇప్పటికే సిటిజన్‌ ‌షిప్‌ ‌చట్టం ముసాయిదాని కలిగి ఉన్నాం. దీని ప్రకారం ముస్లిం శరణార్ధులకు మినహాయింపు ఇవ్వనున్నాం. ఈ చట్టం ప్రకారం ముస్లింలలో పురుషులు తమ బార్యలను వదిలేయాలి. ఇతర మతాల పురుషులకు ఇది వర్తించదు. సరిగ్గా అదే సమయంలో కాశ్మీర్‌ ‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణం రద్దు కావడం కాకతాళీయమే. ఈ అధికరణం రద్దుతో ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, రక్షణలు రద్దు అయ్యాయి.
ఐదుగురు సభ్యులు గల ధర్మాసనం అయోధ్య కేసు పై తీర్పులో ఎటువైపూ మొగ్గకుండా తీర్పు ఇస్తుందని న్యాయశాస్త్ర విశ్లేషకులు అంచనా వేశారు. ఈ తీర్పుతో బాబ్రి మసీదు కూల్చివేసిన ప్రదేశంలోనే మందిరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ మందిర నిర్మాణానికి మార్గం ఇప్పుడు సుగమం అయింది. ఒకబోర్డును ఏర్పాటు చేయమని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు తీర్పునకు ముందు, సున్నీ వక్ఫ్ ‌బోర్డు వాదాన్ని కోర్టు సమర్ధించే అవకాశం ఉందన్న వార్తలు వచ్చినప్పుడు కూడా అక్కడే మందిరాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన లేదు. వాదులపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఆ స్థలాన్ని వదిలివేయాలని. వక్ఫ్ ‌బోర్డు చైర్మన్‌ ‌వివాదాస్పదమైన మధ్యవర్తి ప్రతిపాదనపై సంతకం చేయాల్సి వచ్చింది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీలును ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలుపుతూ ప్రతిపాదనపై సంతకం చేయాల్సి వచ్చింది. విశ్వహిందూ పరిషత్‌ ‌పై అలాంటి ఒత్తిడిరాలేదు. అప్పీలును ఉపసంహంరించుకుంటామన్న ప్రతిపాదనపై సంతకం చేయమని వారిని ఎవరూ బలవంతం చేయలేదు. ఇందుకు బదులుగా సున్నీ వక్ఫ్ ‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. వివాదాస్పద స్థలంలో హిందువులు పూజలు చేసినట్టు ఆధారాలున్నాయన్నది. అలాగే, 1857 ముందు అక్కడ నమాజ్‌ ‌జరిగినట్టు ఆధార పత్రాలు లేవని తేల్చింది. ఇందులో రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ సాంస్కృతిక అజెండా ఉంది. ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం, కేంద్రమూ బహిరంగంగానే ప్రదర్శించాయి. సుప్రీంకోర్టు టైటిల్‌ ‌వివాదాన్ని ప్రాధాన్యంగా తీసుకుంది. మసీదు కూల్చివేతపై క్రిమినల్‌ ‌కేసు భవితవ్యంపై ఏమీ చెప్పలేదు. నమ్మకానికి సంబంధించిన అంశాలను చట్టబద్దం చేసేందుకు కోర్టు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాన్ని జస్టిస్‌ ‌బాబ్డే తోసిపుచ్చారు. అక్కడ ఏ విధమైన కట్టడం ఉంది అనేది సమస్య. ఇప్పుడు అక్కడ కట్టడంఏమీ లేదు. ఈ కట్టడాన్ని కూల్చివేయడంలో భాగస్వాములైన వారే సుప్రీంకోర్టు ద్వారా ప్రయోజనం పొందనున్నారు.

– ‘‌ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!