వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అయోధ్యపై ఐదోరోజూ కొనసాగిన విచారణలు…

August 13, 2019

కూల్చివేత అంశంపై ధర్మాసనం చర్చ
అయోధ్య రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు ఐదో రోజు విచారణ మంగళవారం జరిగింది. వివాద స్థలంలో మొదట రామాలయం ఉండేదా? ఆ తర్వాత దానిపై మసీదు నిర్మించారా? అనే అంశాలపై వాదనలు వినిపించారు. రామ్‌ ‌లల్లా విరాజ్‌మాన్‌ ‌తరపున వాదనలను సీనియర్‌ అడ్వకేట్‌ ‌సీ ఎస్‌ ‌వైద్యనాథన్‌ ‌వినిపించారు. రామాలయంపై మసీదును నిర్మించారా? అనే అంశంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి వాదనలు వినిపించారు. ఈ ధర్మాసనంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌రంజన్‌ ‌గొగోయ్‌, ‌జస్టిస్‌ ఎస్‌ ఏ ‌బాబ్డే, జస్టిస్‌ ‌డీ వై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ అశోక్‌ ‌భూషణ్‌, ‌జస్టిస్‌ ఎస్‌ ఏ ‌నజీర్‌ ఉన్నారు. సీనియర్‌ అడ్వకేట్‌ ‌వైద్యనాథన్‌ ‌మాట్లాడుతూ అలహాబాద్‌ ‌హైకోర్టు తీర్పును ప్రస్తావించారు. వివాద స్థలంలో రామాలయం ఉండేదని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పిందన్నారు. రామాలయం శిథిలాలపై మసీదును నిర్మించారని ఈ త్రిసభ్య ధర్మాసనంలోని జస్టిస్‌ ఎస్‌ ‌యూ ఖాన్‌ ‌చెప్పారన్నారు. రామ్‌ ‌లల్లా విరాజ్‌మాన్‌ ‌తరపున హాజరైన మరొక సీనియర్‌ ‌న్యాయవాది కే పరాశరన్‌ ‌మాట్లాడుతూ సుప్రీంకోర్టు తన సమక్షంలో ఉన్న అన్ని అంశాలపైనా పరిపూర్ణ న్యాయం చేయాలని కోరారు. ••మజన్మభూమి వివాదంపై అలహాబాద్‌ ‌హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. 4 సివిల్‌ ‌దావాలపై విచారణ అనంతరం ఇచ్చిన తీర్పులో 2.77 ఎకరాల స్థలాన్ని ఈ కేసులో పార్టీలైన సున్నీ వక్ఫ్ ‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌ ‌లల్లా విరాజ్‌మాన్‌లకు సమానంగా పంచింది. దీనిపై సుప్రీంకోర్టులో 14 అపీళ్ళు దాఖలయ్యాయి. వీటిపైనే ఈ నెల 6 నుంచి రోజువారీ విచారణ జరుగుతోంది.