Take a fresh look at your lifestyle.

అమ్మ భాషకు వందనం.!

(21 ‌ఫిబ్రవరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా..)

జాతి మనుగడకు అతి ముఖ్యమైనది భాష.ప్రతి జాతి కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి తమ వంతు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.ఈ రోజు జాతి తమ భాషను మననం చేసుకునే శుభతరుణం. జాతి భాషను విస్మరిస్తే అది జాతి అస్తిత్వానికి పెను ప్రమాదంగా మారు తుంది. దైనందిన జీవితంలో ప్రతి వ్యక్తీకరణలో మాతృ భాష చాలా అవసరం.ఏది మాట్లాడాలన్నా, ఏది రాయా లన్నా మాతృభాషను మించినది ఏదీ లేదు.ఎన్ని భాషలు నేర్చినను మాతృ భాషనుకు సాటి రాదు. ఏ రంగంలోనైనా ఏ భాషను నేర్చుకోవాలి అన్నా మాతృ భాషలో ప్రావీణ్యం ఉంటేనే ఇతర భాషలను కూడా సులువుగా నేర్చుకోవచ్చు. ఎన్నో తికమకలు ఉన్న అక్షర పదాలలో సయ్యాటలు ఎన్నో ఉన్నా మాతృ భాషలో ఉన్న మమకారం ముందు అవన్నీ కూడా సులభమే అవుతాయి.
మాతృ భాషను అభివృద్ధి చేయడానికి తమ అభిమా నాన్ని చాటు కోవడానికి ఆసక్తిని పెంపొందించుకోవాలి. పాలనలో తెలుగును చిత్తశుద్ధితో అమలు పరచాలి.పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలు మనకంటే భాషాభిమానాన్ని చాటుకోవడంలో ముందున్నారని చెప్ప వచ్చు.ఎందుకంటే వారు ప్రభుత్వ ఉత్తర్వులు అన్నీ కూడా వారి మాతృ భాషలోనే వెలువరిస్తున్నారు.అధికార భాషా సంఘం ద్వారా గ్రామం దగ్గర నుండి సచివాలయం వరకు అన్నీ కూడా మాతృ భాషలోనే జరగాలి.రోజు రోజుకు కను మరుగవుతున్న మాతృ భాషను కాపాడు కోవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది.మన అమ్మను మనము గౌరవించినట్లు అమ్మ భాషను కూడా గౌరవించుకోవాలి.మన సంస్కృతీ సాంప్రదాయాలు పిల్లలకు, రాబోయే భవిష్యత్‌ ‌తరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ముఖ్య ంగా మొదట చేయవలసిన పని మాతృ భాషను కాపాడటం. తెలుగు భాషకు పట్టం కట్టాలి.ఒక ప్రామాణిక స్థితిని ఏర్పర చుకోవాలి.
విద్య విషయానికి వచ్చినట్లయితే ప్రాథమిక స్థాయిలోని విద్య అంతా కూడా మాతృ భాషలోనే జరగాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో కూడా ఇతర భాషలో కాకు ండా మాతృ భాషలోనే జరగాలి.అప్పుడే విద్యకు సంబం ధించిన పునాది సరిగా ఉంటుంది. మాతృ భాషలో కాకుండా ఇతర భాషల్లో ప్రాథమిక విద్యను నేర్పించినట్లయితే పిల్లలకు సరిగా అర్థం కాక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది.5వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యాబోధన జరగాలని రాజ్యాంగంలో కూడా ఉంది. మాతృ భాషలోనే చదవాలి,రాయాలి, మాట్లాడాలి. అనేది మన అందరి యొక్క హక్కు కాబట్టి ప్రాధమిక విద్య అనేది మాతృ భాషలోనే జరగాలి.ఆక్స్ఫర్డ్ ‌యూనివర్సిటీ వారు చేసిన సర్వేలో కూడా తేటతెల్లం అయిన విషయం ఏమిటంటే ప్రాథమిక విద్యను మాతృ భాషలో చదివిన విద్యార్థులు గణిత, సామాన్య విషయాలలో చాలా చురుకుగా ఉన్నారని చెప్పడం జరి గింది.నేటి యువత మాతృ భాషలో మాట్లాడుతున్నారు కానీ రాయడంలో వారికి నైపుణ్యం లేదని చెప్పవచ్చును. కాబట్టి నేటి పిల్లలను మాతృ భాషలో తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మన భాష మనకు రావడం లేదంటే మనకే అవమానం మనకు మనమే కించపరచకుంటున్నామని అర్థం. మాతృ భాషను నిర్లక్ష్యం చేసినట్లయితే మన ఉనికిని మనం కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మన ఆత్మగౌరవ హానిని మనమే చేసుకోవడం అన్న మాట. మాతృ భాషను కుటుంబం దగ్గర్నుంచే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి• తెలుగులోనే పరిపాలన చేయాలనే నిర్ణయానికి రావడం జరిగింది. కానీ అదీ ఆలస్యం అవుతుంది.తెలుగు భాషకు సంబంధించి సాహిత్య రంగంలో అత్యధిక ప్రాధాన్యం లభిస్తుంది అని చెప్పవచ్చును.‘కాళోజి నారాయణ’ గారి పేరిట భాషా దినో త్సవం, మహాకవి ‘దాశరథి’ గారి పేరు మీదుగా అవార్డులను కూడా ఇస్తున్నారు.అంతే కాకుండా వివిధ ప్రాంతాలకు సంబ ంధించిన కవులకు కవయిత్రులకు మంచి ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తున్నారు. తెలుగు భాషపై మమకారంతో సాహి తీ రంగంలో కొత్తనైన వివిధ ప్రక్రియలు కూడా వస్తున్నాయి.
కోయిల కూత కన్నా..తీయనైన తేనె కన్నా..ఎంతో మధు రమైనది మన తెలుగు భాష… అందుకే అమ్మ పాల తీయ్య దనాన్ని మాతృ భాషలో పొందిన మనం అందరం కూడా అమ్మ భాషను కాపాడుదాం..
గోస్కల. శ్రీలత రమేశ్‌
‌హుజురాబాద్‌

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!