వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అమ్మో దోమ..

September 5, 2019

మనిషి సుఖసంతోషాలతో ఉండాలంటే కేవలం డబ్బు, పరపతి సరిపోదు. దానితో పాటు మనిషి సంపూర్ణ ఆరోగ్యమంతో ఉండాలి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అని అంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, ఇతర విషజ్వరాల బారిన పడుతున్నారు. అందులో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం మనము, మన చుట్టూ పరిసరాలు అశుభ్రంగా ఉంచడం వలన వాటిలో ప్రాణాంతకమైన దోమలు ఆవిర్భవించి అవి కుట్టడం మూలాన విషజ్వరాలు ప్రసరిస్తున్నాయి.

ఒకప్పుడు సరదాగా మనకంటే దుర్భలంగా చూపించడానికి ‘దోమలా నలిపిస్తే’ అని అనేవారు కానీ అదే దోమ మనిషిని క్షణాల్లో నలిపేస్తుంది. ఈ మధ్య హైదరాబాద్‌లోని కంటోన్‌మెంట్‌ ‌ప్రాంతంలో గీతాంజలి అనే పాఠశాలలో ఏకంగా 30మంది పిల్లలకు జ్వరం సోకి వారిలో ఒక బాలుడు డెంగ్యూ బారినపడి మృతి చెందాడు. సంఘటన జరిగాక నాయకులు, అధికారులు  ప్రసార మాధ్యమాల ముందుకు వచ్చి ల్యాబుల సంఖ్య పెంచుతాము, డాక్టర్ల సంఖ్య పెంచుతాము, చికిత్స సెంటర్లు పెంచుతాము అని చెప్పడానికే సరిపోతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. పాఠశాలల యాజమాన్యాలకు కఠినమైన ఆదేశాలు జారీ చేయాలి. ప్రతివాడలో రోజు ఫాగింగ్‌ ‌చేయించాలి. ప్రజలను శుచిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి. గుంతలో నీరు లేకుండా ఇంటి యాజమానే శ్రద్ధ వహించాలి. ప్రతి వాడకు వోట్లు అడిగే విధంగా కాకుండా, శుచిశుభ్రత గురించి అవగాహన సభలు పెట్టినట్లయితే కొంతలోకొంత ప్రజలు చైతన్యవంతులవుతారు. అలానే ఇదేదో ప్రభుత్వ బాధ్యత అని కాకుండా ప్రతి వ్యక్తి ఉద్యమంలాగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూడాలి. ‘ప్రివెన్షన్‌ ఈజ్‌ ‌బెటర్‌ ‌దాన్‌ ‌క్యూర్‌’ అని అంటారు. ఫాగింగ్‌ ‌చేసి,  ఖాళీ ప్రదేశాలలో మొలిచే చెట్లను తొలగించి దోమలు రాకుండా అరికట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వెంటనే చర్యలు తీసుకొని విషజ్వరాలు తగలకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రభుత్వానికి కరుణామయమైన విన్నపం.

విచిత్రమేమిటంటే ఇటీవల దోమ ద్వారా ఒక కీలక సమాచారం లభించింది. వివరాల్లోకి వెళితే పాక్‌ అణువిద్యుత్‌ ‌కేంద్రంలో పనిచేస్తున్న 200 మంది చైనా ఇంజనీర్లు డెంగ్యూ బారిన పడడంతో వారు దవాఖాన పాలవడం తద్వారా ఆ వార్త మీడియా ద్వారా బహిర్గతం కావడం జరిగింది. అంటే పాకిస్తాన్‌ అణు కార్యమ్రాలకు చైనా పూర్తి సహకారం అందిస్తున్నదనే కీలకమైన రహస్య సమాచారం దోమల ద్వారా లభ్యం కావడం విశేషం.
– శ్రీకళ రాంపల్లి
 ప్రజాతంత్ర విలేఖరి,కరీంనగర్‌ ‌కల్చరల్‌