Take a fresh look at your lifestyle.

అమేథీలో రాహుల్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు

వెంట వచ్చిన ప్రియాంక, సోనియా, వాద్రా
‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ అమేథి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన బుధవారం తన నామినేషన్‌ ‌పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. రాహుల్‌ ‌వెంట ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్ ‌వాద్రా ఉన్నారు. నామినేషన్‌ ‌దాఖలు కంటే ముందు అమేథిలో రాహుల్‌, ‌ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌ ‌షోలో రాబర్ట్ ‌వాద్రాతో పాటు వారి పిల్లలు రేహన్‌, ‌మిరాయా కూడా పాల్గొన్నారు. ఇటీవలే కేరళలోని వయనాడ్‌ ‌లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్‌ ‌సందర్బంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులుల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఇవాళ అమేథీలో రోడ్‌ ‌షో నిర్వహించారు. అమేథీలోని జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయానికి రాహుల్‌ ‌తల్లి సోనియా గాంధీ నేరుగా తన కారులో వచ్చారు.

Leave a Reply

error: Content is protected !!