Take a fresh look at your lifestyle.

అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌భరతమాత కంటిలో నలుసు కానున్నారా..!

 అమృత్‌సర్‌ ‌జిల్లాలోని జల్లూపూర్‌ ‌ఖేర్‌ ‌గ్రామంలో 17 జనవరి 1993న జన్మించిన అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ఉనికి 2020లో ఢిల్లీ నగర శివారులో జరిగిన సుదీర్ఘ రైతు పోరాటంలో వినిపించడం, నేడు ‘బింద్రేన్‌వాలే – 2.0’ అంటూ దేశమంతా చర్చించుకునే స్థాయికి చేరుకోవడం చూస్తున్నాం. సీనియర్‌ ‌సెకండరీ విద్య అభ్యసించిన అనంతరం దుబాయ్‌కి మారిన దశాబ్దం తరువాత అమృత్‌పాల్‌ ‌తిరిగి సెప్టెంబర్‌ 2022‌న ఇండియాకు తిరిగి వచ్చి ఖలిస్తానీ దేశం కోసం వేర్పాటువాద ఉగ్రవాదిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో జర్నేయిల్‌ ‌సింగ్‌ ‌బింద్రన్‌ ‌వాలే (02 జూన్‌ 1947 – 06 ‌జూన్‌ 1984) ‌ఖలిస్థాన్‌ ఉద్యమ నేతగా స్వతంత్ర సిక్కు దేశం కోసం తీవ్రవాదిగా మారి 37వ ఏటనే ‘ఆపరేషన్‌ ‌బ్లూ స్టార్‌’‌లో చనిపోయారని మనకు తెలుసు. దుబాయిలో రవాణారంగ కంపెనీ వ్యాపారం చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన 30-ఏండ్ల అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ఆగష్టు 2022లో తిరిగి ఇండియాకు వచ్చారని తెలుస్తున్నది.
ప్రస్తుతం ఖలిస్థాన్‌ ఉద్యమకారుడిగా ప్రచారం అవుతున్న అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌స్వయం ప్రకటిత ‘వారిస్‌ ‌పంజాబ్‌ ‌ది(పంజాబ్‌ ‌వారసులు)’ అనబడే సంస్థకు (వ్యవస్థాపకుడు దీప్‌ ‌సిద్ధూతో ఎలాంటి సంబంధం లేని అమృత్‌పాల్‌ ‌సింగ్‌) ‌నాయకత్వం వహిస్తున్నాడు. దీప్‌ ‌సిద్ధూ రోడ్డు ప్రయాణంలో మరణించలేదని, పోలీసులే ఆయనను హత్య చేశారని ప్రచారం చేస్తూ పంజాబీ యువతలో ఆవేశం పుట్టిస్తున్న అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌చుట్టు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అనేక సందర్భాల్లో పంజాబీలను తన ఖలిస్థాన్‌ ఉద్యమ ఉపన్యాసాలతో యువత మనసుల్లో ఉద్యమ జ్వాలలు రగిలిస్తున్నాడు.
బింద్రన్‌ ‌వాలే 2.0గా అమృత్‌పాల్‌ ‌సింగ్‌ అవతరణ:
ఖలిస్థాన్‌ అనేది సాధారణ పదం కాదని, పంజాబీల ప్రత్యేక గుర్తింపు అని వేర్పాటువాద భావనలు వ్యాప్తి చేస్తూ మరో ‘బింద్రేన్‌ ‌వాలే – 2.0’ను తలపిస్తున్నాడు. ఝాట్‌ ‌వర్గానికి చెందిన ఇరువురు బింద్రేన్‌వాలే, అమృత్‌పాల్‌ ‌సింగ్‌లు తమ  రూపు, ఎత్తు, శరీర సౌష్టవంలో పోలికలను కలిగి ఉన్నారు. బ్రిందేన్‌వాలా సిక్కుల గురుబోధకుడు, ‘దందామీ తక్సల్‌’ ‌సంస్థ నాయకుడిగా భావించబడుతూ, ఎల్లవేళలా సాయుధ రక్షకుల నడుమ కదిలేవారు. బ్రిందేన్‌వాలే వ్యక్తిత్వానికి భిన్నంగా 12వ తరగతి వరకు మాత్రమే చదివిన అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌నేడు బింద్రేల్‌వాలే వారసుడిగా పంజాబీ యువతచే కీర్తించబడుతున్నాడు. అమృత్‌పాల్‌ ‌నేరుగా హింసాత్మక కార్యక్రమాలు నిర్వహించనప్పటికీ, తన ఉద్యమ స్వరంతో పంజాబీ అనుచరగణం, సహచరుల్లో హింసాగ్ని రేకెత్తిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించుటలో సఫలం అవుతున్నారు.
పోలీస్‌ ‌స్టేషన్‌పై ఆయుధాలతో దాడి:
17 ఫిబ్రవరి 2023లో ఒకప్పటి తన సహచరుడైన వీరిందర్‌ ‌సింగ్‌ ‌పంజాబీ పోలీస్‌ ‌స్టేషన్లో పిర్యాదు చేస్తూ అమృత్‌పాల్‌ ‌సింగ్‌తో పాటు అతని ఆరుగురు సహచరులు తనను కిడ్నాప్‌ ‌చేసి, హింసించారని పేర్కొన్నారు. ఈ పిర్యాదుకు స్పందించిన పంజాబీ పోలీసులు యఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసి లవ్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ను 23 ఫిబ్రవరిన అరెస్టు చేశారు. అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌సహచరులు, అభిమానులు వేల సంఖ్యలో ఆయుధాలు (గన్స్, ‌కత్తులు) ధరించి, గురు గ్రంత్‌ ‌సాహిబ్‌ ‌మత గ్రంధాన్ని చేతబట్టి అజ్నాలా పోలీసు స్టేషన్‌పై దాడి చేయడం, బారికేడ్లను ఛేదించడం, పర్నీచర్‌ను ద్వంసం చేయడం, పోలీసులను గాయపరవడం  చూస్తుండగానే జరిగి పోయింది. ఉద్యమం అనంతరం పోలీసులు తూఫాన్‌ అనడే లవ్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ను విడుదల చేయడానికి అంగీకరించడం కూడా చూసాం. తదనంతరం అమృత్‌పాల్‌ ‌సింగ్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు కొనసాగడం, పంజాబ్‌లో ఇంటర్నెట్‌ ‌సేవలను కూడా కొన్ని రోజులు ఆపి వేయడం జరిగింది. గత రెండు వారాలుగా (18 మార్చి 2023 నుంచి) అమృత్‌పాల్‌ను పట్టుకోవడానికి భారీ పంజాబీ పోలీసు యంత్రాంగం అన్ని విధాలుగా శోధనలు చేస్తున్నారని తెలుస్తున్నది.
పాకిస్థానీ ‘ఐయస్‌ఐ’‌తో సంబంధం:
సిక్కిజమ్‌లోని బోధనలు తన ఉపన్యాసాల్లో వినియోగించనప్పటికీ సిక్కు గురువులు ‘స్వతంత్ర పంజాబీ భూమి’ కోసం చేసిన పోరాటాలు మరువలేనివని అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌తన ప్రసంగాల్లో ఉద్రేకంగా యువతను ఉర్రూతలూగించే వారు. తమకు భారత్‌ ‌నుంచి ఆజాద్‌? ‌కావాలని తరతరాలుగా కొందరు వేర్పాటువాదులు పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌చేపట్టిన ఉద్యమాలకు పాకిస్థానీ వేర్పాటువాదులు, ఐయస్‌ఐ ‌కూడా ఖలిస్థానీ ఉద్యమకారులకు ప్రత్యేక శిక్షణను ఇస్తూన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ఉద్యమ ప్రసంగాలు నేటి డిజిటల్‌ ‌యుగంలో పలు సామాజిక మాద్యమాల్లో క్షణాల్లో వైరల్‌ ‌కావడం కూడా తన పోరాట స్పూర్తికి నిదర్శనంగా నిలుస్తున్నది. తాను పంజాబీ, సిక్కు వర్గానికి చెందిన వాడినని, ఇండియా నుంచి వేర్పాటును కోరుకుంటున్నామని ప్రత్యక్షంగా చెప్పుకునే అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌కదలికలు రాబోయే రోజుల్లో మరో ఖలిస్థాన్‌ ఉద్యమానికి ఆజ్యం పోయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న అమృత్‌పాల్‌ ‌సింగ్‌ను అరెస్ట్ ‌చేయడానికి ప్రభుత్వం 19,000 పోలీసు బలగాలను ((ఆర్‌ఏయఫ్‌, ఆర్‌ఏడబ్ల్యూ, యన్‌ఐఏ, ఐబీ లాంటి విభాగాల) వినియోగిస్తూ వేటను కొనసాగిస్తున్నారు. పోలీసులకు సరెండర్‌ ‌కావడానికి అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌మూడు శరతులు (అరెస్టుకు బదులు సరెండర్‌ అయినట్లు, పంజాబీ జైలులో ఉంచడం, జైల్‌ ‌లేదా పోలీస్‌ ‌కస్టడీలో హింసాత్మకంగా వేదించకూడదని) పెడుతున్నట్లు కూడా తెలుస్తున్నది. నేడు మరో బింద్రన్‌వాలే ఎదగకూడదని, దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లకూడదని, ప్రత్యేక ఖలిస్థాన్‌ ‌పేరున పంజాబ్‌ ‌దేశం ఏర్పడడం అసాధ్యమని దేశ పౌరులు కోరుకుంటున్నారు. ఉగ్రవాద దారులు హింసను మాత్రమే పోషిస్తాయని, దేశం ముక్కలు కావడం హిందూస్థాన్‌కు సమ్మతంకాదని నమ్ముదాం, ఆవేశం అనర్థదాయకమని తలుస్తూ, శాంతియుతంగా సంయమనంతో సరైన మార్గాల్లో సాధ్యమయ్యే కోర్కెలను తీర్చుకుందాం.
 జై భారత్‌.. ‌జై హింద్‌.
image.png
‌డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply