వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అమర వీరులకే కాదు.. బతుకున్నవారికీ సాయపడండి

April 2, 2019

‘‌మరణించిన జవాన్ల శవపేటికలపై త్రివర్ణ పతాకాలను కప్పి, నివాళులర్పించినంత మాత్రాన వారి ఆత్మకు శాంతి చేకూర్చినట్టు కాదు. వారి భార్యా బిడ్డలను ఆదుకోవాలి, వారి కుటుంబాలు సరైన రీతిలో స్థిరపడేట్టు చేయాలి. అమర జవాన్ల పేరు చెప్పి జనాకర్షణ కోసం ఏ పార్టీ లేదా కూటమి ప్రయత్నించినా అది క్షంతవ్యం కాదు.’ఎన్నికల సీజన్‌లో అమర జవానుల త్యాగాలను తమ ఖాతాలోకి వేసుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అమరజవాన్లకు సమాధులు నిర్మిస్తామనీ, స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేస్తామని ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాయి. అయితే, ఆర్మీలో పని చేసి రిటైరైన వారి గురించి. అమరవీరుల కుటుంబాల గురించి రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడం శోచనీయం. అమర జవాన్ల పట్ల ఎంత ప్రేమ, భక్తి, గౌరవాలను ఒలకబోస్తున్నారో సైన్యంలో పని చేసిన వారికి సదుపాయాలు కల్పించడంలో, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడంలో అంత శ్రద్ధ తీసుకోవాలి. జవాన్లు అంటే సైన్యంలో పని చేసే వారు మాత్రమే కాదు, పారామిలటరీ దళాలు, హోం శాఖ పరిధిలో పని చేసే ఇతర భద్రతా దళాల ఉద్యోగులు కూడా వస్తారు. యూనిఫారంలో ఉన్న వారు ఎంత మానసిక క్షోభకూ, శారీరక కష్టాలకు గురవుతారో మనం తెలుస •కోవడం అత్యవసరం. మరణించిన జవాన్ల శవపేటికలపై త్రివర్ణ పతాకాలను కప్పి, నివాళులర్పించినంత మాత్రాన వారి ఆత్మకు శాంతి చేకూర్చినట్టు కాదు. వారి భార్యా బిడ్డలను ఆదుకోవాలి, వారి కుటుంబాలు సరైన రీతిలో స్థిరపడేట్టు చేయాలి. అమర జవాన్ల పేరు చెప్పి జనాకర్షణ కోసం ఏ పార్టీ లేదా కూటమి ప్రయత్నించినా అది క్షంతవ్యం కాదు.
2018కి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణా ంకాల ప్రకారం 80 మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్ర సాయుధ దళాల్లో 2012-18 మధ్య ఏడాదికి సగటున 116 మంది వంతున 700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరంతా వృత్తిపరమైన సమస్యల వల్ల కాకుండా, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. కార్పొరేట్‌ ‌సామాజిక బాధ్యత కింద దేశంలోని కార్పొరేట్‌ ‌కంపెనీలు సెలెబ్రిటీలు ప్రస్తుతం పని చేస్తున్న సైనికులకూ, వారి కుటుంబాలకూ సేవలందించవచ్చు.
దాతృత్వాన్ని అలవాటు చేసుకోండి
వాస్తవాధీన రేఖ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో సైనికులలో అధిక సంఖ్యాకులను సరిహద్దులకు పంపుతున్నారు. ఇలా పంపడం శాశ్వత ప్రాతిపదికపై జరుగుతోందో, లేక తాత్కాలికంగా జరుగుతోందో ఇదమిత్థంగా తెలియదు. పరిమిత వనరులు, ప్రాధాన్యతల కారణంగా ఈ సైనికు లంతా తాత్కాలిక గుడారాల్లో జీవిస్తున్నారు. అలాగే, కేంద్ర రిజర్వు పోలీసు (సిఆర్పిఎఫ్‌) ‌బెటాలియన్లను కూడా కొత్త ప్రాంతాలకు పంపుతున్నారు. వీరికి వసతి కల్పించే బాధ్యత ఏ రాష్ట్రం అయితే పిలిపించిందో ఆ రాష్ట్రానిదే. వీరికి సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్లు గుడారాల వెలుపల జీవించడం ఒక్క శ్రీనగర్‌ ‌లోనే కాదు, డిల్లీలో కూడా నేను చాలా మందిని చూశాను. వీరెంత కాలం ఆయా ప్రాంతాల్లో పని చేస్తారనేది వారికి నిర్మించే గుడారాలను బట్టి అంచనా వేయవచ్చు. వాన వచ్చినా, ఎండలు కాసినా వీరంతా ఆరు బయటే కాలక్షేపం చేయాల్సి వస్తోంది. కార్పొరేట్‌ ‌సంస్థలు వీరి కోసం ప్రీఫాబ్రికేటెడ్‌ ‌గుడిసెలను ఎందుకు ఏర్పాటు చేయకూడదు. కొద్ది సంవత్సరాల క్రితం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డిఆర్‌ ‌డిఒ) సైనికుల కోసం ఫ్రీఫాబ్‌, ‌వాతావరణ పరిస్థితులను తట్టుకునే హట్స్ ‌నిర్మించింది. అత్యున్నతమైన ఎత్తైయిన ప్రాంతాల్లో సైనికుల కోసం నిర్మించింది. అయితే, ఇవి ఏమాత్రం సంతృప్తికరంగా లేవు. కార్పొరేట్‌ ‌సంస్థలు రంగంలో ప్రవేశించి డిఆర్‌ ‌డిఒ సహకారంతో ఇలాంటి హట్స్ ‌నిర్మించవచ్చు. విరాళాలు వీలు కాకపోతే ఇలాంటి సేవలు అందించవచ్చు. సబ్సిడీ పద్దతిలో హట్స్‌ను దిగుమతి చేసుకోవచ్చు.
కుటుంబ వసతి
సైన్యంలో పని చేసే జవాన్లలో చాలా మంది ఓ మాదిరి పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన వారే. వీరంతా స్వస్థలాలకు దూరంగా పోస్టింగ్‌లు ఇవ్వబడిన వారే. వారి యవ్వనమంతా కుటంబాలకు దూరంగానే గడిచిపోతోంది. భార్య, బిడ్డలను వదిలి దూర ప్రాంతాల్లో వారు నివసించాల్సి వస్తోంది. పిల్లలకు చక్కని చదువు చెప్పించలేకపోతున్నారు. భార్యా బిడ్డల ప్రేమానురాగాలకు దూరంగా నివసిస్తున్నారు. వారి పిల్లలకు సరైన విద్యా సౌకర్యాలను కల్పించలేకపోతున్నారు. మంచి వసతి, పార్కులు, వైద్య శాలలకు దూరంగా వారు జీవించాల్సి వస్తోంది. సైనికులకు పొగడ్తలు కాదు కావల్సింది వారికీ, వారి పిల్లలకూ సరైన వసతి, సౌకర్యాలు కావాలి.
స్కాలర్‌ ‌షిప్‌లు పూర్తిగా చెల్లించాలి
సామాజిక మాధ్యమాల్లో జవానుల గురించి ఊదరగొట్టడానికి బదులు జవాన్ల పిల్లలకు పూర్తిగా స్కాలర్‌ ‌షిప్‌లు మంజూరు చేయాలి. ఆఫీసర్‌ ‌ర్యాంకు దిగువన పని చేసే జవాన్ల పిల్లలకు మంచి చదవు, వైద్య సౌకర్యాలు కల్పించాలి, ఒక్కొక్క విద్యాసంస్థలో వంద స్కాలర్‌ ‌షిప్‌లు ఏర్పాటు చేయాలి. దీంతో ప్రపంచంలోనే భిన్నమైన వాతావరణంలో వారు జీవించేందుకు వీలు కలుగుతుంది.
నైపుణ్యాభివృద్ది పునర్‌ ఉపాధి
ప్రభుత్వ విధానాల్లో ఇది ఒకటి. అయితే, ఇది పరిమితమైన విజయం సాధించింది. కార్పొరేట్‌ ‌సంస్థలు పైనుంచి ఆదేశాలుగానే భావిస్తున్నాయి తప్ప కచ్చితమైన చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు లేకపోవడమే కారణం. జాతీయ భావాలు మన ఛాతీలపై పరుచుకోవాలంటే ప్రతి కార్పొరేట్‌ ‌సంస్థ నైపుణ్యాభివృద్ధి కోసం కొంత సొమ్మును వెచ్చించాలి. మాజీ సైనికులకు తక్కువ కాల వ్యవధి కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వాలి. కార్పొరేట్‌ ‌రంగంలో ని సంస్థల్లో అలా శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పించాలి. కొత్తగా ఏర్పాటైన ప్రతి కంపెనీ రక్షణోత్పత్తి విధానం నుంచి లబ్ధి పొందాలని చూస్తుంది. దేశ జాతీయ భద్రత పట్ల వాటికి గల అంకిత భావాన్ని కనుగొనేందుకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ, వాటిల్లో శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పించాలని ఆదేశించాలి. ఆఫీసర్‌ ‌కేడర్‌లో మాత్రమే కాదు, అన్ని స్థాయిల్లో వారికి ఉపాధి కల్పించాలి.
జాతీయ వాదులారా… బతికున్న వారికి సాయపడండి… వారు అసువులు కోల్పోయేవరకూ ఆగకండి…..

– గజాలా వహాబ్‌
‌ఫోర్స్ ‌న్యూస్‌ ‌మ్యాగజైన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌